You Are Here: Home » ఇతర » జెన్‌ ఫోకస్‌ నుంచి కొత్త టాబ్లెట్‌

జెన్‌ ఫోకస్‌ నుంచి కొత్త టాబ్లెట్‌

ప్రముఖ టాబ్లెట్‌ కంప్యూటర్‌ల తయారీ బ్రాండ్‌ జెన్‌ఫోకస్‌, ‘‘మై జెన్‌టాబ్‌ 708బి’’ పేరుతో సరికొత్త ఎంట్రీలెవల్‌ ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌ను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5,999. 7 అంగుళాల కెపాసిటివ్‌ 5 పాయింట్‌ మల్టీ టచ్‌స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ వర్షన్‌ 4.0.3 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, బాక్స్‌ చిప్‌ ఏ13 చిప్‌సెట్‌ (సంధానించబడిన మాలీ400 గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో), 512 ఎంబి డీడీఆర్‌3 ర్యామ్‌, 0.3 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, టాబ్లెట్‌ను బాహ్య ప్రదేశాల్లో వినియోగించుకునేందుకు యూఎస్బీ ఇంకా కీబోర్డ్‌, 3 జీ వయా డాంగిల్‌, వైఫై, 4జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్నాయి.

ఈ డివైజ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జెన్‌ఫోకస్‌ స్పందిస్తూ వినియోగదారుకు చవక ధరలో అత్యుత్తమ క్వాలిటీతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేసే క్రమంలో ‘708బి’ని రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ప్రకటించింది.

జెన్‌ ఆల్ట్రా ట్యాబ్‌ ఏ900
myzaబడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌లకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ జెన్‌ మొబైల్‌ ‘ఆల్ట్రా ట్యాబ్‌ ఏ900’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్‌ ఐసీఎస్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.7,999లు. 9 అంగుళాల స్క్రీన్‌ పరిమాణంలో రూపుదిద్దుకున్న ‘ఆల్ట్రా ట్యాబ్‌ ఏ900’ అత్యుత్తమ కంప్యూటింగ్‌ ఫీచర్లను ఒదిగి ఉంది. దీనిలో 9 అంగుళాల కెపాసిటివ్‌ టచ్‌స్క్రీన్‌, 1.5 గిగాెహడ్జ్‌ ప్రాసెసర్‌, క్వాడ్‌కోర్‌ మాలీ 400 గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఆండ్రాయిడ్‌ ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 4జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 512ఎంబీ ర్యామ్‌, మైక్రో ఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 1.3 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 3జీ వయా డాంగిల్‌, వైఫై, మైక్రో యూఎస్బీ పోర్ట్‌, 4000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఇంకా చాట్‌ అప్లికేషన్స్‌, బాలివుడ్‌ జేఐ ఎంటర్‌టైన్‌మెంట్‌ అప్లికేషన్‌, మ్యాప్‌ మై ఇండియా, నావిగేషన్‌ అప్లికేషన్‌, లైవ్‌ టివీ అప్లికేషన్‌ ఉన్నాయి. దీని ధర రూ.7,999లు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top