You Are Here: Home » సినిమా » పాటలు » జీవన తరంగాలు (1973)-ఈ అందానికి బంధం వేశానొకనాడు

జీవన తరంగాలు (1973)-ఈ అందానికి బంధం వేశానొకనాడు

పల్లవి :

ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈనాడు
॥అందానికి॥

చరణం : 1

నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపే నీ బుగ్గపై పాకెను
॥కళ్లు॥

నీ చేతులానాడు తెరలాయెను
నేడు ఆ తెరలే కౌగిలై పెనవేసెను
॥అందానికి॥

చరణం : 2

నీ వేడిలోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది
॥వేడిలోనే॥

ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో
ఇంద్రధనుస్సే విరిసింది
ఏడురంగుల ముగ్గులు వేసి
నింగీనేలను కలిపింది
ప్రేమకు పెళ్లే చేసింది
॥అందానికి॥

చిత్రం : జీవన తరంగాలు (1973)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : జె.వి.రాఘవులు
గానం : ఘంటసాల, పి.సుశీల

అసలు పేరు : ఉప్పు శోభనాచలపతిరావు

జననం : 14-01-1937

జన్మస్థలం : కుంటముక్కల, కృష్ణాజిల్లా

తల్లిదండ్రులు : రామతులశమ్మ, సూర్యనారాయణరావు

తోబుట్టువులు : చెల్లెళ్లు (ధనరంగ, ఝాన్సీ, నిర్మల), తమ్ముడు (సాంబశివరావు)

చదువు : బిఎస్సీ ( ‘లా’ చదువును మధ్యలో ఆపేశారు)

వివాహం : 15-5-1958

భార్య : శాంతకుమారి

పిల్లలు : కుమారుడు (కరుణశేషు),కుమార్తెలు (మృదుల, ప్రశాంతి, నివేదిత)

తొలి సినిమా-పాత్ర -పారితోషకం : దైవబలం (1959) – గంధర్వకుమారుడు – 200 రూపాయలు

ఆఖరి చిత్రం : హలో గురూ (1996)

నటించిన సినిమాలు : 231

అవార్డులు : ఉత్తమ నటుడిగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులు (ఖైదీ బాబాయ్-1974, జీవనజ్యోతి-1975, సోగ్గాడు-1976, కార్తీకదీపం-1979), ఉత్తమ చిత్ర కథానాయకునిగా ఐదు నంది అవార్డులు (మనుషులు మారాలి-1969, చెల్లెలి కాపురం-1971, కాలం మారింది-1972, శారద-1973,జీవనజ్యోతి-1975), మరెన్నో సినీ అవార్డులు.

బిరుదులు : నటభూషణ, సోగ్గాడు

మరణం : 20-3-2008

విగ్రహం : మొదటి వర్ధంతినాడు కాంస్య విగ్రహాన్ని రాజమండ్రిలో ఆవిష్కరించారు

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top