You Are Here: Home » సినిమా » పాటలు » ఝుమ్మంది నాదం (2010)-ఏలోరే… ఏలోరే…

ఝుమ్మంది నాదం (2010)-ఏలోరే… ఏలోరే…

పల్లవి :
ఏలోరే… ఏలోరే…
ఏలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో
ఏం సక్కగున్నవ్‌రో నా సొట్ట సెంపలోడ
ఏం సిక్కగున్నవ్‌రో నా సిట్టి జుంపాలోడ
॥సక్కగున్నవ్‌రో॥
పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే
రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే
ఫక్కున నువు నవ్వితే
ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు
ఏరుకుంటాలే మెళ్ళో ఏసుకుంటాలే
ఏం సక్కగున్నావే సంపంగి ముక్కుదానా
ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా

చరణం : 1
చీర కొంగులో నన్ను కట్టుకో
బొడ్డు లోపలా నన్ను దోపుకో
పూల దస్తిలో నన్ను పెట్టుకో
ైరె క లోపల నన్ను దాచుకో
ఓహో ఎరన్రి రిబ్బెన పువ్వల్లే చేసి
నల్లని కొప్పున నన్ను చుట్టుకో
కొప్పున చుట్కుంటే లోకం చూస్తదీ ఆహా
రైకల పెట్కుంటే గిలిగిలైతదీ ఆహా
బొడ్డుల దోప్కుంటే… మోసమైతదీ
అమ్మొ మోసమైతదీ
ఏదో పోనీ అని వంటిగొదిలితే
ఏస్కపోతరేమో నా ఈడు ఆడోళ్ళు
సక్కగున్నవ్‌రో…
॥సక్కగున్నవ్‌రో॥

చరణం : 2
పచ్చనాకులా పళ్లెం పెట్టుతా
వేడి వేడిగా బువ్వ వడ్డిస్తా
ఆవకాయలో నెయ్యి క ల్పుతా
ముద్దు పెడితే నే ముద్ద తిన్పిస్తా
అబ్బొబ్బొ తినకుంటా నా ఏలు కోరితే
మబ్బుల్లో సెంద్రయ్య సిగ్గు సెందడా
గోరింటా ఆకులు ముద్ద నూరుతా
కాళ్ళకు వేళ్ళకు నేనే అద్దుతా
పాదాల దగ్గర నే సేద తీరుతా ఆహా
సేద తీరుతా
తెల్లవారంగానే నేనే కడుగుతా
నీ కాలి మెరుపులో
పొద్దుపొడుపునే చూస్తా

చిత్రం : ఝుమ్మంది నాదం (2010)
రచన : సుద్దాల అశోకతేజ
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : అనూజ్ గురువారా, చైత్ర

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top