You Are Here: Home » భవిత » విద్య » దేశంలో తొలిసారిగా లోహాన్ని ఉపయోగించినవారు?

దేశంలో తొలిసారిగా లోహాన్ని ఉపయోగించినవారు?

టెట్ -జూలై-2011లో అడిగిన ప్రశ్నలు

1. గజనీమహ్మద్ ఆస్థానం అలంకరించిన విద్వాంసుడు?
ఎ) ఫాహియాన్ బి) ఇత్సింగ్
సి) హ్యూయాన్‌త్సాంగ్ డి) అల్ బెరూనీ

2. ‘చక్రం’ ఏ యుగంలో కనుగొన్నారు?
ఎ) నవీన శిలా బి) మధ్య శిలా
సి) లోహ డి) పాతరాతి

3. సంస్కృత భాషలోని తొలి నిఘంటువు?
ఎ) కల్హణుని రాజతరంగిణి
బి) అమరసింహుని అమరకోశం
సి) పతంజలి మహాభాష్యం
డి) పాణిని అష్టాధ్యాయి

4. ప్రపంచంలో ప్రధానంగా మాట్లాడే 30 భాషల్లో భారతీయ భాషల సంఖ్య?
ఎ) 11 బి) 9 సి) 5 డి) 6

5. తవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులు దేనికి చెందుతాయి?
ఎ) ఉత్పాతనం బి) ఫిరంగులు
సి) చిత్ర వస్తువులు డి) గొట్టపు బావి

6. మానవుడి పుట్టుక గురించి అధ్యయనం చేయడానికి ఏ శాఖ విషయజ్ఞానం అవసరం?
ఎ) ఆంథాలజీ బి) కాస్మాలజీ
సి) ఆంత్రోపాలజీ డి) ఆర్కియాలజీ

7. ఏ యుగంలోని వస్తు మార్పిడి పద్ధతి భవిష్యత్ వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించింది?
ఎ) పాతరాతి బి) మధ్యశిలా
సి) కొత్తరాతి డి) కాంస్య

8. సింధూ నాగరికత, మెసపటోమియా నాగరికతకు మధ్య సారుప్యతను తెచ్చిన అంశం?
ఎ) ఆర్థిక వనరులు, వాటి వినియోగం
బి) భాష సి) సహజ పరిస్థితులు
డి) జీవన విధానం

9. మెగస్తనీస్ ఏ రాజుల పాలనా కాలం నాటి పరిస్థితులు వివరించాడు?
ఎ) రాజపుత్రులు బి) ఢిల్లీ సుల్తానులు
సి) మౌర్యులు డి) మొగలులు

డీఎస్సీ-2008లో అడిగిన ప్రశ్నలు
10. ఫొనీషియన్లు అక్షరాల రూపకల్పన చేయడం వల్ల అభివృద్ధి చెందిన భాషలు? ఎ) అరబిక్, భారతీయ
బి) గ్రీక్, లాటిన్ సి) గ్రీక్, రోమన్
డి) ఇంగ్లిష్, లాటిన్

11. ‘బిసాంత్’ అనే బంగారు నాణేన్ని ద్రవ్యరూపంగా వినియోగించినవారు?
ఎ) గ్రీకులు బి) పర్షియన్లు
సి) అరబ్బులు డి) రోమన్లు

12. ‘లైర్’ అనే వీణను వాడినవారు?
ఎ) రోమన్‌లు బి) పర్షియన్లు
సి) గ్రీకులు డి) చైనీయులు

13. ‘కుష్’ ప్రజల లిపిని ఏమని పిలిచేవారు?
ఎ) బొమ్మల లిపి బి) పహ్ల లిపి
సి) సౌహట్ లిపి డి) మీరియోటిక్ లిపి

మాదిరి ప్రశ్నలు

14. హరప్పా, మొహంజోదారో నగరాల్లో రోడ్ల వెడల్పు ఎన్ని మీటర్లు ఉండేది?
ఎ) 3 నుంచి 10 బి) 5 నుంచి 10
సి) 5 నుంచి 15 డి) 6 నుంచి 15

15. పురావస్తు శాస్త్ర ఆధారంగా ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించినట్లు తెలుస్తోంది?
ఎ) లక్ష బి) 2 లక్షలు
సి) 5 లక్షలు డి) 10 లక్షలు

16. ప్రాచీన శిలా యుగ కాలం?
ఎ) క్రీ.పూ. 2,50,000 – క్రీ.పూ. 10,000
బి) క్రీ.పూ. 2,00,000 – క్రీ.పూ. 10,000
సి) క్రీ.పూ. 2,50,000 – క్రీ.పూ. 1,00,000
డి) క్రీ.పూ. 2,00,000- క్రీ.పూ. 50,000

17. ‘పాలీమోలిథిక్’ అంటే ఏ యుగం?
ఎ) చారిత్రక పూర్వ బి) పాతరాతి
సి) కొత్తరాతి డి) మధ్య శిలా

