You Are Here: Home » ఇతర » టాప్‌ యూనివర్శిటీలు

టాప్‌ యూనివర్శిటీలు

దేశంలో ఉన్నత విద్యను అందించే పలు విశ్వవిద్యాలయాల్లో సర్వే జరిపింది ఇండియా టుడే మరియు నీల్సన్‌ సర్వే సంస్థలు. దేశంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల్ని గుర్తించి ర్యాంక్‌లు ఇచ్చింది. ఉన్నత విద్య విషయంలో ఆ సంస్థల్లో ఉన్న నైపుణ్యం గుర్తింపు, అత్యున్నత ప్రమాణాలు ఉన్నవాటి ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చింది. దేశంలో ఉత్తమ యూనివర్శిటీగా బెనారస్‌ హిందూ యూనివర్శిటీ మెుదటిర్యాంక్‌ సాధించింది. ఈ ర్యాంకింగ్‌లో మనరాష్ర్టంలోని యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్శిటీలు మెుదటి 10 యూనివర్శిటీల జాబితాలో స్థానం సంపాదించారుు.

ouప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న విశ్వవిద్యాలయాల్లో మన దేశంలోని టాప్‌10లో ఉన్న యూనివర్శిటీలు చోటుచేసుకున్నాయి. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ‘న్యాక్‌’ గ్రేడింగ్‌, స్టార్‌ గుర్తింపు ఉన్న యూనివర్శిటీల్లో ఇండియా టుడే, నీల్సన్‌ కలిసి జరిపిన సర్వేలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న యూనివర్శిటీలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది.

ర్యాంకింగ్‌ ఎలా?
యూనివర్శిటీల్లో మానవీయ, సైన్స్‌, కామర్స్‌ విభాగాల్లో దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలను గుర్తించడానికి సర్వే జరిపింది. దేశవ్యాప్తంగా 342 మంది నిపుణులు 6 గ్రూపులుగా విడిగా సర్వే జరిపి మొదటి 50 విశ్వవిద్యా యల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను అందిస్తున్న యూనివ ర్శిటీల్లో ఈ సర్వే జరిపింది. ఒకే ప్రాంతంలో నైపుణ్యం గల జాతీయ ప్రాముఖ్యత సంస్థలను మినహాయించారు. పద వులు, విద్యా నిపుణులు జరిపిన లోతైన ఇంటర్యూలు, లక్ష్యం స్కోర్‌ (విశ్వవిద్యాలయాలు ఇచ్చిన వాస్తవ డేటా) ఆధారంగా ఒక ఫార్ములా నిర్ణయించటానికి అభివృద్ధి చేశారు. ఈ డేటా ఆధారంగా ర్యాంకింగ్‌ విధానాన్ని, ప్రతి యూనివర్శిటీ రేటింగ్‌ ఇచ్చారు.

1. వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం
uuuఈ ర్యాంకింగ్‌ జాబితాలో మొదటిస్థానం ఆక్రమించింది. ఈ యూనివర్శిటీని 1916లో ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 20వేల మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయ ప్రదాన ప్రాంగణం విస్తీర్ణం 1300 ఎకరా లు, సౌత్‌ క్యాంపస్‌ 2,700 ఎకరాల్లో ఉంది. ఎందరో మహా నుభావులు ఈ యూనివర్శిటీలో చదువుకున్నవారే.
2. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో 7,304 మంది విద్యార్థులు, 550 మంది అధ్యాపకుల బృందంతో ప్రధానం గా ఒక పరిశోధనా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ యూనివర్శిటీ. 1969లో దీన్ని స్థాపించారు. ఇది దాదాపు వెయ్యి ఎకరాల స్థలం ఉంది.
3. యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ
ఈ యూనివర్శిటీని 1922లో స్థాపించారు. ఇక్కడి విద్యార్థుల సంఖ్య లక్షా ముఫై రెండు వందలకు పైమాటే.
7. యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, హైదరాబాద్‌
ఈ విశ్వవిద్యాల యాన్ని 1974లో ఏర్పాటు చేశారు. ఈ యూనివర్శిటీ దేశంలో 7 ర్యాంక్‌లో ఉంది. ఈ యూనివర్శిటీలో 46 వివిధ డిపార్ట్‌మెం ట్లు ఉన్నాయి. 400 మంది ఉపాధ్యా యులతో 5వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు.
11. ఆంధ్రాయూనివర్శిటీ, విశాఖపట్నం
U-(5)ఆంధ్ర విశ్వకళా పరిషత్‌గా 1926లో దీన్ని స్థాపించారు. ఇక్కడ దేశంలో మొదటిసారిగా 1934లో కామర్సులో ఆన ర్సు డిగ్రీ మొదలుపెట్టింది. 1957లో దేశంలో మొదటిసారి ఎం.బి.ఏ కోర్సును ప్రవేశపెట్టింది. ఇక ఫార్మసీ విభాగం ఏర్పాటులో దేశంలో రెండవ స్థానంలోనూ, 2008 నుండి స్కూల్‌ ఆఫ్‌ ఐటి అనే సంస్థను నెలకొల్పింది.

