You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » జీవితమే ఓ నాటకరంగం

జీవితమే ఓ నాటకరంగం

జనపథం నుంచే జానపద కళలు పుట్టారుు. మజ్జిగ నుండి నవనీతం ఉద్భవించినట్టు జానపద కళల నుండి నాటకం ఉద్భవించింది. ఆ మార్గంలో జీవితాన్ని జీవితంలా చూపేలా నాటకం దర్పణం పట్టింది. ఇంకా చెప్పాలంటే నాటకం జీవన ధ్యానమైంది. శ్వాస పీలుస్తూ శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం అంటున్నారు.

Untaqజనపథం నుంచే జానపద కళలు పుట్టాయి. మజ్జిగ నుండి నవనీతం ఉద్భవించినట్టు జానపద కళల నుండి నాటకం ఉద్భవించింది. ఆ మార్గంలో జీవితాన్ని జీవితంలా చూపేలా నాటకం దర్పణం పట్టింది. ఇంకా చెప్పాలంటే నాటకం జీవన ధ్యానమైంది. శ్వాస పీలుస్తూ శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం అంటు న్నారు. జీవితాన్ని అనుభవిస్తు జీవితాన్ని దర్శించడం నాటకం ద్వారా సాధ్యమవుతుంది. వర్గ సమాజంలో పాలకులు – పాలితులు ఏర్పడిన తర్వాత, జన జీవితంలో అంతర్భాగమైన జానపదకళలు పాలకులకు వినోద సాధనాలుగా మిగిలిపోయాయి. నాగరికత ముసుగులో అంతరాన్ని సృష్టించి, ఉన్నత జీవితాన్ని అనుసరిస్తున్నామనుకున్న పాలకవర్గం, తమ భావజాలానికి అనుగుణంగా కళలను మలచడానికి తీవ్రంగా కృషి చేసింది.

yamuచరిత్ర మనకు చెబుతున్నది అదే. ఇచ్చిపుచ్చుకునే మర్యాదపూర్వక సాంస్కృతిక స్థాయి, ధనస్వామ్య పాల నలో అమ్ముకుని కొనుక్కునే వస్తు సంస్కృతి స్థాయికి దిగజార్చింది.పెట్టుబడిదారీవర్గం యంత్రాలతో పాటు సమాంతరంగా యాంత్రిక జీవితాన్ని అలవాటు చేసిం ది. ఇక ఇప్పుడు పోటీ మార్కెట్‌ సంస్కృతే జనజీవన విధానమని నేటి ప్రపంచీకరణ పాలక వర్గం ప్రజల్ని పరుగులు పెట్టిస్తున్నది.ఫలితంగా మనిషి శ్రమైక జీవన సౌందర్యం నుండి క్షణక్షణం దూరమవుతు న్నాడు. ఒక్కమా టలో చెప్పాలంటే మనిషిలో మనిషితనం లోపించి పరారుూకరణం చెందుతున్నాడు. ఆట పాటలేని జీవితం రసహీనంగా మారింది. సమిష్టి ఆనం దంలోని రసరమ్యమైన సామాజిక సాంస్కృతిక అల్లిక (ఫ్యాబ్రిక్‌) గల్లంతయి పోతున్నది. జీవితానికి ప్రతిబిం బమైన నాటకం కూడా అంతే. పొడి పొడి మాటలకే పరిమితమై పోతున్నది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top