You Are Here: Home » ఇతర » డైనమిజంలోనే ప్రతిభ

డైనమిజంలోనే ప్రతిభ

సమాజాన్ని మంచి దోవలో నడిపించడానికి, మహిళల ఔన్నత్యాన్ని కాపాడటా నికి, పెడదోవన నడిచేవారికి సరైన రుజుమార్గాన్ని చూపించడానికీ ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అశ్లీలతలు, వేదింపులు, అత్యాచారాలు వంటి నేరాల మీద నేటి మహిళలు గళం విప్పి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అరుుతే ఇవి ఎంతవరకూ నిరోధించబడ్డారుు? అంటే ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉందన్న చందంగా తయారరుు్యంది. ఇటువంటి నేరాలకి ఆస్కారం కలిగిస్తున్నవి ముఖ్యంగా దృశ్యమాధ్యమాలు. ఒకనాడు టీవీ ఛానెళ్ళల్లో యదేచ్ఛగా ప్రసారం చేయబడిన ఇటువంటి కార్యక్రమాల్ని నిలుపు చేయాలంటూ ముంబారుు హైకోర్ట్‌లో (పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ (పిఐఎల్‌-పిల్‌) ) పిటీషన్‌ వేసి నిర్విరామంగా పోరాడిన తొలి మహిళ ప్రతిభా నైథానీ.

Untitl6ప్రతిభా నైథానీ ఒక మంచి అధ్యాపకురాలే కాకుండా సామాజిక సేవా కార్యకర్త. ఈమె తండ్రి డా. ఎస్‌ఎస్‌. నైథానీ ముంబాయి యూనివర్శిటీలోను, సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలోను హిందీ విభాగంలో అద్యాపకుడుగా పనిచేస్తున్నాడు. ప్రతిభ కూడా ప్రస్తుతం సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలోనే పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో అద్యాపకురాలిగా పనిచేస్తోంది. కేబుల్‌ టెలివిజన్‌ ద్వారా ప్రసారం అవుతున్న అడల్ట్‌ సినిమాలని నిషేధించా లంటూ, హైకోర్ట్‌లో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ కేసుని క్షుణంగా పరిశీలించిన హైకోర్ట్‌ 24గంటలూ అనేక ప్రసారాలు అందించే అన్ని చానెళ్ళలోను వీటిని నిషేధిం చింది. ఈ కేసు వల్ల కేవలం దేశీయ టీవీ ప్రసారాలకే కాకుండా అంతర్జాతీయ ప్రసారాలన్నిటీకీ వర్తించేలా ఆంక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రతిభ వేసిన ఈ కేసు అతిపెద్ద సంచలనం అయ్యి, ఈమె దేశవిదేశీ దృష్టిని ఆకర్షించింది.

ఈ విధంగా అశ్లీలత మీద పోరాడి విజయం సాధించిన తొలి మహిళగా ప్రతిభా నైథానీ చరిత్రకెక్కింది.
ఒక చిత్రం మీద సెన్సార్‌బోర్డ్‌ అడాల్ట్‌ సర్టిఫికెట్‌ ఇస్తుంది. దానిని పెద్దవాళ్ళు మాత్రమే వీక్షిస్తారు. అటువంటి వాటిని టెలివిజన్‌ ఎలా ప్రసారం చేస్తుందీ? ఇవి పబ్లిక్‌గా ప్రసారం చేస్తే పిల్లలు చూడకుండావుంటారా? అంటూ ఈమె ఆ దావాలో ఒక పాయింట్‌గా పేర్కొంది. ఈ విషయంలో ప్రతిభ సునిశిత పరిజ్ఞానానికి అభినందించక తప్పదు. చట్టరీత్యా కూడా అడాల్ట్‌ ప్రోగ్రాంలు కూడా పబ్లిక్‌లో ప్రదర్శించడం చట్టవిరుద్ధం. అంతేకాకుండా చానెళ్ళు హింసాత్మకతతో కూడినవి, ఎడాల్ట్‌ సర్టిఫికేట్‌ పొందినవి ప్రసారం చేయడం భారతీయ న్యాయ పరిధిని అతిక్రమించడమే అని పేర్కొంది.

ప్రతివాది విదేశీ చానెల్‌ విషయాన్ని కోర్టుముందు ఉంచగా, ప్రతిభ, సాప్ట్‌వేర్‌ ఇక్కడిది, స్పాన్స్‌ర్స్‌ ఇక్కడి వాళ్ళు, రాబడి ఇక్కడిదే అయినప్పుడు అది విదేశీ చానెల్‌ ఎలా అవుతుంది? అని వాదించింది. ఇలా ఎన్నో వాదప్రతివాదనలతో సాగిన ఈ కేసులో చివరికి విజయాన్ని సాధించింది ప్రతిభా నైథానీ. నాటి నుండీ ఇటువంటి కార్యక్రమాల్ని ప్రసారం చేయడం అన్ని చానెళ్ళు నిలిపివేసాయి. అదే విధంగా 2005-06 సంవత్సరంలో 3వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అన్ని స్కూళ్ళలోను ప్రవేశ పెట్టాలని ఆర్డర్‌ ఇచ్చింది. ప్రతిభ ఆ పాఠ్యపుస్తకాల్ని చూసి షాకయ్యింది. దాంతో ఈమె శ్రీరత్నసుందర్‌ సురీశ్వర్‌ మహరాజ్‌ సహకారంతో ఈ అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టింది. అదికూడా ఎంతో సంచలనాన్ని రేపింది. చివరికి ప్రభుత్వం ఈ కోర్స్‌ని రద్దుచేసింది. మళ్ళీ ప్రతిభ మరో విజయ ఢంకా పూరించింది.

