You Are Here: Home » చిన్నారి » తెలివైన సమాధానం

తెలివైన సమాధానం

ఒక ఎలుగుబంటి, ఒక పులి ‘‘ఏకాలం చల్లగా ఉంటుంది?’’ అనే విషయంపై వాదించుకుంటున్నాయి. ‘‘శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది’’ అని అంది పులి.‘‘నేను ఒప్పుకోను. ఎందుకంటే శీతాకాలంలో నాకు చలి వేయదు. వర్షాకాలంలోనే నాకు చాలా చలి వేస్తుంది. కాబట్టి వర్షాకాలమే చాలా చల్లగా ఉంటుంది.’’ అంటూ వాదించింది ఎలుగుబంటి. ఇంతలో ఒక వ్యక్తి అటువైపు వచ్చాడు. అవి తమ వాదన గురించి అతనితో చెప్పాయి. ఆ వ్యక్తి జవాబు కోసం ఆలోచించసాగాడు.

వెంటనే పులి అతన్ని ప్రక్కకి తీసుకెళ్ళి ‘‘చూడు నాకు వ్యతిరేకంగా సమాధానం చెప్పావంటే నిన్ను చంపేస్తాను’’ అని అంది ఆ వ్యక్తి మళ్ళీ ఆలోచనల్లో పడిపోయాడు. ఎలుగుబంటి కూడా అతని పక్కకి తీసుకెళ్ళి పులి బెదిరించినట్టే బెదిరించింది. అప్పుడు అతను ‘‘వర్షాకాలంలో చలిగా ఉండదు. శీతాకాలంలో చలిగా ఉండదు. మన ఒంటికి చల్లగాలులు తగిలినప్పుడే మనం చలితో వణికిపోతాము. చల్లగాలులు ఏడాదిలో ఎప్పుడైనా వీస్తాయి.’’ అని చాలా తెలివిగా చెప్పాడు. అతని జవాబు వాటికి నచ్చింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top