మొదటి 50 ర్యాంకుల్లో 50 నాగార్జున యూనివర్శిటీ, గుంటూరు, 49 జివాజీ యూనివర్శిటీ, గ్వాలియర్‌, 48 అస్సాం యూనివర్శిటీ, సిల్‌చార్‌, 47 అమరావతి యూనివర్శిటీ, అమరావతి, 46 పాట్నా యూనివర్శిటీ, పాట్నా, 45 మోహన్‌లాల్‌ సుకీంద్ర యూనివర్శిటీ, ఉదయ్‌పూర్‌, 44 ఉత్కల్‌ యూనివర్శిటీ, భువనేశ్వర్‌, 43 యూనివర్శిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, జైపూర్‌, 42 ఠాకూర్‌జజీ మహారాజ్‌ నాగపూర్‌ యూనివర్శిటీ, నాగపూర్‌, 41 భారతీదాసన్‌ యూనివర్శిటీ, తిరుచునాపల్లి, 40 రబీంద్రభారతీ యూనివర్శిటీ, కోల్‌కతా, 39 కొచ్చిన యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అం‚డ్‌ టెక్నాలజీ, ఎర్నాకులం

38 కాకతీయ యూనివర్శిటీ, వరంగల్‌, 37 ఆద్వీష్‌ ప్రతాప్‌ యూనివ ర్శిటీ, రేవా, 36 సర్థార్‌ పటేల్‌ యూనివర్శిటీ, వల్లభ్‌ విద్యాన గర్‌, గుజరాత్‌. 35 గోవా యూనివర్శిటీ, గోవా, 34 భారతీయార్‌ యూనివర్శి టీ, కోయంబత్తూర్‌, 33 అన్నా యూనివర్శిటీ, చెన్నై, 32 కర్నాటక యూనివర్శిటీ, దార్వాడ

Andhra31 హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్శిటీ, సిమ్లా, 30 శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ, తిరుపతి, 29 కురుక్షేత్ర యూనివర్శిటీ, కురుక్షేత్ర, 28 భారతీ విద్యాపీఠ్‌, పూణే, 27 యూనివర్శిటీ ఆఫ్‌ కేరళ, తిరువనంతపు రం, 26 గౌహతి యూనివర్శిటీ, గౌహతి. 25 నార్త్‌ ఈస్టరన్‌ హిల్‌ యూని వర్శిటీ, షిల్లాంగ్‌, 24 యూనివర్శిటీ ఆఫ్‌ లక్నో, లక్నో, 23 యూనివర్శిటీ ఆఫ్‌ అలహాబాద్‌, అలహాబాద్‌

22 పాండిచ్చేరి యూనివర్శిటీ, పాండిచ్చేరి, 21 బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, పిలాని20 గురునానక్‌ దేవ్‌ యూనివర్శిటీ, అమృత్‌సర్‌, 19 ఎం.ఎస్‌ యూనివ ర్శిటీ ఆఫ్‌ బరోడా, వరోదరా

U-(3)18 మధురై కామరాజ్‌ యూనివర్శిటీ, మధురై, 17 యూనివర్శిటీ ఆఫ్‌ మైసూర్‌, మైసూర్‌
16 ఆలిఘర్‌ ముస్లిం యూనివర్శిటీ, ఆలీఘర్‌, 15 జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
14 ఎస్‌.ఎన్‌.డి.టి మహిళా యూనివర్శిటీ, ముంబై, 13 బెంగళూరు యూనివర్శిటీ, బెంగళూరు
12 పంజాబ్‌ యూనివర్శిటీ, ఛండీఘడ్‌, 11 ఆంధ్రా యూనివర్శిటీ, విశా ఖపట్నం, 10 ఉస్మానియా యూనివర్శిటీ, హైదరాబాద్‌, 09 జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ, జాదవ్‌పూర, 08 ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, బెంగళూరు, 07 యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, హైదరాబాద్‌, 06 యూనివర్శిటీ ఆఫ్‌ ముంబై, ముంబై, 05 యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌, చెన్నై, 04 యూనివర్శిటీ ఆఫ్‌ కలకత్తా, కోల్‌కతా, 03 యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ, 02 జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, న్యూఢిల్లీ, 01 బెనారస్‌ హిందూ యూనివర్శిటీ, వారణాసిలు నిలిచాయి.

10.ఉస్మానియా యూనివర్శటీ, హైదరాబాద్‌
U-(2)ఉస్మానియా యూనివర్శిటీని 1918 సెప్టెంబరు 22న స్థాపించారు. ఒకప్పుడు తెలంగాణా జిల్లాల్లో వ్యాపించినా ఇప్పుడు దాని పరిధి తగ్గింది. కేవలం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైంది. ఈ యూనివర్శిటీలో 642 మంది బోధనా సిబ్బంది ఉన్నారు. ఇక్కడ విద్యా ప్రమాణాల పరంగానే కాక, ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వందే మాతర ఉద్యమం పురుడు పోసుకున్నది ఇక్కడే. విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో ఉండి. దేశంలో ఏ విశ్వవిద్యాలయంలో లేనంత మంది విదేశీ విద్యార్థులు ఇక్కడున్నారు. 79 దేశాలకు చెందిన 4వేల మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top