You Are Here: Home » ఇతర » జ్ఞానపీఠం మీద కొలువైన వనితలు

జ్ఞానపీఠం మీద కొలువైన వనితలు

సాహితీ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం ‘జ్ఞానపీఠ’ పురస్కారం. ఈ అవార్డ్‌ని అందుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఈ అవార్డ్‌ కింద వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, ఐదులక్షల నగదు ఇస్తారు. అన్నిటికన్నా మించి ఈ పురస్కారాన్ని అందుకో వడం వల్ల విశ్వవ్యాప్తంగా వచ్చే కీర్తి, గుర్తింపు మరింత విలువైవి. ఈ పురస్కారం వరించాలే తప్ప సామాన్యంగా దొరిేకది కాదు. అసాధారణ ప్రతిభకి ఈ పురస్కారం లభిస్తుంది. ఎంతో సాహిత్య అభిలాష కలిగిన ఆంగ్ల పత్రిక ‘టైవ్గ్సు ఆఫ్‌ ఇండియా‘వ్యవస్థాపకులు సాహుజైన్‌ కుటుంబ సభ్యులు ఈ జ్ఞానపీఠ అవార్డ్‌ను ఏర్పాటు చేశారు. వారే ప్రతిఏడూ ఈ పురస్కారాన్ని భారతీయ భాషలలో విశేషంగా కృషి చేసిన రచరుుతలకు ఇస్తున్నారు.
జీవిత వివరాలు

పుట్టిన తేదీ 	: మార్చి 26, 1907
పుట్టిన ఊరు : ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌
వృత్తి : రచయిత్రి, కవయిత్రి,
స్వాతంత్య్ర సమరయోధురాలు,
మహిళా ఉద్యమకారిణి,
విద్యావేత్త
నిర్ధిష్టత : సదాచార హిందూ కుటుంబం
ప్రాధమిక విద్య : క్రాస్త్‌వెయిట్‌ బాలికల పాఠశాల,
అలహాబాద్‌
పొందిన పురస్కారాలు : 1979 సాహిత్య అకాడమీ
ఫెలోషిప్‌, 1982 జ్ఞానపీఠ
అవార్డు
మరణం : 11 సెప్టెంబర్‌ 1987 (80)

మహాదేవి వర్మ.
Mahaaఈమె హిందీ రచయిత్రి, ప్రముఖ స్వాంతత్య్ర సమరయోధురాలు, మంచి విద్యావేత్త. 1914 నుండి 1938 మధ్య కాలంలో ఈమె ఆధునిక హిందీ సాహి త్యంలో సరికొత్త పోకడలు ప్రవేశపెట్టిం ది. వృత్తి రీత్యా ఈమె కాలేజీ ప్రధానోపాద్యాయురాలిగా, ఆ తరువాత అలహాబాద్‌లోని మహిళా రెసిడెన్షియల్‌ కాలేజీకి వైస్‌ ఛాన్సెలర్‌గా పదవీ బాధ్య తలు నిర్వహించింది. ఈమె 1979లో సాహిత్యరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌తోపాటు సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ పొందింది. అదే విధంగా 1982లో భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మ కమైన ‘జ్ఞానపీఠ’ అవార్డ్‌ని అందుకుంది. 1988లో కూడా పద్మ విభూషణ్‌, భారతీయ అత్యున్నత పౌర సత్కారాన్ని పొందింది.

మహాదేవి వర్మ కనబరిచిన ప్రతిభా పాఠవాలకి, చురుకైన మేథస్సుకి, సునిశిత దృష్టికీ, సృజనాత్మకతకీ గుర్తింపుగా హిందీ సాహిత్య రంగంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. 1934లో చ్ఛాయావాద్‌ మూవ్‌మెంట్‌కు తను చేసిన సేవలకు హిందీ సాహిత్య సమ్మేళన్‌ వారి ద్వారా సిక్సేరియా పురస్కారాన్ని పొందింది. అదే విధంగా ‘అల్హాబాద్‌ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సంఘం’ ఈమెను ‘గర్వించ దగ్గ మహిళ’గా సత్కరించారు. 1956లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఈ విధంగా అనేక పురస్కారాలు, సత్కారాలు ఈమెను వరించి వచ్చాయంటే ఏమాత్రం అతిశయోక్తికాదు.

