You Are Here: Home » సినిమా » పాటలు » తులసి (2007)- వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

తులసి (2007)- వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

పల్లవి :
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగ చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా
బాధ కూడ హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా
చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి
వచ్చాయే నువ్వే నవ్వంగ
నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి
చేరాయే నువ్వే చూడగా

చరణం : 1
నా పేరే అనుకుంటూ
నీ పేరు నేను రాశానే
నా రూపే అనుకుంటూ
నీ రూపు నేను గీశానే
తియ్యంగా తీవ్రంగా
ఏదో ఏదో అవ్వంగ
ప్రేమంటూ కానే కాదంటా
గిట్టంగా కొట్టంగా
ప్రేమను మించే పదమింక
మన జంటే కనిపెట్టాలటా

చరణం : 2
గాలైనా నిను చుడితే
ఎనలేని ఈర్ష్య కలిగిందే
నే లైనా నిను తడితే
ఎదలో అసూయ పెరిగిందే
గాఢంగా గర్వంగా
జోడి మనమే కట్టంగా
ఏడే జన్మలు సరిపోవంటా
దేవుళ్లే మనకోసం పగలురేయి పనిచేసి
ఎన్నో జన్మలు సృష్టించాలటా

చిత్రం : తులసి (2007)
రచన : చంద్రబోస్
సంగీతం : దే విశ్రీ ప్రసాద్
గానం : వేణు, సునీత

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top