You Are Here: Home » చిన్నారి » టెలివిజన్‌ను ఎంతదూరం నుంచి చూడాలి?

టెలివిజన్‌ను ఎంతదూరం నుంచి చూడాలి?

నేటి శాటిలైట్ యుగంలో వినోదం కోసం, విషయపరిజ్ఞానం కోసం ఎక్కువమంది టివిని ఆశ్రయిస్తున్నారు. అయితే టివిని ఎంతదూరం నుంచి చూడాలి? ఎలా చూడాలి? చీకట్లో చూడవచ్చా? అనే సందేహాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా అన్ని తలుపులు మూసి, దీపాలను ఆర్పేసి చీకటిలో కూర్చొని టీవీ చూస్తే బొమ్మ స్పష్టంగా కనిపిస్తుందని చాలామంది నమ్ముతారు. అది వాస్తవమే కావచ్చు. కాని అలా చూస్తే కళ్లు త్వరగా అలసిపోతాయి. దృష్టి దోషాలు కలగవచ్చు. వాస్తవానికి మనం టీవీని దీపపు కాంతిలో కూడా చూడవచ్చు.

గదిలో వెలుగు ఎక్కువగా ఉన్నప్పుడు టీవీ చూడటం వల్ల కళ్లు త్వరగా అలసిపోవు. అంతేకాక దృష్టి లోపాలు కలగవు. టివిని కనీసం రెండున్నర మీటర్లు లేదా ఏడు అడుగుల దూరం నుంచి చూడడం ఆరోగ్యకరం. మనం కూర్చున్నప్పుడు టి.వి. తెర మధ్యభాగం కంటికి సుమారు 10 నుంచి 15 డిగ్రీల కోణంలో మెడ కండరాలు ఎక్కువ శ్రమకు గురికావు. అందుకే టి.వి. చూసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top