ప్రతిభా నైధానీ సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో అద్యాపకురాలిగా పనిచేస్తూనే, మహిళా సంక్షేమం, పిల్లలు, గిరిజనుల అభివృద్దికి ఎంతగానో కృషిచేస్తోంది. ముంబాయిలోనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థని నెలకొల్పి, వైద్య సేవలు, ఆర్ధికంగా వెనుకబడిన పేద ప్రజలకి ఇతోధిక సేవచేయడం, ప్రమాద వశాత్తూ గాయపడిన వారికి ఉచితంగా వైద్య సహాయం అందించడం వంటి సోషల్‌ వర్క్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం డా. ఎ.కె. గుప్త ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘సేవ్‌ ది ఫేస్‌’ అనే ఒక ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంది.
నేటికీ ఎన్నో మహిళా సంఘాలు ఏదో ఒక అంశం మీద పోరాడుతూనే ఉన్నా, కోర్టులకి వెళ్ళి ఇటువంటి సంచలనాలు సృష్టించింది మాత్రం ఇంచుమించు తక్కువనే చెప్పవచ్చు. గతంలో కొందరు యాడ్‌ల్లో మహిళల్ని అసభ్యకరంగా చూపిస్తున్నారంటూ పెద్ద దుమారం లేవదీసారు.

pratibhaఅది అంతే వేగంగా చల్లబడిపోయింది. ఇప్పటికీ 80% వరకూ వ్యాపార ప్రకటనల్లో మహిళలు అసభ్యంగాను, అరకొర దుస్తులతో రెచ్చగొట్టే విధంగానే నటించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఏ మహిళా సంఘాలూ స్పందించడంలేదనే చెప్పాలి. ఒక పక్క ఇది ఇలా ఉంటే నేటి యువతులు కల్చర్‌పేరుతో లేనిపోని బేషజాలకి పోయి లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారంటూ, అందుకు హర్యానాలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి అన్న నేపథ్యంలో చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా యువతుల విపరీత ధోరణే చాలా వరకూ కారణమంటూ తేల్చిచెప్పేశారు. రెచ్చగొట్టే విధానాలకి, కల్చర్‌కి స్వస్తి చెప్తే ఈ విషసంప్రదాయం నుంచి బయటపడి తమని తాము రక్షించుకోవచ్చని అంటున్నారు మరికొందరు పరిశీలకులు. దేనిని నిలువరించినా, దేనికోసం ఎన్నిపోరాటాలు, చట్టాలు తెచ్చినా ప్రతిమనిషీ తమ హద్దుల్లో తాము ఉన్నంతవరకూ ఇటువంటి వాటి నుంచి రక్షణ ఉంటుందన్న విషయం అక్షరసత్యం.

ప్రతిభ అవార్డ్‌లు

 • 17,500 అడుగుల పర్వతారోహణ చేసినందుకు ట్రెకింగ్‌ అవార్డ్‌
 • 2005 పవర్‌ గాడెస్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా టుడే
 • పన్నధాయ్‌ అవార్డ్‌, మహారాణా మేవార్‌ ఫౌండేషన్‌
 • 2007 మహిళా దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ మహిళ అవార్డ్‌, ముంబాయి మేయర్‌

  ప్రతిభ సలహాలు

  • మహిళలు విద్యావంతులై జాతీయ స్థాయిలో తమకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోవాలి. మహిళలు వ్యకిగా సాధికారత సాధిస్తే శక్తిగా నిలబడే అవకాశం ఉంది
  • నేటి తరం విదేశీ కల్చర్‌ పట్ల వ్యామోహాన్ని పెంచుకోకుండా, దేశ సంప్రదాయాలకి విలువనిచ్చే దిశగా ముందడుగు వేయాలి. ప్రపంచదేశాల్లో భారతీయ మహిళల పట్ల, సాంప్రదాయం పట్లా ఇతరులకి ఇప్పటికీ ఎంతో గౌరవం ఉంది. దానిని నిలబెట్టుకోవడం ఈ తరం వారి మీదే ఆధారపడి ఉంది.
  • మీడియాలు సమాజానికి మేలు చేకూర్చే అంశాలు ప్రసారం చేస్తూవుంటే నేటి తరంలో చాలా వరకూ నేర ప్రవృత్తి అవలడే ప్రమాదాన్ని నివారించవచ్చు. అందుకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలు తమ వంతు సహకారాన్ని నిస్వార్ధంగా అందించాలి.
  • జాతి, కుల, మత విద్వేషాలు వదిలి ఒకరికొసం ఒకరు అనే విధానాన్ని పాటిస్తే మన ముందు తరాలకి భద్రత ఉంటుందనడంలో సందేహంలేదు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top