You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » డాక్టర్‌ దానిమ్మ

డాక్టర్‌ దానిమ్మ

ఇంట్లో దానిమ్మ మొక్కను పెంచితే వైద్యుడు ఉన్నంత నిశ్చితంగా ఉండొచ్చు. దానిమ్మ తొక్క, బెరడు. విత్తనాలు, ఇతర భాగాలన్నింటికీ ఔషధ గుణాలు ఉన్నాయి. కంప్లీట్‌ ఔషధమొక్క దానిమ్మ. ఈ పండులోని పొర, గింజలు, రసం, చెట్టు వేరు ఎన్నో ఔషధ గుణాలతో సమృద్ధం. దానిమ్మ మేలైన పోషక విలులు గల ఆహారం . దీని చెట్టులో ప్రతి భాగం అంటే ఆకులు. పువ్వులు వేళ్ళూ ఔషధాలుగా వేలకొద్ది ఏళ్ల నుంచి చెప్పబడ్డాయి. ప్రాచీన కాంలోనే ఇది గుండెకు బలవర్ధకమని వైద్యులు నిర్ధారించారు.

గుండెకు చక్కని ఆహారం
Pomaగుండెవ్యాధుల నివారణకు దానిమ్మ బెస్ట్‌ అని రుజువైంది. గుండెజబ్బుతో బాధ పడుతున్న 45మందికి రోజుకు 250 మిల్లీలీటర్ల చొప్పున దానిమ్మ రసాన్ని మూడు నెలలపాటు ఇవ్వగా వారిలో గుండెకు రక్తసరఫరా 17 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు.
దానిమ్మలోని యాంటి ఆక్సిడెంట్స్‌ ధమనుల గోడపై కొవ్వు పేరుకోవడాన్ని అడ్డుకుంటాయి. మూత్ర పిండాలకు బాగా పని చేస్తుంది. దానిమ్మ రసాన్ని క్రమం తప్పక 40 రోజుల పాటు తీసు కుంటే ఎన్నో రోజులు తగ్గుతాయి. గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, అగ్జాలిక్‌ యాసిడ్స్‌ దీనిలో ఉన్నాయి. గుండకే కాక కాలేయం, మూత్రపిడాలలకు కూడా ఇది ఉపయోగ కరంగా పని చేస్తుంది.దానిమ్మ పండ్లతొక్కని-ప్రధానంగా వాడే ఔషధాలలో దాడిమాష్టక చూరం, భాస్కర లవణం, ప్రధానమైనవి. దాడిమాది పానకం దానిమ్మ పళ్ళ రసం, ఇతర ద్రశ్యాలతో తయారవుతుంది.
వికారం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట -ఇటువంటి సమస్యలు ఉన వారు 10-15 మి.లీ. దానిమ్మ రసంలో సమానంగా తేనె కలుపుకుని రోజుకి 2-3 సార్లు చొప్పున వాడవచ్చు. తక్షణ ఉపశమనం కలుగుతుంది. కొంత కాలం వాడితే కడుపులో మంట తగ్గిపోతుంది.
మూత్ర పిండాలలో లేదా మూత్రాశయంలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నవారు దానిమ్మ గింజలని ముద్దగా నూరి ఒక చెంచాడు ముద్దని ఒక కప్పు ఉలవచారుతో కలిపి ప్రతిరోజు తాగుతూ ఉంటే నెమ్మదిగా ఆ రాళ్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top