You Are Here: Home » ఇతర » టేస్ట్‌కి ఎగ్‌ బెస్ట్‌

టేస్ట్‌కి ఎగ్‌ బెస్ట్‌

భోజన పదార్ధాల్లోను, స్వీట్లు, కకులు వంటి ప్రత్యేక వంటకాల్లో ఎగ్‌ లేనిదే ఆ పదార్ధానికి ఇంపూ, సొంపూరాదు. పోషకాహారంగా కూడా పిల్లలకి, పెద్దలకి ఎగ్‌ తీసుకోమని కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కూడా సలహారుు స్తూవుంటారు. శాకాహారులు, మాంసా హారులు కూడ తీసుకునే విలువైన ఆహారం కోడిగుడ్డు. ముఖ్యంగా ప్రొటీన్లతో పాటు అనేక ఆరోగ్య విలువలు ఉండటం వల్ల కోడిగుడ్లు అందరూ వినియోగిస్తున్నారు. అందుేక సాధారణ వంటకాలేక కాకుండా అనేక ప్రత్యేక తరహా వంటకాల్లో కూడా ఎగ్‌కి మంచి వినియోగం, ఉపయోగం కూడా ఉంది. అందుేక ఎగ్‌ స్పెషల్స్‌తో ఈవారం మీముందుకి వస్తున్నాం…

చిటికలో ఆకలి తీరాలంటే గుడ్డు ఒక్కటుంటే చాలు. అలాగే అనుకోని అతిధుల్ని ఆనందపరచాలన్నా గుడ్డుని మించింది లేదు. శక్తిని ఉత్సాహాన్నీ ఇచ్చే క్రిస్పీ ఎగ్‌ చిల్లీ మనపాలిట వరం.

మసాలా ఎగ్‌ బుర్జీ
masalaముంబాయిలో అందరూ బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా సైడ్‌ డిష్‌గా కూడా ఇష్టపడేది ఎగ్‌ బుర్జు. నిజానికి దీనిని ముంబాయ్‌ స్పెషల్‌ అని చెప్పవచ్చు.

తయారీకి కావలసినవి:
గుడ్లు: 5, పన్నీర్‌/కాటేజ్‌ చీజ్‌: 2 చెంచాలు, ఉల్లిపాయ తురుము: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి), టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), పచ్చిమిర్చి: 4 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), అల్లం-వెల్లుల్లి పేస్ట్‌: 1 చెంచాడు, బ్లాక్‌ పెప్పర్‌ (మిరియాల) పౌడర్‌: 1 చెంచాడు, కారం: 1/2 చెంచా, ఉప్పు: రుచికి సరిపడా, ఛాట్‌ మసాలా: చిటికెడు, బట్టర్‌: 2-3 చెంచాలు, కొత్తిమీర తరుగు: 2 చెంచాలు (తరిగి పెట్టుకోవాలి),

తయారు చేసే విధానం:
ముందుగా పాన్‌లో వెన్న(బట్టర్‌) వేసి సన్నని మంటమీద కరిగించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ మెత్తబడి బ్రౌన్‌ కలర్‌ వచ్చే సమయంలో పచ్చిమిర్చి, టమోటో, పన్నీర్‌ ముక్కలు వేసి బాగా మిక్స్‌ చేసి మరో రెండు మూడు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉప్పు, బ్లాక్‌ పెప్పర్‌ పౌడర్‌, కారం, ఛాట్‌ మసాలా వేసి బాగా వేయించి మీడియం మంట మీద అన్నీ కలిసేలా ఫ్రై చేసుకోవాలి.

ఈలోపు ఒక గిన్నెలో గుడ్లును వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు వేగుతున్న మసాలాలో గిలకొట్టిన గుడ్డును పోసి పొడిపొడిగా తయారయ్యేంత వరకూ సన్నని మంట మీద వేయించాలి. అంతే ఎగ్‌ మసాలా బుర్జ్‌ రెడీ…. చివరగా కొత్తిమీర తరుగుతో అందంగా అలంకరించి రోస్ట్‌ చేసిన బ్రెడ్‌తో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా తీసుకుంటే, మంచి ఆరోగ్యాన్ని, ఉత్తేజాన్నీ కూడా ఇస్తుంది. ఇది ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది.

క్రీస్పీ ఎగ్‌ చిల్లీ
తయారీకి కావలసినవిః

4egg-chillyకోడిగుడ్లు: 4 (ఉడికించి, పై పొట్టు తీసినవి), పచ్చిమిర్చి పేస్ట్‌: 1 చెంచాడు, పండు మిర్చి పేస్ట్‌: 1 చెంచాడు, ఉల్లిపాయ తరుగు: 2 చెంచాలు, అల్లం: చిన్న ముక్క (పై పొట్టు తీసి సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు: 2 (పై పొట్టు తీసి సన్నగా తరగాలి), చింతపండు గుజ్జు: 2 చెంచాలు, ఉప్పు: రుచికి తగినంత, వంటసోడా: చిటికెడు, సోయా సాస్‌: 1 చెంచాడు, నూనె: వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:
ముందుగా పాన్‌లో నూనె పోసి వేడెక్కిన తర్వాత ఉడికించి పొట్టుతీసిన గుడ్లను మెల్లగా వేసి పైనంతా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి. తర్వాత విడిగా మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడిచేసి అల్లం, వెల్లుల్లి తరుగు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో పండుమిర్చి పేస్ట్‌, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసి నిమిషం పాటు వేయించాలి. దానికి సోయా సాస్‌, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించి స్టౌ కట్టేయాలి. ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్‌ పూసి వేయాలి. చైనీస్‌ రైస్‌, రోటీ లేదా పరోఠాలోకి ఈ చిల్లీ ఎగ్‌ కాంబినేషన్‌ రుచిగా ఉంటుంది. గుడ్డు ఇష్టపడనివాళ్లు దీనికి బదులుగా బంగాళదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు.

