You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు » తిరుమలనాథ కొండ

తిరుమలనాథ కొండ

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా మనదేశంలో కూడా ఇటీవలి కాలంలో వారాం తపు పర్యటనల ప్రాముఖ్యం పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాల్లో… ప్రత్యేకించి ఉద్యోగ కుటుం బాల్లో అరుుతే, ఒకటి రెండు రాషాట్రలు మినహా మిగతా అన్ని రాషాట్రల్లోనూ వారానికి ఆదివారం ఒకటే సెలవురోజు. మరి ఈ ‘ఒక్కరోజు వెళ్ళి వచ్చే పర్యాటక స్థలాలు… నగరాల చుట్టు ఎన్ని ఉన్నారుు?’ అనే ప్రశ్నకు సమాధానం ‘అలాంటి స్థలాలు చాలా అరుదుగా ఉన్నారుు’ అని వస్తుంది. అలాంటి అరుదైన పర్యాటక స్థలాల్లో ఒకటి ‘తిరుమలనాథ కొండ’.

తిరుమలనాథ కొండ మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం పెద్ద రేవళ్ళ గ్రామ పరిధిలో ఉంది. హైదరా బాద్‌ నుండి బాలానగర్‌ మీదుగా ఈ ప్రాంతానికి 80 కిలోమీ టర్లు. ప్రకృతిని ఇష్టపడేవారు షాద్‌నగర్‌, బూర్గుల మీదుగా వెళ్తే 70 కిలోమీటర్లు. అయితే రెండవ దారిలో వెళ్ళేవారు సుమారు 10 కిలోమీటర్లు కచ్చా రోడ్డు మీద వెళ్ళవలసి ఉం టుంది. ప్రకృతిని ఎంతో ఇష్టపడే నేను… నా సీనియర్‌ మిత్రు లు బుచ్చిరెడ్డి, దేవేందర్‌ త్రిపాఠీ కలిసి రెడ్డి గారి కారులో బూర్గుల మీదుగానే వెళ్ళాము.

ప్రకృతి సోయగాల నడమ…
aalayamబూర్గుల గ్రామ పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. నిజా నికి వర్షాకాలంలో పంటలతో పచ్చగా అలరారవలసిన బూర్గు ల భూములు బీడుపోయి వర్షానికి పచ్చని గరిక గడ్డి సమానం గా పెరిగి కావాలసి పెంచిన లాన్‌లలాగా కనిపిస్తాయి. గుట్టబో ర్ల ఏటవాలుల్లో రైతులు మలుచుకున్న చిన్నచిన్న పంటమడు లు అలా గరిక గడ్డితో పచ్చని రంగు పులుముకొని ఊటీ, అస్సాం టీ, కాఫీ పైరులను తలపిస్తాయి. ఆ మడుల మధ్య పల్లం వైపు చిన్నచిన్న నీటి ఏరులు ప్రవహిస్తున్నాయి. ఆ పచ్చ ని మడుల మధ్యే అక్కడక్కడా తెల్లతెల్లని ఆవుల మందలు, నల్ల నల్లని బర్రెల మందలు, గొర్రెల మందలు పచ్చిక మేస్తూ తిరు గాడుతాయి. ఇవన్నీ చూశాక ఇక ఊటీ వెళ్ళడం దండగ అనిపిస్తుంది.

ఇక తిరుమలనాథ కొండ ఎక్కిన తరువాత మనల్ని మనం మరచిపోక తప్పదు. అంత అందంగా ఉంటాయి దాని పరిస రాలు. తిరుమలనాథ కొండ చుట్టూ సుమారు పది కొండలు న్నాయి. వాటిలో అన్నింటి కన్నా పెద్దది ఇదే. కాబట్టి ఈ కొండ పైకి ఎక్కితే మిగతావి చిన్న కుప్పల్లాగా అందంగా కనిపిస్తాయి. ఈ కొండ వాయువ్యంలో ప్రారంభమై ఒక లోయ ఆగ్నేయం వైపు అలవోకగా సాగిపోతుంది. ఆ లోయలో ఏపుగా పెరిగిన ఎర్రని భూముల మధ్య పచ్చని వలయం లాగా ఒక చిత్రకా రుని కాన్వాస్‌పై పెయింటింగ్‌లా కనిపిస్తాయి. వాటి పైనుంచి వీస్తున్న ఈదరగాలి మన ముంగురులను, దుస్తులను రెపరెప లాడిస్తూ గిలిగింతలు పెడుతుంది. కొండ శిఖరం పైకి ఎక్కి కొండకు తూర్పున కొనసాగుతున్న కచ్చా రోడ్డును చూస్తే అది పచ్చని వెంట్రుకల (పక్కనున్న చెట్టతో కూడిన లోయ) మధ్య గోధుమ వర్ణము పాపిటలాగా అందంగా కనిపిస్తుంది.

