You Are Here: Home » ఇతర » తెలుగు వెలుగుల దార్శనికులు

తెలుగు వెలుగుల దార్శనికులు

తెలుగు సినిమా స్వర్ణోత్సవాలు…వజ్రోత్సవాలు జరుపుకుని ఎనిమిది పదుల వయసుదాటి శత వసంతాలకు పరుగులు తీస్తోంది. ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో సాంకేతికంగా ఎన్నో మార్పులు సంభవించాయి. మూడు తరాల వారసులను తెలుగు ప్రేక్షకులు సహృదయంతో ఆదరించారు. మరి సినిమాకు చుక్కానిలాంటి దర్శకులు ప్రతి దశాబ్దానికీ ఎందరెందరో పుట్టుకొస్తునే ఉన్నారు. అందరి గురించి చర్చించడం చాలా కష్టం. కనీసం ఆ దశాబ్దాన్ని తమ ప్రతిభా పాటవాలతో తమకు అనుకూలంగా మార్చుకుని అచ్చ తెలుగు సినిమాలను అశేష ప్రేక్షకులకు అందించిన అజరామరమైన కొందరు దర్శకుల గురించి తెలుసుకుందామా..
200pa31…40 : తెలుగు సినిమాలకు సంబంధించి 1931- 1940 ఒక కీలకమైన మలుపు అని చెప్ప వచ్చు. ఎందుకంటే తొలి తెలుగు టాకీ చిత్రంగా చెప్పుకునే ‘భక్తప్రహ్లాద ’ నిర్మితమైంది 1931 లోనే. 1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా ‘భక్త ప్రహ్లాద’తో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు. ఈ కాలంలో ప్రతిభను కనపర చిన దర్శకులలో కొందరు సి.పుల్లయ్య (లవకుశ), సిహెచ్‌.నరసింహారావు(సీతా కళ్యాణం), హెచ్‌.వి .బాబు (కనకధార), పి.పుల్లయ్య (శ్రీవెంక టేశ్వర మహాత్యం), సిహెచ్‌.నారాయణ (మార్కండేయ). 1936లో కృత్తి వెన్ను సోదరులు నిర్మించిన ‘ప్రేమ విజయం’ తెలుగులో మొదటి సాంఘిక చిత్రం. ఇది అంతగా విజ యవంతం కాలేదు. తరు వాత హెచ్‌.ఎమ్‌.రెడ్డి నిర్మించిన ‘గృహలక్ష్మి’ సినిమాతో చిత్తూ రు నాగయ్య సినీరంగంలో ప్రవేశించారు.

40….50: ఈ దశాబ్దంలో 91 సినిమాలు నిర్మిం చబడ్డాయి. వాహినీ స్టూడియోస్‌ ప్రారంభించ బడింది. నేపధ్యగానం ప్రక్రియ స్థిరపడింది. ఈ దశకంలో ఎందరో కళాకారులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. తరువాతి కాలంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కావడా నికి వారి ప్రతిభ, కృషి ముఖ్యమైన కారణాలు. అలా వచ్చినవారిలో కె.వి.రెడ్డి, ఎల్‌.వి.ప్రసాద్‌, భరణి రామకృష్ణా రావు, ఘంటసాల బలరామయ్య, కె.బి.నాగభూషణరావు, కె.ఎస్‌.ప్రకాశరావు, బి.ఎ.సుబ్బారావు తదితర దర్శకులను ప్రముఖంగా చెప్పుకోవాలి.

ADURTa50…60: ఈ దశకంలో 327 సినిమాలు వెలువడి నాయి. ఇది తెలుగు సినిమాలకు స్వర్ణయు గమని చెప్పవచ్చును. కొత్త నటీనటుల ప్రవేశ పరంపర కొనసాగింది. కొత్త చిత్ర నిర్మాణ సంస్థలు చాలా వెలి సాయి. హైదరా బాదులో సారధి స్టూడియోస్‌ ప్రాంభమైంది. వారి మొదటి చిత్రం ‘మాయింటి మహ లక్ష్మి’. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం చలన చిత్రాలకు వివిధ అవార్డులను ప్రవేశ పెట్టింది. ఇక దర్శకుల విషయానికొస్తే ఆదుర్తి సుబ్బారావు (అమర సందేశం) సినిమా దర్శకత్వంలో కొత్తపోకడలు ప్రవేశపెట్టారు. వేదాతం రాఘవయ్య (దేవదాసు), తాతినేని ప్రకాశరావు (పల్లెటూరు), తాపీ చాణక్య (రోజులు మారాయి), యోగానంద్‌ (అమ్మలక్కలు), రజనీకాంత్‌ (వదినగారి గాజులు), కె.బి.తిలక్‌ (ముద్దుబిడ్డ), కమలాకర కామేశ్వరరావు (చంద్రహారం), సి.ఎస్‌.రావు (శ్రీకృష్ణ తులాభారం), వి.మధుసూదనరావు (సతీ తులసి) వంటి ప్రతిభావంతులైన దర్శకులు ఈ దశకంలో వెండితెరను ఒక వెలుగు వెలిగించారని చెప్పాలి.