18. ప్రాచీన శిలా యుగ మానవుడు ఉపయోగించిన పనిముట్లు భారతదేశంలో ఎక్కడ లభించాయి?
ఎ) వింద్య పర్వతాల్లో
బి) ద్వీపకల్ప పీఠభూమి
సి) కోసీ నది లోయలో
డి) సోన్ నది లోయలో

19. మానవుడు నిప్పును కనుగొన్న యుగం?
ఎ) ప్రాచీన శిలా బి) మధ్యశిలా
సి) లోహ డి) నవీన శిలా

20. ఏ యుగంలోని ప్రజలు తొలి సారిగా స్థిరనివాసం ఏర్పరచుకొని, వ్యవసాయం చేయడం ప్రారంభించారు?
ఎ) రాతి-తగరపు బి) మధ్య శిలా
సి) నవీన శిలా డి) ఇనుప

21. నవీన శిలా యుగం మానవులు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు?
ఎ) గ్రీక్, రోమన్ బి) ఈజిప్ట్, రోమన్
సి) గ్రీక్, ఈజిప్ట్ డి) చైనా, ఇండోనేసియా

22. వీటిలో నవీన శిలాయుగానికి చెందిన మానవుడి నివాస స్థలం కానిది?
ఎ) బ్రహ్మగిరి, సింగనకల్లు
బి) ఉట్నూరు-మస్కి
సి) జగ్గయ్యపేట, మొగల్రాజపురం
డి) టెక్కలి కోట

23. లోహయుగం ప్రారంభంలో వాడిన మొదటి లోహం?
ఎ) రాగి బి) కంచు సి) ఇనుము డి) తగరం

24. భారతదేశంలో తొలిసారిగా లోహాన్ని ఉపయోగించినవారు?
ఎ) అరబ్బులు బి) కుషాణులు
సి) ద్రవిడులు డి) ఆర్యులు

25. లోహయుగం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) క్రీ.పూ. 10,000 బి) క్రీ.పూ. 5000
సి) క్రీ.పూ. 50,000 డి) క్రీ.పూ. 1000

26. కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’లో ప్రముఖంగా దేని గురించి చర్చించారు?
ఎ) రాజ్య పాలన
బి) ప్రభుత్వ ఆర్థిక విధానాలు
సి) రాజుల అంతఃపుర విషయాలు
డి) రాజుల వంశచరిత్ర

27. సంస్కృతంలో తొలిచారిత్రక గ్రంథం?
ఎ) అమరకోశం బి) అర్థశాస్త్రం
సి) రుగ్వేదం డి) రాజతరంగిణి

28. వీటిలో సరైనవి?
ఎ) హలుడు – బృహత్కథామంజరి
బి) గుణాఢ్యుడు – గాధా సప్తశతి
సి) నృపతుంగుడు – కవిరాజమార్గం
డి) పంప – మహాభాష్యం

29. గుప్తుల కాలం నాటి ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితులను తన రచనల్లో తెల్పిన చైనా యాత్రికుడు?
ఎ) హ్యూయాన్‌త్సాంగ్ బి) ఇత్సింగ్
సి) ఫాహియాన్ డి) పై వారంతా

30. శిలప్పాధికారం, మణిమేఖలై గ్రంథాలు ఏ రాజుల కాలం నాటివి?
ఎ) పల్లవులు బి) గుప్తులు
సి) చాళుక్యులు డి) పాండ్యులు

31. వీటిలో సరైన జత?
i) ఫాహియాన్ – గుప్తులు
ii) హ్యూయాన్‌త్సాంగ్ – హర్షుడు
iii) అల్ మసూది – మిహిరభోజుడు
iv) అబ్దుల్జ్రాక్ – విజయనగరరాజులు
ఎ) i, ii బి) ii,iii
సి) i, ii, iii డి) i, ii, iii, iv

32. ‘కితాబ్-ఉల్-హింద్’ గ్రంథం రాసినవారు?
ఎ) అల్ బెరూనీ బి) జియావుద్దీన్ బరౌనీ
సి) అమీర్ ఖుస్రూ డి) కుతుబుద్దీన్ ఐబక్

33. వీటిలో సరికాని జత?
ఎ) నాగానిక – నానాఘాట్ శాసనం
బి) గౌతమీ బాలశ్రీ – నాసిక్ శాసనం
సి) సముద్ర గుప్తుడు – అలహాబాద్ శాసనం డి) పైవేవీ కావు

34. ప్రాచీన భారతదేశంలో నాణేల ముద్రణా పద్ధతుల అభివృద్ధికి కారణమైనవారు?
ఎ) ఇండో-ఆర్యన్‌లు
బి) ఇండో బాక్టియన్‌లు
సి) ఇండో గ్రీకులు డి) అరబ్బులు

35. ఏ రాజు శాసనాల ద్వారా దేశంలో తొలిసారిగా శాసన సాహిత్యం ప్రారంభమైంది?
ఎ) సముద్ర గుప్తుడు
బి) గౌతమీపుత్ర శాతకర్ణి సి) అశోకుడు
డి) కనిష్కుడు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top