తిరుమలనాథ కొండ ప్రకృతి సౌందర్యంతో పవిత్రమైందన డానికి నిదర్శనంగానేమో మనకు ట్రెక్కింగ్‌ ప్రారంభంలోనే ఒక చిన్న ఏరు జలజలా పారుతూ ఎదురవుతుంది, మన పాదాలను ప్రక్షాళన చేస్తుంది. ఆ ఏరు చుట్టూ ఏడెనిమిది రాతి స్తంభాలు నిలబెట్టి ఉన్నాయి. వాటి దగ్గరికెళ్ళి చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఒక్కో స్తంభానికి నాలుగు వైపులు… ఒక్కో పక్క ఒక్కొక్క కథను లేదా పౌరాణిక ఇతివృత్తాన్ని తెలిపే నాలుగైదు శిల్పాలు ఒక్కో అడుగెత్తు చొప్పున చెక్కారు. ఇలాంటి స్తంభాలను శిల్పం నేర్చుకునేవారు గాని, దాతలు గాని చెక్కి(ంచి) ఉంటారు.
అలాంటి ఒక స్తంభానికి పులిని వేటాడుతున్న వీరత్వాన్ని, మ ద్దెల వాయిద్య నృత్యాలతో కళాకౌశలాన్ని ప్రదర్శిస్తున్న ఒక పురుషుడిని ప్రేమించిన ఒక యువతి, అతనికి పావురంతో తన

ప్రేమ సందేశాన్ని పంపి, అతని ప్రేమను గెలిచి, ఆచంద్ర తారార్కంగా పెళ్ళి చేసుకొని దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్న ట్లుగా శిల్పాలు చెక్కబడ్డాయి. అయితే చివరిదైన ‘పురుషాయి త గతి’ శిల్పం వామాచార శాక్తేయ మత ప్రాభవాన్ని సూచిస్తుందేమో! ఇంకొక స్తంభ శిల్పంలో కృష్ణుడు కాళీయమర్ధనం చేస్తున్న దృశ్యం చెక్కబడింది. మరో స్తంభానికి మూర, గజం, జాన అనే కొలతలు చెక్కి ఉన్నాయి. ప్రాచీనకాలంలో స్థానిక రాజు ఆ ప్రాంతంలో భూములను తన మూర, జాన, గజం, బారెడు (రెండు గజాలు) కొలతలతో ప్రజలు కొలుచుకునేందుకు వీలుగా ఇలా అక్కడక్కడా ఏర్పాట్లు చేశాడట.

ఇలాంటి శిల్పకళాశోభితమైన స్తంభాలు దాటగానే మెట్లు కనిపిస్తాయి. మెట్లకు ఇరువైపులా చిన్న చిన్న రెయిలింగ్స్‌ ఉంటాయి. ఒక్కో రెయిలింగ్‌ రాయికి రెండు కొనల్లో రెండేసి గుంతలుంటాయి . ఆ గుంతల్లో పూర్యకా లంలో పర్వదినాల్లో నూనెపోసి, వత్తులు వేసి వెలిగించేవారట. ‘ఎంతటి ఆసక్తిని రేపే ఏర్పాట్లో!’ అనుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తే మనల్ని మరింత ఆనందానికి గురిచేసే శిల్పాలు కనిపిస్తాయి. ఇవి మెట్లకు రెండు పక్కలా అక్కడక్కడా ఉన్న సహజమైన గ్రానైట్‌ శిలలకు చెక్కబడ్డాయి. ఇలాంటి శిల్పాల్లో ఎక్కువగా హనుమంతుడు వివిధ రూపాల్లో చెక్కబడ్డా డు.తమకు ఆపదలు తొలిగి సంపదలు కలిగినప్పుడు భక్తులు ఇలాంటి శిల్పాలను చెక్కించడం అనాదికాలంలో ఆచారంగా ఉండేది.

