You Are Here: Home » ఇతర » టచ్‌ మి నాట్‌

టచ్‌ మి నాట్‌

mimటచ్‌ మి నాట్‌ అనే మొక్కని తెలుగులో ‘అత్తిపత్తి’ అని పిలుస్తారు. ఈ మొక్క శాస్ర్తీయ నామం మైమోసా పూడికా. అందులో ‘పూడికా’ అంటే ‘సిగ్గు’ అని అర్థం. ఈ టచ్‌ మి నాట్‌ గురించి తెలుసుకుందాం. ఏదైనా స్పర్శ తగలగానే ముడుచుకునే లక్షణం కలిగిన ఈ టచ్‌ మి నాట్‌ మొక్క తన ఆత్మరక్షణ ప్రక్రియలో భాగంగా అలా చేస్తుందన్నమాట. ఉన్నట్లుండి ఈ మొక్క ఆకులన్నీ ముడుచుకుపోవటాన్ని చూసిన ఏ జంతువైనా సరే తినకుండా పక్కకి వెళ్లిపోతాయి.దీంతో ఆ మొక్క తనను కాపాడుకుంటుంది. టచ్‌ మీ నాట్‌ మొక్కలు పత్ర వృంతాలలోని కణజాలాలలో నిండుగా నీరుంటుంది. అలాంటప్పుడు ఇవి నిటారుగా ఉంటాయి. ఏదైనా స్పర్శ తగిలినప్పుడు, కాంతి తగ్గినప్పుడు కొన్ని రసాయనిక ప్రక్రియల కారణంగా ఈ ఆకుల కణజాలాల్లోని నీరు స్థానభ్రంశం చెందుతుంది. అలా నీటిని పొగొట్టుకున్న ఆకులు గాలి తీసిన బుడగల్లాగా చటుక్కున ముడుచుకుంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top