60….70: ఈ దశకంలో మొత్తం 552 సినిమాలు నిర్మించబడ్డాయి. మొదటి పూర్తి రంగుల చిత్రం ‘లవకుశ’ వెలువడింది. సాంకేతిక విలువలు, ప్రధానంగా ఫిల్మ్‌ ప్రాసెస్సింగ్‌ అభివృద్ధి చెందాయి. నంది అవార్డులు ప్రారంభమయ్యాయి. దర్శకుల లో బాపు (సాక్షి), కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ (లోగుట్టు పెరుమాళ్ళ కెరుక), కె.విశ్వనాధ్‌ (ఆత్మగౌరవం), ప్రత్యగాత్మ (భార్యాభర్తలు), ఎమ్‌.మల్లికార్జునరావు, (గూఢచారి 116), తాతినేని రామారావు, (నవరాత్రి), పేకేటి శివరాం (చుట్టరికాలు) ఎన్నదగినవారు. నటుడు ఎస్‌.వి.రంగారావు రెండు సినిమాలకు (చదరంగం, బాంధవ్యాలు) దర్శకత్వం వహిం చారు. హీరోయిన్‌ సావిత్రి కూడా ‘మాతృదేవత’ చిత్రా నికి దర్శకత్వం వహించారు.

అయితే ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వంలో వెలువడిన ‘మూగ మనసులు’ ఈ దశాబ్దపు సంచలన విజయం సాధించిన సినిమాగా పేరుగాంచింది. ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వర రావు కలసి చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై నిర్మించిన సందేశాత్మక చిత్రాలు సుడిగుండాలు, మరో ప్రపంచం ఆర్ధికపరంగా విజయవంతం కాలేదు. జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు , రాజ్యం పిక్చర్స్‌ వారి నర్తనశాల అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడ్డాయి.

originaa70….80: ఈ దశాబ్దంలో మొత్తం 758 సినిమాలు విడుదల య్యాయి. వీటిలో చాలావరకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రనిర్మాణానికి అయ్యే అదనపు ఖర్చును భరించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో రాష్ట్రంలో చిత్రనిర్మాణం పుంజుకుంది. హీరో కృష్ణ పాశ్చాత్య కౌబోయ్‌ కధారీతిలో మోసగాళ్ళకు మోసగాడు సినిమా నిర్మించారు. దసరా బుల్లోడు చిత్రంతో వి.బి.రాజేంద్ర ప్రసాద్‌ దర్శకుడ య్యారు. దర్శకులలో దాసరి నారాయణరావు, కె.రాఘవేం ద్రరావు తమ ప్రతిభను, వైవిధ్యాన్ని ప్రదర్శించారు. కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన అంతులేని కధ, మరో చరిత్ర మంచి విజయం సాధించాయి. వి.రామచం ద్రరావు దర్శకత్వం వహించిన అల్లూరి సీతారామరాజు తెలుగులో మొట్టమొదటి సినిమా స్కోప్‌ చిత్రం.

దేవతలారా దీవించండి సినిమాను నలుపు-తెలుపు, సినిమా స్కోపులో నిర్మించారు. దర్శకులుగా పి.సి.రెడ్డి, లక్ష్మీ దీపక్‌, సింగీతం శ్రీనివాసరావు, కె.బాపయ్య, రచయి తలుగా జంధ్యాల, సత్యానంద్‌, పరుచూరి బ్రదర్స్‌ బాగా రాణించారు. చాలా సినిమాలకు చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు.

4tg51980-1990: ఈ దశాబ్దంలో రికార్డు స్థాయిలో 1665 సినిమాలు నిర్మించబడ్డాయి. కానీ వాటిలో విజయవంతమైనవి 25% లోపే. నందమూరి తారక రామారావు నటించిన సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్‌ చౌదరి, కొండవీటి సింహం, నాదేశం వంటి చిత్రాలు ఆయన రాజకీయాలలో అడుగుపెట్టడానికి అనుకూలమైన సందేశాలు ఇచ్చాయి. ఈ సమయంలో దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి అగ్రస్థానంలో ఉన్న దర్శకులు. కోడి రామకృష్ణ, జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ కూడా విజయవంతంగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. భైరవి, అహనా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగు స్తంభాలాట వంటి చిత్రాలు విజయవంతమై హాస్య చిత్రాలకు క్రొత్త ఒరవడి సృష్టించాయి.

శివ చిత్రం విజయం ద్వారా రాంగోపాల వర్మ అనే ప్రతిభావంతుడైన యువ దర్శకుడు చిత్ర రంగానికి పరి చయమయ్యారు. హీరో కృష్ణ దర్శకత్వంలో తెలుగులో మొదటి 70 ఎమ్‌.ఎమ్‌. సినిమాగా ‘సింహాసనం’ నిర్మితమయింది. సినిమా అభివృద్ధికోసం ఎ.పి.స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్థాపించబడింది. 1984లో 2 లక్షలు రూపాయలున్న సబ్సిడీ 1989నాటికి 3 లక్షలుకు పెంచారు. పన్నులలో స్లాబ్‌ సిస్టమ్‌ ప్రవేశ పెట్టారు. అందువలన మిశ్రమ ఫలితాలు సంభవించాయి. 1981 నుండి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రారంభమైనది.

1990-2000: దాదాపు 950 స్ట్రయిట్‌ తెలుగు చిత్రాలు ఈ కాలంలో విడుదలయ్యాయి. ఇక ఈ కాలంలో బి.గోపాల్‌, ఈవీవీ, రాంగోపాల్‌వర్మ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, భీమనేని శ్రీనివాసరావు వంటి క్రియేటివ్‌ దర్శకుల హవా పెరిగింది.

2001-2010: ఈ దశాబ్దంలో పూరి జగన్నాధ్‌, రాజమౌళి, వి.వి.వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, బోయపాటి శ్రీనివాస్‌, క్రిష్‌ లాంటి బాక్సాఫీస్‌ కలెక్షనుల శాసించే దర్శకులు వచ్చారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top