You Are Here: Home » ఇతర » జీవనశైలిని మార్చుకోవటం ద్వారా అదుపులో బీపీ

జీవనశైలిని మార్చుకోవటం ద్వారా అదుపులో బీపీ

‘హైబిపి’ ని అదుపు చేసుకోవటంలో జీవనశైలి లో తగు మార్పుల్ని చేసుకోవటం చాలా ముఖ్య మైనది. జీవనశైలిలో శాశ్వత మార్పుల్ని చేసుకో వటం కొంచెం కష్టసాధ్యమే అయినా కూడా బిపిని అదుపులోకి తెచ్చుకోవాలంటే అది చేయ క తప్పదు.

BPsఇంతకుమునుపు ఒక అధ్యాయంలో చెప్పుకు న్నట్లుగా ‘హైబిపి’ మూలంగా మీ శరీరం నిండా అల్లుకుని ఉన్న రక్తనాళాలమీద వొత్తిడి పడుతుంది. దానివల్ల రక్తనా ళాలు ఇరుకుగా కావ టమో బలహీనపడటమో జరుగుతాయి. తర్వాత గుండె, కిడ్నీలు, మెదడులాంటివి డామేజ్‌ కావటం మొదలెడతాయి.మీలో బిపి ఎంతగా ఎక్కువ ఉంటే అంతగా మీకు గుండె జబ్బులు, పక్షవాతం లాంటివి రావటానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి.అయితే ఒక మంచి వార్త ఏమిటంటే హైబిపిని మనకు మనం గా అదుపులోకి తేవచ్చు. అది మందుల్ని వాడడం ద్వారా కానీండి, జీవనశైలిలో మార్పుల ద్వారా కానీండి.మరో విషయం ఏమిటంటే మందల్ని వాడుతున్న కూడా జీవ నశైలిలో మార్పుల్ని చేసుకోక తప్పదు. ఇలా ఏరకంగా చూసి నా కూడా హైబి పిని అదుపులోకి తేవటంలో ‘జీవనశైలిలో మార్పుల్ని చేసుకోవటం’ చాలా కీలకపాత్ర వహి స్తుంది.

హైబిపి స్టేజ్‌-1 (140-150/90-99 ఝఝ ఏ) స్టేజ్‌-2 (160-179/100- 109ఝఝ ఏ) స్థాయిలో ఉన్న వ్యక్తుల ఆహారం విషయంలో కానీండి, బరువు తగ్గే విషయంలో కానీం డి, ఎక్సర్‌సైజ్‌లు చేయటం విషయంలో కానీండి ఒక నిష్టగా జీ వనశైలిలో మార్పుల్ని చేసుకున్నప్పుడు వాళ్ళలో చెప్పుకోదగ్గ రీతిలో బిపి తగ్గిపోతుంది.జీవనశైలిలో మార్పుల్ని చేసుకోవటం వల్ల ఒకోసారి కొందరికి మందుల్ని వాడిల్సిన అవసరం లేకపోవచ్చు కూడా.అంతేకాక జీవనశైలిలో మార్పుల్ని చేసుకోవటం వల్ల మందు లు సమర్థవంతంగా కూడా పని చేస్తాయి. దానివల్ల పేషెంటుకి మందుల్ని తక్కువ డోసులో వాడితే సరిపోవచ్చు. లేదా తక్కువ రకాల మందుల్ని వాడినా సరిపోతుంది.

హైబిపిని అదుపులో ఉంచుకోవటానికి జీవన శైలిలో చేసుకో వాల్సిన మార్పులు ఏమేమి టంటే:

 • ఉప్పు వాడకాన్ని తగ్గించటం
 • కాయకూరలు, పళ్ళు ఫలాల్ని సరిపడా వాడటం
 • రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేయటం
 • అధిక బరువును తగ్గించుకోవటం
 • మద్యాన్ని మానుకోవటం
 • పొగతాగే అలవాటుంటే దానిని మానుకోవటం. పొగతాగ టం మూలంగా ముందు ముందు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

  పొగతాగటాన్ని మానుకుని, తినే ఆహారంలో శాచ్చురేటెడ్‌ కొవ్వుని బాగా తగ్గించుకుంటే మీరు బిపిని తగ్గించుకోవటమే కాకుండా భవిష్యత్తులో పక్షవాతం, గుండెపోటు లాంటివి వచ్చే అవకాశాల్ని తగ్గించుకున్నవారవుతారు కూడా.

