You Are Here: Home » చిన్నారి » డైనోసార్లు ఏ యుగానికి చెందినవి?

డైనోసార్లు ఏ యుగానికి చెందినవి?

డైనోసార్లు మీసోజాయిక్ యుగం అంతా జీవించి ఉన్నాయని చెప్తారు. ఈ యుగం 240 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది. ఈ యుగాన్ని సరీసృపాల యుగం అని కూడా అంటారు. ఈ యుగంలో మూడు భాగాలు ఉన్నాయి. 1) ట్రైయాసిక్ కాలం- 245 నుంచి 208 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఉన్న కాలం. ఈ కాలంలో అనేక జంతువులు అంతరించినా డైనోసార్లు మనుగడ సాగించాయి.
2) జురాసిక్ కాలం-208 నుంచి 146 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు. ఈ కాలంలో డైనోసార్లులు అభివృద్ధి చెందాయి. 3) క్రిటెషియస్ కాలం- 146 నుంచి 65 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు. ఈ కాలం చివరలో డైనోసార్లు అంతరించి పోయాయి. అంటే 65 మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించి పోయాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top