You Are Here: Home » ఇతర » జోరుగా .. హుషారుగా

జోరుగా .. హుషారుగా

అదిరే అందాలతో మోడల్స్‌ ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోస్తున్నారు. సరికొత్త ఫ్యాషన్‌ గార్మెంట్స్‌తో తళుక్కుమంటున్నారు. కొత్తగా వచ్చే డిజైన్లను ధరించి తమ అందచందాలతో ఆహూ తులను మైమరిపిస్తు న్నారు. కాలేజీ యువతరానికి సరికొత్త కిక్‌ అందిస్తున్నారు. వెరైటీ డ్రస్సులపై హొయలొలికించి భాగ్య నగరాన్ని ఫ్యాషన్‌హబ్‌గా మార్చేస్తున్నారు. మోడల్స్‌తోపాటు టాలీవుడ్గ, బాలీవుడ్గ సెలబ్రిటీలు సైతం షో స్టాపర్లుగా ర్యాంప్‌పై దర్శనమిచ్చారు. భాగ్యనగరంలో ప్రస్తుతం ఫ్యాషన్‌ జోష్‌ కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌ నోవోటెల్‌లో జరిగిన కార్యక్రమంలో మోడల్స్‌ సందడి చేశారు. ఆ వివరాలు ఈ వారం ‘స్టైల్‌’లో మీకోసం..

Newaభాగ్యనగరంలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్యాషన్‌షోలు పరిపాటిగా మారుతున్నాయి. సినిమా ప్రమోషన్ల నుంచి కొత్త ఉత్పత్తుల విడుదల వరకు ఇవే కనిపిస్తున్నాయి. ఆసు పత్రి ప్రారంభోత్సవం నుంచి రెస్టారెంట్ల ఓపెనింగ్‌ల వరకు మోడల్స్‌ తళుక్కుమంటున్నారు. మోడల్స్‌కు ఆదాయ వనరుగా మారుతున్న ఈ షోలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. రోజురోజుకు కొత్తగా వస్తున్న ఫ్యాషన్‌ను పరిచయం చేసేందుకు వారు పోటీపడు తున్నారు. షోరూమ్‌ల నిర్వాహకులు కూడా పోటీపడి మరీ తమ ప్రచారానికి వీటిని వేదికగా ఎంచుకుంటు న్నారు. ర్యాంప్‌పై ముద్దుగుమ్మలు కూడా వయ్యారాలు ఒలకబోస్తున్నారు. తమ అందచందాలతో అదిరేటి డ్రస్సులతో ఆహూతులను మైమరిపిస్తున్నారు. కొంగొత్త వెరైటీలను భాగ్యనగర ఫ్యాషన్‌ప్రియులకు పరిచయం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఫ్యాషన్‌ షోలు సెలబ్రిటీలకు సరికొత్త ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

యువత అందాలకు మెరుగులు…
ఫ్యాషన్‌ ప్రపంచంలో రారాజుల్లా వెలిగిపోవాలని నేటి యువతరం ఉవ్విళ్లూరుతోంది. తమ అందచందాలకు మెరుగులు దిద్దుకునేందుకు సై అంటోంది. అందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడడంలేదు. ఇందుకు తగ్గట్లుగా భాగ్యనగరంలో జరుగుతున్న అందాల పోటీలు యువతరాన్ని ఆ రంగంలోకి రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. దీంతో నేటి యువతీ, యువకులు బ్యూటీస్పాల బాట పడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పాల నిర్వాహకులు అన్ని హంగులతో వారి మేకప్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. శిరోజాల సంరక్షణ నుంచి గోళ్ల అందాల వరకు ప్రత్యేక ప్యాకేజీల్లో ఇవి సేవలను అందిస్తున్నాయి. కాలేజీకి వెళ్లే యూత్‌ను దృష్టిలో ఉంచుకుని సకల సౌకర్యాలు ఒకేచోట లభించేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.

అందాల పోటీల్లో ప్రతిభ…
నగర యువతీ, యువకులు అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు. కాలజీలో చదువుకుంటూనే ఈ పోటీల్లో రాణిస్తూ స్వయం ఉపాధిని అప్పుడే వెతుక్కుంటున్నారు. కొంతమంది యువతీ, యువకులు చదువుకుంటూనే మోడలింగ్‌ రంగంపై ఆకర్షితులై ఈ రంగంలో స్థిరపడుతున్నారు. మరి కొంతమంది హాబీగా ఎంచుకుంటున్నారు. టెలివిజన్‌ సీరియల్స్‌, ప్రైవేటు ప్రకటనలతో పాటు సినీ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. దీంతో మోడలింగ్‌, యాక్టింగ్‌లో సైతం శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా ఏర్పాటవుతున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top