You Are Here: Home » ఇతర » ‘ట్రెంజ్‌’ లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌

‘ట్రెంజ్‌’ లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌

Wedaఫ్యాషన్‌ప్రియుల కోసం సరికొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎప్పటి ‘ట్రెండ్‌’కు అనుగుణంగా డిజైనర్లు తమ డిజైన్లను అందిస్తున్నారు. దీంతో భాగ్యనగరం లోని పలు ప్రాంతాల్లో ఈ వస్త్ర ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రదర్శనల ద్వారా రాష్ట్రంలోని ఉత్పత్తులే కాక ఇతర రాష్ట్రాల ఉత్పత్తులు అందు బాటులోకి వస్తున్నాయి. మహిళలకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట లభించేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కళాకారులు సొంతంగా తయారుచేసిన ఉత్పత్తు లను వారే విక్రయించుకుని ఉపాధి పొందేలా ఈ ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. ఈ తరుణంలో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయినిగమాగమంలో ట్రెంజ్‌ లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనలో అన్ని రకాల డిజైనర్‌ చీరలు, చుడీదార్స్‌, 1 గ్రామ్‌ జ్యుయలరీ, ఫ్యాషన్‌ యాక్ససరీస్‌ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ఎంకోర్‌ ఈవెంట్స్‌ అధినేత శాంతి తెలిపారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ ప్రదర్శనను తిలకించవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top