You Are Here: Home » ఇతర » టాప్‌6 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌

టాప్‌6 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌

మార్కెట్లో లభ్యమవుతున్న ఆధునిక వర్షన్‌ టాబ్లెట్‌లు అలాగే స్మార్ట్‌ఫోన్‌లు డ్యూయల్‌ కోర్‌ లేదా క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్లను కలిగి ఉంటున్నాయి. ప్రాసెసర్‌ వేగాన్ని నిర్ణయించటంలో క్లాక్‌ రేట్‌ అలాగే సంఖ్యలతో కూడిన కోర్‌లు తోడ్పడతాయి. వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉత్తమైన పనితీరును చేరువ చేసే టాప్‌6 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు చూద్దాం.

Deviaహెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై : స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ హెచ్‌టీసీ పూర్తి స్థాయి హైడెఫినిషన్‌ డిస్‌ప్లేతో కూడిన సరికొత్త ‘జే బటర్‌ఫ్లై’ స్మార్ట్‌ఫోన్‌ను జపాన్‌లో ఆవిష్కరించించి. ఈ ఫోన్‌ గ్లోబల్‌ రిలీజ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 5 అంగుళాల సూపర్‌ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌లో 1.5 గిగాహెడ్జ్‌ క్వాల్కమ్‌ ఎస్‌4 ప్రో క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 2జీబి ర్యామ్‌, 16 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్నాయి.
సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 2 : 5.5 అంగుళాల సూపర్‌ ఆమోల్డ్‌ హైడెఫినిష్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.6 గిగాహెర్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 2జీబి ర్యామ్‌ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
హెచ్‌టీసీ వన్‌ ఎక్స్‌ ప్లస్‌ : 4.7 అంగుళాల సూపర్‌ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్‌ టచ్‌స్క్రీన్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 2 ప్రొటెక్షన్‌, ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.7 గిగాహెడ్జ్‌ ఎన్‌విడియో టెగ్రా 3 ఏపీ 37 ప్రాసెసర్‌, 1జీబి ర్యామ్‌, 64జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ కలిగి ఉంది.
ఎల్‌జి ఆప్టిమస్‌ జి : ఆండ్రాయిడ్‌ 4.0.4 ఐస్‌క్రీమ్‌ శాండ్విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.5 గిగా ెహడ్జ్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగెన్‌ ఎస్‌ 4 క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 32జీబి ఇంటర్నల్‌ మెమెరీ, 2జీబి ర్యామ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత.
అసూప్‌ ప్యాడ్‌ ఫోన్‌ 2 :డివైజ్‌ను టాబ్లెట్‌ అలాగే స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. 4.3 అంగుళాల సూపర్‌ ఆమోల్డ్‌ కెపాసిటివ్‌ మల్టీ టచ్‌ డిస్‌ప్లే, 4.1జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.5 గిగాహెడ్జ్‌ డ్యూయల్‌ కోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగెన్‌ ఎస్‌4 ప్రాసెసర్‌, 1జీబి ర్యామ్‌, మైక్రో ఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత కలిగి ఉంది.
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌3 : 4.8 అంగుళాల మల్టీ టచ్‌స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ వీ4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌కు ఆప్‌డేట్‌ అయ్యే అవకాశం) క్వాడ్‌కోర్‌ 1.4 గిగాహెడ్జ్‌ కార్టెక్స్‌ ఏ9 ప్రాసెసర్‌, మాలీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, 1జీబి ర్యామ్‌, ఇంటర్నల్‌ మెమెరీ 16, 32, 64 జీబి వేరియంట్స్‌లో లభ్యం, ఎక్స్‌టర్నల్‌ మెమరీ 64 జీబి వరకూ, మైక్రో ఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసి కార్డ్‌స్లాట్‌ సౌలభ్యత ఇందులో ఉన్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top