క్యాలీప్లవర్‌ ఎగ్‌ కర్రీ
egggఈ కాంబినేషన్‌ చాలా రుచిగా ఉంటుంది. అదీకాక సర్వసాధారణంగా అందరూ ఇష్టపడి చేసుకునే పదార్ధం. ఈ కర్రీలో కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావలసినంత శక్తిని ఇస్తుంది.

తయారీకి కావలసినవిః
క్యాలీఫ్లవర్‌ ముక్కలు: 2 కప్పులు (ఉప్పుకలిపిన వేడి నీటిలో 5ని.లు ఉంచి తీయాలి), కోడిగుడ్లు: 6 (ఉడికించి ఒక్కో గుడ్డును రెండు ముక్కలుగా చేసుకోవాలి), టమోటోలు: 3 మీడియం సైజు, ఉల్లిపాయ: 1 పెద్దది, కారం: 2 చెంచాలు, ఉప్పు: రుచికి సరిపడా, జీలకర్ర, ఆవాలు: 1 చెంచాడు చొప్పున, పసుపు: 1 చెంచాడు, మసాలా పొడి: 1/2 చెంచాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1 చెంచాడు, నువ్వుల పొడి: 1 చెంచాడు, నూనె: తగినంత, ధనియాల పొడి : 1 చెంచాడు, కొబ్బరి పొడి: 1 చెంచాడు, కొత్తిమీర: గార్నిష్‌కి సరిపడా

తయారు చేసే విధానంఃముందుగా పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత, ఆవాలు, జీలకర్ర వేసి సన్నని మంటమీద దోరగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకూ వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి వేయించాక, టమోటో ముక్కలు జత చేసి మరో అయిదు నిమిషాలు వేయించాలి. క్యాలీఫ్లవర్‌ ముక్కలు కూడా వేసి మరో అయిదు నిముషాలు వేయించాక కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వరుసగా వేసి బాగా కలిపి ఇంకో ఐదు నిముషాల పాటు వేయించి, ఉడికించిన గుడ్లను రెండు బాగాలుగా చేసి అందులో వేసి ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దింపేయాలి. అంతే క్యాలీఫ్లవర్‌ ఎగ్‌ కర్రీ రెడీ.. వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

ఆలూ ఎగ్‌ చాట్‌
aluఎప్పుడూ ఎగ్‌తో ఒకే రకమైన వంటకాలు తినడం బోర్‌ కొడుతుంది. వెరైటీగా, తొందరగా చేసుకునే వంటకాల్లో ఆలూ ఎగ్‌ చాట్‌ ఒకటి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

తయారీకి కావలసినవిఃగుడ్లు:
4, బంగాళా దుంపలు : 5, ఉల్లిపాయలు: 3 (కట్‌ చేసుకోవాలి), పచ్చిమిర్చి: 4 (సన్నని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి), నిమ్మరసం: 1 చెంచాడు, ఉప్పు: రుచికి సరిపడా, మిరియాలు: 1 చెంచాడు, ఛాట్‌ మసాలా: 1 చెంచాడు, కారం: 1 చెంచాడు, కొత్తిమీర: గార్నిషింగ్‌ కోసం కొద్దిగా

తయారు చేసే విధానం:
ముందుగా బంగాళాదుంపల్ని నీటితో శుభ్రం చేసి, ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత డల్లబడ్డాకా పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. ఈలోగా మరో గిన్నెలో నీళ్ళు పోసి అందులో గుడ్లను ఉడికించి, తీసి చల్లని నీటిలో వేసి, పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకొని అందులో, ఉడికించిన బంగాళాదుంప, ఉల్లిపాయ ముక్కలు, టమోటో, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పెప్పర్‌ పౌడర్‌, కారం, నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేసి, బంగాళాదుంపలను బాగా చిదిమి చాట్‌ మసాలా బాగా పట్టేట్లు తయారు చేసుకోవాలి.

తర్వాత ఒక ప్లేట్‌లో ఉడికించిన గుడ్లను తీసుకొని, వాటిని మద్యకు రెండు ముక్కలుగా కట్‌ చేసి లోపల ఉన్న పచ్చసొనను తీసేయాలి (దీనిని ఆలూతో కలిపేయచ్చు లేదా నేరుగా తినవచ్చు) తర్వాత గుడ్డులోపల ఆలూ చాట్‌ను నింపుకోవాలి, తర్వాత దాని మీద చాట్‌ మసాలా నింపి, కొత్తిమీర తరుగును గార్నిష్‌ చేయ్యాలి. అంతే ఆలూ ఎగ్‌ చాట్‌ తయారైనట్టే. అతిధులు వచ్చినప్పుడు ఈ వంటకం చాలా హుందాగా ఉంటుంది, ఎక్కువ సమయం కూడా పట్టదు. సాయంత్రం వేళల్లో సరదాగా తినడానికి ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top