జీవిత వివరాలు

పుట్టిన తేదీ		: 14 నవంబర్‌, 
1942
పుట్టిన ఊరు : గౌహటి
వృత్తి : ఉద్యమకారిణి,
సంపాదకురాలు,
కవియిత్రి,
ప్రొఫెసర్‌,
రచయిత్రి
పురస్కారాలు : 2001 జ్ఞానపీఠ
అవార్డు
మరణం : 29 నవంబర్‌ 2011

ఇందిరా గోస్వామి
goswaniఈమె అస్సామీ సాహిత్యరంగంలో మెరిసిన దృవతార. ఇందిర అస్సామీ సంపాదకురాలిగా, కవయిత్రిగా, ప్రొఫెసర్‌గా, పండితురాలిగా, రచయిత్రిగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈమె అస్సామీ సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి 1983లో సాహిత్య అకాడమీ అవార్డ్‌, 2001లో జ్ఞానపీఠ అవార్డు, 2008లో ప్రిన్సిపాల్‌ ప్రిన్స్‌ క్లాజ్‌ లారియేట్‌ పురస్కారం, ఇలా అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకుంది. ఈమె అస్సామీ సాహిత్య రంగంలో విశేష కృషి చేసినందుకు అనేక ప్రత్యేక గుర్తింపులు కూడా పొందింది. భారత ప్రభుత్వానికీ, మిలటెంట్లు, యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ సమస్యల మధ్య మధ్యవర్తిగా కీలకపాత్ర పోషించింది.

అందుకు ఫలితంగా ‘పీపుల్స్‌ కన్సల్టేటివ్‌ గ్రూప్‌’ అనే శాంతి సంఘం ఏర్పాటుకు దోహదం అయ్యింది. ఈమె రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో మంచి చైతన్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించింది. ఈమె రచనల ఆధారంగా అనేక నాటకాలు, చలన చిత్రాలు కూడా నిర్మించడం జరిగింది. అలా ఈమె నవల ఆధారంగా నిర్మించిన అస్సామీ ‘అదజ్య’ చిత్రం అంతర్జాతీయ అవార్డులు సాధించింది.

అమృతా ప్రీతమ్
pritamఈమె ఆగస్ట్‌ 31, 1919లో పుట్టింది. ఈమె అసలు పేరు అమృతా కౌర్‌. పంజాబీ రచయిత్రిగా, కవయిత్రిగా చాలా ప్రసిద్దిచెందింది. అంతేకాక ఈమె పంజాబీ సాహిత్య రంగంలో ప్రముఖ స్థానాన్ని అధిరోహించిన తొలిమహిళ. ఈమె ఎన్నో నవలలు రచించింది. మరెన్నో వ్యాసాలు, కవితలు కూడా తన కలం నుండి జాలువారాయి. ఈమె కవితలు, కాల్పనికాలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద గీతాల సంకలనాలతో కలిపి సుమారుగా 100కి పైగా పుస్తకాలు ప్రచురించింది. ఈ పుస్తకాలు భారతీయ భాషల్లోను, విదేశీ భాషల్లోను కూడా అనువదింపబడ్డాయి. ఈమె రచించిన కొన్ని కవితలు అసాధారణ గుర్తింపుని పొందాయి.

2003లో ఈమె నవల ఆధారంగా నిర్మించిన పింజర్‌ చిత్రం ఎన్నో అవార్డుల్ని గెలుచుకుంది. ఇండియా, పాకిస్తాన్‌లు విడిపోయిన తర్వాత ఈమె లాహోర్‌ నుండి ఇండియాకు వచ్చేసింది. 1956లో ఈమె రచించిన సుదీర్ఘ కవిత ‘సునేహే’కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆ తరువాత 1982లో అత్యంత ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకుంది. 1969లో పద్మశ్రీతో సత్కరించారు. 2004లో పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకుంది. ఇదే సంవత్సరంలో సాహిత్య అకాడమీ అత్యుత్తమ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ విధంగా అనేక సన్మాన, సత్కార, పురస్కారాలు ఈమెకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నీ అందించాయి.