సహజ శిల్పసౌందర్యం…
తూర్పు నుంచి పడమడివైపు సాగుతున్న మెట్ల మార్గమధ్యంలో ఎడమ వైపు పందిరి వేసినట్లు ఒక సహజ శిలాతోరణం ఉంది. దీనిలో పూర్వం ఒక దేవతా విగ్రహం ఉండేదన్నట్లు కనిపిస్తుంది. కనుకనే దాని చుట్టూ ప్రదక్షిణ పథం ఉంది. అదీ సహజ శిలలదే!ఈ సహజ శిలాతోరణం ముందు నిల్చుని ఉత్తరం వైపు చూస్తే ఊపిరి పీల్చుకుని, గుండెమీద చేయివేసుకుని ‘అమ్మ ఎంత అందమైన శిలలు’ అనిపించే సహజ శిలా శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఒక శిలా సముదా యంలో మొగ్గ విప్పిన రేకులతో కమలం, తిరునామాలు కనిపిస్తే…

మరో శిలా సముదాయంలో ఎత్తు మీదున్న కప్పను ఒక తాబేలు ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంటుంది. ఇంకొక శిల ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది. ఇలాంటి సహజ శిలాకృతులు కొన్నింటిని హైద రాబాద్‌లోని శిల్పారామంలో చూస్తాం. అయితే అవి ఎక్కడినుండో తెచ్చి కృత్రిమ వాతావారణంలో పెట్టినవి. కాని ఈ తిరుమలనాథ కొండ మీద ఉన్నవి సహజవాతావరణంలో అత్యంత సౌందర్యంతో భాసిల్లుతు న్నాయి.

కోటగోడలు – యుద్ధపు ఆనవాళ్ళు…
తిరుమలనాథ కొండ ప్రాంతం ఒక ప్రాంతీయ రాజ్య ప్రాధాన్యమున్న స్థలంగా కనిపిస్తుంది. కొండ ఎక్కడానికి ముందే ఒక వీరుని శిల్పం (వీరగల్‌), వీరధ్వజ స్తంభం కనిపిస్తాయి. వాటి ఆధారంగా అక్కడ ఈ మధ్య ఒక హనుమాన్‌ మందిరం కట్టారు. తమ ప్రజల సంక్షేమం కోసం శత్రుసైన్యాలపై పోరాడి వీరమరణం పొందినవారికి గుర్తుగా ఇలా వీరగల్లు శిల్పాలను చెక్కించే ఆచారం మూడు నాలుగువందల సంవత్స రాల క్రితం వరకూ మనుగడలో ఉండేది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎప్పు డు ఎవరెవరికి యుద్ధం జరిగిందో పరిశోధించవలసి ఉంది.

ఇక సహజ శిలా మండపం మొదలుకొని మనకు మెట్లెక్కుతున్నప్పుడు రెండు పక్కలా కోటగోడను నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మెట్లెక్క డం పూర్తయినాక సమతలంలో రెండు మూడు ఆలయాలున్నాయి. ఈ సమతలం చుట్టూ కోటగోడ ఉంది. అంటే దేవాలయాల చుట్టూ కోట గోడ కట్టారన్నమాట. అలాంటి రక్షణ గోడ కట్టడం వలన పశ్చిమాభి ముఖంగా ఉన్న ప్రధానాలయానికి ముందర రెండు సహజ కుంటలు ఏర్పడ్డాయి. మరో కోనేరును దానికి సమీపంలో కట్టారు. ఈ మూడు నీటి వనరులు యుద్ధ సమయాల్లోనూ, సాధారణ సమయాల్లోనూ ఈ కొండపైనున్నవారికి అవసరాలు తీర్చేవన్నమాట.

