You Are Here: Home » ఇతర » తెలుగు తల్లికి నీరాజనం

తెలుగు తల్లికి నీరాజనం

గోదారి గలగలలు, కృష్ణమ్మ పరవళ్లను తలపించే జనప్రవాహం… తేనెల మాటల ఊటలతో కూడిన తియ్యటి తెలుగు సాహిత్యం… ఝుమ్మంది నాదం- అంటూ సాగే సంగీతం… పచ్చని పల్లెలను పులకింపజేసే జానపదం…. ఇలా ఒకటేమిటి ఆంధ్రభోజుడు అలనాటి శ్రీకృష్ణదేవరాయల వారి భువన విజయం తిరునగరికి వేంచేసిందా!… శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణం లో జరుగుతున్న నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు రెండవ రోజు కూడా తెలుగు సుగంధాలను వెద జల్లారుు. సభలు, సమావేశాలు, సినీ తారల తళుకుబెళుకులు, రంగస్థలంపై రంెకలేసిన ఉద్దండులు, మరోపక్క ప్రదర్శనలు, చర్చావేదికలు వెరసి 4వ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగుజాతిని విశ్వవిఖ్యాతిగాంచే దిశగా సాగారుు.

దేశ, విదేశాల నుంచి విచ్చేసిన తెలుగు భాషాభిమానులు, రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన తెలుగువారు మహాసభలలో పాల్గొని తన్మయత్వం చెందారు. తిరువీధులు జనప్రవాహంతో జీవనదులను తలపిస్తే, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణం తెలుగువారితో జనసముద్రంలా మారింది. రెండవరోజు మహాసభల ప్రారంభం లో రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌, మంత్రులు టి.జి.వెంకటేష్‌, గల్లా అరుణకుమారి తదితరులు ప్రసంగిస్తూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని వివరించారు. తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. తెలుగుజాతి గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలు కళాశాలల నుంచి విద్యార్థులు పంచెకట్టుతో, విద్యార్థినులు పరికెణి ఓణీలతో తెలుగు సంస్కృతి ఉట్టిపడుతూ మహాసభలకు హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

చర్చావేదికల్లో ‘బోధనా భాషగా తెలుగు అమలు-తీరుతెన్నులు’ అన్న అంశంపై తిరుపతి ఆచార్య శివరత్నం రెడ్డి, పాఠ్యప్రణాళిక, బోధనా భాష అన్న అంశంపై ఆచార్య నిర్మలా జ్యోతిలు ప్రసంగించారు. ఆచార్య ఎన్‌. గోపి అధ్యక్షతన ఆధునిక సాహిత్యం, భావకవిత్వం, జాతీయోద్యమ కవిత్వం, విప్లవ కవిత్వం, అభ్యుదయ కవిత్వం తదితర అంశాలపై చర్చాగోష్టి జరిగింది. కాగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అధ్యక్షతన స్ర్తీవాద సాహిత్యం, దళిత సాహిత్యం, ముస్లింవాద సాహిత్యం, ప్రాంతీయవాద సాహిత్యం తదితర అంశాలపై చర్చాగోష్టి జరిగాయి. ఆచార్య కె.కుసుమకుమారి అధ్యక్షతన జానపద కథాగాధలు, వృత్తిపురాణాలు, తెలుగు భజన సంప్రదాయాలపై చర్చాగోష్టి నిర్వహించారు.

Groupడాక్టర్‌ ఎల్‌.ఆర్‌.వెంకటేశ్వరరావు అధ్యక్షతన లలితకళలు, సంగీతంపైన, డాక్టర్‌ పప్పు వేణుగోపాలరావు అధ్యక్షతన నాట్యం, కూచిపూడి నృత్యం, విజయనగర కాలంలో నాట్యకళా వైశిష్ట్యంపై చర్చా గోష్టులు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ కార్యనిర్వహణాధి కారి ఐ.వై.ఆర్‌.క్రిష్ణారావు అధ్యక్షతన వ్యవసాయ రంగంపై జరిగిన చర్చా వేదికలో ఐ.ఎ.ఎస్‌ అధికారులు రాణికుముదిని, కె.మధుసూదన్‌రావు, కె.ప్రవీణ్‌ కుమార్‌లు తమ ప్రసంగాలు వినిపించారు. ఆధ్యాత్మిక సదస్సులో టిటిడి ఇఓ ఎల్‌.వి.సుబ్రమణ్యం అధ్యక్షతన తెలుగులో వేదాలు-దర్శనాలు తదితర అంశాలపై చర్చాగోష్టి జరిగింది. అదె్వైత్వం-ఆధ్యాత్మిక చైతన్యంపై సామవేదం షణ్ముఖశర్మ ప్రసంగించగా, దె్వైత దర్శనం-ధార్మిక మానవుని నిర్మాణంపై శ్రీశ్రీ ఆనంద తీర్ధాచార్యులు ప్రసంగించారు.

– బండపల్లె అక్కులప్ప, మేజర్‌న్యూస్‌ బ్యూరో, తిరుపతి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top