జీవిత వివరాలు

పుట్టిన తేదీ 	: జనవరి 14, 1926
పుట్టిన ఊరు : ఢాకా
వృత్తి : ఉద్యమకారిణి,
సాహితీవేత్త
రచనలు : నవలలు,
కథానికలు,
నాటికలు,
వ్యాసాలు
విషయాలు : గిరిజనాభివృద్ది

మహాశ్వేతా దేవి
Mahasఈమె సాహితీ వేత్తలైన హిందూ బ్రాహ్మణ కుటుంబం లో 1926లో ఢాకాలో పుట్టింది. మహాశ్వేతాదేవి ప్రాధమిక విద్య ఢాకాలోనే జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వీరి కుటుంబం ఇండియాకు వచ్చేసి వెస్ట్‌ బెంగాల్లో స్థిరపడ్డారు. స్వేత శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన విశ్వభారతీ విశ్వవిద్యాల యంలో బిఏ (ఇంగ్లీష్‌ ఆనర్స్‌) చేసింది. ఆతరువాత కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేసింది. బిజోయ్‌ఘర్‌ కాలేజీలో ఉపాద్యాయ వృత్తిలో కొనసాగింది. ఇక్కడ ఉండగానే తన రచనావ్యాసంగాన్ని విసృ్తతం చేసింది. వెస్ట్‌ బెంగాల్‌లోని గిరిజన వర్గాల గురించి ఈమె ఎంతో కృషి చేయడం వల్ల ఈమెకు ఆ వర్గాల్లో అత్యంత పలుకుబడి ఉంది.

కేవలం అక్కడే కాకుండా బీహార్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ ప్రాంతాల్లో ఉన్న గిరిజన సమస్యల మీద కూడా ఈమె ఎంతగానో ఉద్యమించింది. తన అనుభవాల సారాన్ని తన రచనల్లో ప్రతిబింబింపచేస్తూ చాలామదిని ప్రభావితం చేసింది. సాహిత్య పరంగా కూడా ఈమె అనేక కొత్తకోణాలు ఆవిష్కరించి బెంగాలీ సాహిత్యానికి ఒక కొత్త ఒరవడిని తెచ్చింది. అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకుంది. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘జ్ఞానపీఠ’ అవార్డు 1996లో ఈమెను వరించింది. అలాగే 1979 సాహిత్య అకాడమీ అవార్డు, 1986లో పద్మశ్రీ అవార్డు, 1997లో రామన్‌ మెగసెసె అవార్డు, 1999లో ఇందిరాగాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆనరీస్‌ కౌస పురస్కారం, 2006లో పద్మవిభూషణ్‌, 2010లో యశ్వంతరావ్‌ చవాన్‌ జాతీయ పురస్కారం, 2011లో బంగబిభూషణ్‌ అవార్డు, 2012లో హాల్‌ ఆఫ్‌ ఫేం జీవితకాల పురస్కారం వంటి అనేక ఇతర అవార్డులు, రివార్డులూ కూడా తన ప్రతిభలో జమచేసుకుంది.

జీవిత వివరాలు

పుట్టిన తేదీ 	: జనవరి 21, 1943
పుట్టిన ఊరు : అలబోల్‌ ఒరిస్సా
మాతృభాష : ఒరియా
విద్యార్హతలు : ఎంఏ పిహెచ్‌డి
గుర్తించదగ్గ వర్క్‌‌స : యజ్నసేని, షీలాపద్మ

ప్రతిభారాయ్‌
Pratibaఈమె 1943 జనవరి 21న ఒరిస్సా రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామం అలాబొల్‌లో పుట్టింది. 1991లో మూర్తిదేవి అవార్డుని అందుకున్న తొలి మహిళా సాహితీవేత్త. సమకాలీన భారతదేశంలో ఈమె ఒక కాల్పనిక నవలా రచయిత్రి. ఈమె మాతృభాష ఒరియా లోనే అనేక నవలలు, కథానికలు రచించింది. 1974లో రచించిన బర్షా బసంతా బైషాకా ఈమె తొలి నవల. ఈమె రచనల్లో ఎక్కువ మానవత్వ విలువలు తొంగిచూస్తాయి. అందుకు ఈమె తండ్రి పరశు రాం దాస్‌ గాంధేయవాది కావడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈమె 9వ ఏట నుంచే సాంఘిక అసమానతలు, ప్రేమ, శాంతి, సమైఖ్యతల మీద ఎంతో ప్రభావితురాలయ్యింది. ఈ సుగుణాలే ఈమెకు ప్రేరణగా మారాయి. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయాలని ఎంతో కృషి చేసింది.