ప్రధానాలయ గోపురంలో కూడా నలుదిక్కులా శత్రువులో ఆయుధాలను ప్రయోగించే ఏర్పాట్లు (గూడులు) ఉన్నాయి. తెలుగు దేశంలో ముస్లింలు ప్రవేశిం చాక (14-16 శతాబ్దాల) వారి వల్ల హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని, అందుకే వారి బారినుంచి తమ దేవాలయాలను రక్షించుకు నేందుకు హిందువులు వాటి చుట్టూ రక్షణ కోటగోడలను నిర్మించుకు న్నారని చారిత్రకులు చెబుతారు. అలాంటి ఏర్పాట్లనే మనం ఇక్కడ చూస్తాం.

ఆలయం వైచిత్య్రం…
aalayaaప్రధాన దేవాలయం కాలక్రమంలో ఎన్నో మార్పుచేర్పులకు గురై విచి త్రంగా కనిపిస్తుంది.సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే దీనికి మాత్రం పశ్చిమపు వాయు వ్య ద్వారాలు ప్రధాన ద్వారాలు కాగా ఉత్తరాభిముఖంగా రెండు ద్వారాలు, దక్షిణ ఆగ్నేయం లో మరో ద్వారం ఉంది. దేవుడిని కూడా తిరుమల నాథుడని, వేంకట్వేరుడని, సీతారాముడని, విష్ణువని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఆలయానికి దక్షిణం, పశ్చిమ దిశల్లో మంటపాలున్నా యి. ఉత్తర దిశన ఉన్న గుండ్లకు హనుమాన్‌, గరుత్మంతులవి రెండేసి విగ్రహాలు తొలిచి ఉన్నాయి . ఆలయ భాగంలోనే ఈశాన్యంలో అమ్మవారి గుడి ఉంది. గర్భగృహానికి ఉత్తరంగా ఉన్న రంగ మంటపం నల్లరాతి స్తంభాలతో శిల్పకళాశోభితమై చూపరులను కట్టిపడేస్తుంది.

ఆలయం చుట్టూ ప్రదక్షిణపథం ఉంది. ఆలయం వెనుకవైపున్న సహజ శిలలు, గుహలు మన దృష్టిని విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయానికి వాయువ్యదిశలో ఆళ్వార్ల మందిరం ఉంది. నైరుతి దిశలో కొంత దూరా న మరో మందిరం ఉంది. దాన్ని హనుమాన్‌ మందిరం అంటున్నారు. కాని అందులోని రాయికి చెక్కిన విగ్రహం మాత్రం హనుమంతుని చిత్రంలా లేదు. ఈ మందిరానికి తూర్పున ఉన్న ఇంకో చిన్న మంది రాన్ని ఇటీవలే దుండగులు ధనం కోసం ధ్వంసం చేశారు.
ప్రధానాలయానికి ఎడమపక్కన ఒకప్పుడు ఒక పెద్ద మఠం లేదా సత్రం ఉండేదనడానికి నిదర్శనంగా దాని పునాదులు కనిపిస్తున్నాయి. దాని ముందు వంటశాల, పూజారి గదుల పునాదులు కనిపి స్తున్నాయి. ఇప్పు డు ఈ పరిసరాల్లో మేకలు మేస్తున్నాయి. అదొక అందమైనప్పటికీ ‘ఓడ లు బళ్ళు – బళ్ళు ఓడలు అవుతాయి’ అనే సామెత గుర్తురాక తప్పట్లేదు.

శాసనాలు – చరిత్ర…
ఆలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టిన గుండు కింద రెండు గజాల పొడవుతో ఏడు వరుసల శాసనం ఒకటి ఉన్నది. ఆలయపు కుబేరస్థాన మైన ఉత్తరదిశలో ఉన్న గుండుకు చెక్కిన హనుమ ,గరుత్మంత శిల్పాల కింద రెండున్నర గజాల పొడవుతో నాలుగు వరుసల శాసనం మరొకటుంది. ఇవి రెండూ ఒకదాని తరువాత మరొకటి కాకతీయుల తరువాతి కాలంలో… అనగా 14 నుంచి 16 శతాబ్దాల మధ్యకాలంలో చెక్కినట్టుగా లిపి పద్ధతిని బట్టి అర్థమవుతున్నది. మొదటి శాసనానికి భక్తులు సున్నం, బూజు పూశారు. కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగి కాపీ (నకలు) ఆలయపు అసలు చరిత్ర బయటికొస్తుంది. ఏమైనా ఈ శాసనాలు ఇక్కడి ఆళ్వార్ల సన్నిధి, హనుమ, గరుత్మంత విగ్రహాలు ఒకే కాలానికి చెందినవని చెప్పవచ్చు.

