You Are Here: Home » చిన్నారి » తిరుగుబోతు

తిరుగుబోతు

‘తిరుగుబోతు’ అని తూలనాడిన వారి చేతే … గొప్పవాడిగా మన్ననలు అందుకున్న కుర్రాడి కథతో కన్నడంలో రూపొందిన ఓ చిత్రం ‘తిరుగుబోతు’ పేరుతో తెలుగులోకి అనువాదం అవుతోంది. రాజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సుబ్బరాజు ప్రత్యేక పాత్ర చేశారు. కిరణ్ గోవి ఈ చిత్రానికి దర్శకుడు.

శ్రీసాయిదేవ క్రియేషన్స్ పతాకంపై పి.పి.నరసింహా, ప్రభాకర్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు చెబుతూ-‘‘మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇది. రాజ్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. బియాంక దేశాయ్ ఇందులో నాయిక. ఆమె గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top