You Are Here: Home » ఇతర » తస్మాత్‌ జాగ్రత జాగ్రతః

తస్మాత్‌ జాగ్రత జాగ్రతః

bitపుత్రుల వలన కాదు సగ్గతి లభించేది, స్వయంగా మనం చేసుకొన్న సత్కర్మల ద్వారా ప్రాప్తిస్తుంది.పుత్రులు కలుగగనే సద్గతి లభిస్తుందనే భావన సరియైనది కాదు, నేడు పాండవుల వంశము లేదు. ఐతే వారందరికి సద్గతి లభించనట్లేనా! నేడు శ్రీరామచంద్రుని సూర్యవంశం, శ్రీకృష్ణ భగవానుని చంద్రవంశం కూడా లేదు. ఐతే వారంతా దుర్గతి పాలయ్యారా! అట్లా ఎన్నటికీ జరగదని మనందరికీ తెలుసు. కాని పుత్ర ప్రాప్తి కొరకు ఇంత పిచ్చి ఎందుకు మనలను మనమే ఉద్దరించుకునే దానికి పుత్రుడే ఉద్ధరించాలనే ఆశదేనికి? నేటి వాతావరణములోని పిల్లలు శ్రద్ధలేని వారు. అట్లాంటి వారు మరల ఎట్లా ఉద్దరించగలరు? కనుక నేడే నీ బాగోగుల గురించి నీకు నీవే ఆలోచించుకో.. కుటుంబ వృద్దికి మగపిల్లవాడైనా, ఆడపిల్లైనా ఒకటే. ఇవ్వనీ ఐహిక బంధాలే. అందుకే శ్రీశంకర భగవత్పాదులు ఇలా అన్నారు.
మాతా నాస్తి పితా నాస్తి
నాస్తి బంధు సహౌదరః
అర్ధం నాస్తి గృహం నాస్తి
తస్మాత్‌ జాగ్రత జాగ్రతాః

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top