అయితే ఆలయ చరిత్ర మాత్రం మరో వేయి సంవత్సరాలు ముందుకెళ్తుందనడానికి ఇక్కడ నిదర్శ నాలున్నాయి. మొదట ఈ క్షేత్రం ఒక స్ర్తీ దేవతలదని తెలుస్తోంది. విగ్రహారాధన ప్రారంభమైనప్పటి నుంచీ స్ర్తీ దేవతారధన ఉంది. చారిత్రక యుగం తొలినాళ్ళలో స్ర్తీ దేవతను ‘హారతి’ అనేవారు. తొలి చాళుక్యులు ఆమెకు మొట్టమొదటి గుహాల యాలు కట్టించారు (క్రీశ 7వ శతాబ్దంలో). వారి కాలపు నిరాడంబర స్తంభాల మంటపం, స్తంభాల కింద పూర్ణకుంభ శిల్పాలు, పై ద్వారబం దానికి గజలక్ష్మి శిల్పం మొదలైన వాస్తు శిల్ప విశేషాలను ఇక్కడి ఆల యంలో చూడవచ్చు.

తరువాత వచ్చిన మలి చాళుక్యులు 10-11 శతా బ్దాల్లో ఈ ఆలయపు దక్షిణ మంటపాన్ని నిర్మించి మరికొన్ని నిర్మాణాలు చేయించి ఉంటారు. ముందున్న శిథిల సీతారామాలయంలోని సీత విగ్రహం పద్మాసనంలో యోగస్థితిలో ఉన్నది. మరోచోట చింతచెట్టు కింద ఆసీనురాలైన స్ర్తీ దేవతా విగ్రహం ఉన్నది. ఇవి కూడా మలి చాళుక్యుల కాలం నాటివే అయ్యుంటాయి. కాకతీయులు (12, 13 శతాబ్దాలు) అందమైన రంగమంటపాన్ని కట్టిం చారు. వీరి కాలానికి అటు ఇటుగా ఇక్కడ భైరవోపాసన కూడా జరిగిం దనడానికి నిదర్శనంగా కొండ మెట్లకు కుడివైపున భైరవ శిల్పం కనిపి స్తుంది.

ఇక చివరిగా 15, 16 శతాబ్దాల్లో ఈ ఆలయం ఇప్పుడు కనిపిస్తు న్న వైష్ణవాలయ రూపాన్ని సంతరించుకున్నది. ప్రస్తుతం ఇక్కడ సంక్రాం తి పండుగకు జాతర జరుగుతుంది. ఇలా చారిత్రక విశేషాలకు, సహజ సౌందర్యానికి నిలమైన ఈ తిరు మలనాథ కొండ హైదరాబాద్‌ నగరానికి చేరువలో ఉండి వారాంతపు పర్యటనలకు అనుకూలంగా ఉండడం విశేషం.

వినోదం + విజ్ఞానం = ట్రెక్కింగ్‌…
తిరుమలనాథ కొండ పైకి చేరుకోవాలంటే అక్కడక్కడా ఉన్న సమతలపు గుట్టబోర్లతో పాటు సుమారు 275 మెట్లు ఎక్కాలి. అయితే మెట్ల సంఖ్యను చూసి అమ్మో! అని భయపడనక్కర్లేదు. ఎందుకంటే, ఈ మెట్లు ఎత్తు తక్కువగా ఉంటాయి. పైగా మెట్లకు ఇరువైపులా మనకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే ఎన్నో వింతలు, విశేషాలు మనకు ట్రెక్కింగ్‌ అలసటను తెలియకుండా చేస్తాయి.

– డా ద్యావనపల్లి సత్యనారాయణ
సెల్‌: 9440687250

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top