You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » పురాణాలు » జ్యేష్ఠాదేవి

జ్యేష్ఠాదేవి

అవ్ఞను. ఆ దేవత ఎవ్వరికీ అక్కర్లేదు. ఎవ్వరూ పూజించరు. పైగా ఛీత్కరిస్తారు. ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి. సాక్షాత్తూ లక్ష్మీదేవి సోదరి. పూర్వం దేవతలు, దానవ్ఞలు క్షీరసాగరాన్ని మధించేటప్పుడు ఎన్నెన్నో పుట్టాయి. వాటిలో జ్యేష్ఠాదేవి ఒకరు. ఆమెకు దుస్సహుడు అనే బ్రాహ్మణుడితో వివాహ మైంది. వేరు కాపురానికి అనువైన ప్రదేశం ఎక్కడా దొరకలేదు.
జ్యేష్ఠాదేవికి దైవపూజ, వేదపఠనం, శుభకార్యాలు అంటే విపరీతమైన అసహ్యం. అక్కడ ఉండకుండా పారిపోయేది కూడా. ఈ పరిస్థితిలో భర్త అయిన దుస్సహుడుకి ఏమీ పాలుపోయేది కాదు. ఒకనాడు తన బాధని మార్కండేయ మునికి చెప్పుకొని దుఃఖపడ్డాడు. తాముండ తగిన ప్రదేశము సూచించమని వేడుకున్నాడు. దానికాముని ఆలో చించి అన్నాడు. ఎక్కడ భగవన్నామ సంకీర్తలు ఉండవో, యజ్ఞయాగాలు జరగవో, భక్తజన సందోహం ఎక్కడ ఉండరో ఆ ప్రదేశానికి వెళ్లమని ఆ ముని చెప్పాడు.
దుస్సహుడికి ఆయన హితవ్ఞ రుచించలేదు. దయచేసి అటువంటి ప్రదేశం ఎక్కడుంటుందో చెబితే అక్కడ ఉంటామని అడిగాడు. అప్పుడు ఆ ముని జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవతగా పేర్కొని వారి కాపురానికి పనికివచ్చే అనువైన ప్రదేశాలు చెప్పాడు. ఏ ఇంటి ఆవరణంలో ముళ్లకంపలు, చెత్తా, చెదారం ఉంటాయో అది జ్యేష్ఠాదేవికి ప్రీతికరంగా ఉంటాయి. మానసిక శుభ్రత లేకుండా, పళ్లు తోముకోకుండా, స్నానం కూడా చెయ్యకుండా, అత్యంత లోభగుణం ఉండి మురికి వస్త్రాలు ధరిస్తారో, వారి సన్నిధి కూడా నివాసయోగ్యమే.
ఆవిడకి ఇంకా సంధ్యా సమయాలలో నిద్రపోయే వారు, ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేసేవారు, చెడు వ్యసనాలను కలిగి ఉండేవారు, ఎల్లప్పుడు ఇతరులనే నిందించే వారు,  కాళ్లు, చేతులు కడుక్కొనకుండా భోజనం చేసేవారు, ఇటువంటి వారి సన్నిధి జ్యేష్ఠాదేవికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. ముని మాటలను విన్న దుస్సహుడు భార్యని అక్కడే విడిచి, అనువైన ప్రదేశం వెదకడానికి వెళ్లాడు.
ఆ తరువాత కొంత కాలానికి శ్రీమహావిష్ణువ్ఞ, భార్య లక్ష్మి ఆ ప్రదేశానికి వచ్చి జ్యేష్ఠాదేవిని చూసి చాలా జాలిపడ్డారు. ఆ దరిద్ర దేవతకు తగిన ఆహారం ఇచ్చి ఉప శమనం కలుగజేశారు.
దుస్సహుడు వచ్చేదాక తను ఏవిధంగా జీవించాలని జ్యేష్ఠాదేవి అడుగగా, ఎవరు దేవతలను భగవంతుణ్ణి నిందిస్తుంటారో వారి దానం, జ్యేష్ఠాదేవికి అందేటట్టు వరం ఇచ్చాడు. భర్త వచ్చేంత వరకు ఇటువంటి దానంతో కాలక్షేపం చెయ్య మని సలహా ఇచ్చి, విష్ణువర్తి భార్యతో సహా వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఇదీ దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవికథ.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top