వివాహానంతరం కూడా ఈమె తన రచనావ్యాసంగాన్ని కొనసాగించింది. ఈమె పిల్లలు ఎదుగుతున్న సమయంలోనే ప్రతిభారాయ్‌ మాస్టర్స్‌ డిగ్రీ, పిహెచ్‌డీ కూడా చేసింది. అందులో కూడా ఈమె సైకాలజీనే ప్రధానాంశంగా తీసుకుంది. ‘ట్రైబలిజం అండ్‌ క్రిమినాలజీ ఆఫ్‌ బొండో హైలాండ్‌’ మీద పరిశోధన చేసింది.
శ్రమ ఫలితం : ఈమె చేసిన అన్యన సేవలకి గుర్తింపుగా 1985లో ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డు , 1990లో సరళ అవార్డు, 1991 లో మూర్తిదేవి అవార్డు, 2000లో సాహిత్య అకాడమీ అవార్డు, 2006లో అమృత కీర్తి పురస్కారం, 2007 పద్మశ్రీ, 2011 జ్ఞానపీఠ పురస్కారం.

ఖుర్రాత్‌-ఉల్‌-ఐన్‌ హైదర్‌
quratuaజనవరి 20, 1926న ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌లో పుట్టిన ఈమె ఉర్దూలో మంచి కాల్పనిక రచయిత్రి. ఈమె ఉర్దూ సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చిన మేథావి. లక్నో విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తరువాత 1947లో పాకిస్తాన్‌లో కొంతకాలం నివసిం చింది. ఆతరువాత లండన్‌లో మరికొంతకాలం ఉండి 1960లో భారతదేశానికి తిరిగి వచ్చింది. ఇక్కడ బొంబాయిలో సుమారుగా 20 సంవత్సరాలు ఉన్న తరువాత న్యూ ఢిల్లీ దగ్గరున్న నొయిడాకు మారింది. ఈమె చివరి శ్వాస వరకూ ఇక్కడే బ్రహ్మచారిణిగా రచనావ్యాసంగాలతో కాలం కడిపింది. ఈమె జీవించడం కోసం జర్నలిస్ట్‌గా పనిచేసింది. ఎన్నో రచనలు చేసింది. అనువాదాలు చేసింది. మరెన్నో నవలలు రాసింది.

1964-68 మధ్యకాలంలో ముంబాయిలో ఉండగానే ఒక పత్రికకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించింది. ఈమె రాసిన పుస్తకాలు ఇంగ్లీషులోకి, ఇతర భాషలోకీ కూడా అనువదింపబడ్డాయి. అతిథి ఉపన్యాసకురాలిగా కాలిఫోర్నియా, చికాగో, విస్ట్‌కాన్సిన్‌, అరిజోనా విశ్వవిద్యాలయాల్లో అనేక సార్లు తన ప్రసంగాన్ని వినిపించింది. ఆలిఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఈమె విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా తన సేవలందించింది. ఈమె తన సాహిత్య కృషికి ఎన్నో పురస్కారాలు అందుకుంది. అన్నిటికన్నా ప్రధానమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని 1989లో అం దుకుంది. 1967లో సాహిత్య అకాడమీ అవార్డు, 1969లో సోవియట్‌ లాండ్‌ నెహ్రూ అవార్డు, 1984లో పద్మశ్రీ అవార్డు, 1985లో గాలిబ్‌ అవార్డు, 2000లో షా జఫర్‌ అవార్డు, 20 05లో పద్మభూషణ్‌ అవార్డులు అత్యంత ముఖ్యమైనవి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top