  ఉప్పు ఎందుకు తగ్గించాలి?
  ఆహారంలో మీరు తీసుకునే ఉప్పు పరిమాణం డైరెక్ట్‌గా మీ బిపి మీద ప్రభావాన్ని చూపుతుంది. ఉప్పును మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంతగా మీలో బిపి పెరిగిపోతుంది.ఇది ‘హైబిపి’ లేని మనుషూలకు కూడా అన్వయిస్తుంది.అందువల్ల ఒక్క ‘హైబిపి’ పేషెంట్లు మాత్రమే కాకుండా మామూలు ఆరోగ్యవంతులు కూడా ఉప్పును తక్కువగా తీసుకోవటం మంచిది.ఉప్పులో సోడియం ఉంటుంది. సోడియం శరీరంలో రక్తపరి మాణాన్ని పెంచుతుంది. దానివల్ల బిపి పెరుగుతుంది.ఆహారంలో ఉప్పును తక్కువ తీసుకోవటం అంటే శరీరంలోకి సోడియంని తక్కువ పంపటం. అందుకని ఉప్పును చాలా లిమిటెడ్‌గా మాత్రమే వాడాలి.

  సోడియం (ఉప్పు) అధికంగా ఉండే ఆహారాలు

 • టిన్నుల్లో వచ్చే ఆహారాలు
 • ఫాస్ట్‌ ఫుడ్స్‌
 • ఊరగాయలు, పచ్చళ్ళు
 • అప్పడాలు, వడియాలు
  ఇలాంటి వాటిని మానేయటం మంచిది.
  అంతేకాక మరికొన్ని మార్గదర్శకాలు
 • భోజనం చేసేటప్పుడు దేనిలోనూ అధనంగా ఉప్పును కలు పుకోకూడదు.
 • వంటలో కూడా తక్కువ ఉప్పును వేసుకోవాలి.
 • రుచికోసం ‘పొటాషియం సాల్ట్‌ సప్లిమెంట్స్‌’ ని వాడవచ్చు. అయితే అది కూడా డాక్టరును సంప్రదించాక మాత్రమే.
 • ఇవి కాకుండా గ్యాస్‌ ట్రబుల్‌కి వాడే యాంటాసిడ్‌ టాబ్లెట్‌ల లో సోడియం అధికంగా ఉంటుంది. హైబిపి పేషెంట్లు వీటి వాడకంలో జాగ్రత్తగా ఉండాలి.
  ఇతరత్రా అస్వస్థతల కోసం డాక్టురును కలిసినప్పుడు మీకు హైబిపి ఉన్నట్లుగా డాక్టరు కు ముందే చెప్పటం మంచిది.

  ఎక్సర్‌ సైజుల్ని చేయటం
  ఎక్సర్‌ సైజుల్ని చేయటం అంటే శరీరాన్ని ‘యాక్టివ్‌’గా ఉంచ టం. దీనిని మీరు నిత్యజీవితంలో ఒక భాగంగా ఎంత రెగ్యుల ర్‌గా అమలు జరిపితే అంతగా మీలోని బిపి అదుపులో ఉం టుంది.రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజుల్ని చేయటం మూలంగా ఈ కింది ప్రయోజనాలు వొనగూడుతాయి.

 • బరువు తగ్గుతారు
 • కండరలు బలపడతాయి
 • స్ట్రెస్‌ నుంచి రిలీఫ్‌ చెందుతారు
 • శీరరంలోని కొవ్వు కరిగిపోతుంది
  ఇవన్నీ కలగలిసి మీలోని ‘హైబిపి’ ని తగ్గించుతాయి.‘హైబిపి’ అంటూ లేకుండా బిపి నార్మల్‌గా ఉండే వ్యక్తుల విషయాన్ని పరిశీలించినా కూడా రోజూ ఎక్సర్‌సైజుల్ని చేసే వాళ్ళ్టంటే ఏ ఎక్సర్‌సైజులూ చేయకుండా కూర్చుని కాలం గడిపే వాళ్ళకు ముందు ముందు ‘హైబిపి’ రావ టానికి 20 నుంచి 50 శాతం ఎక్కువ అవకా శాలుంటాయి. ఒకవేళ మీకు ఇప్పటివరకూ ఎక్సర్‌సైజులు చేసే అలవాటు లేకున్నా కూడా విచారించాల్సిన పనిలేదు. ఇప్పటినుంచైనా ప్రారంభించవచ్చు.ఎక్సర్‌సైజులంటే జిమ్‌కి వెళ్ళటం, జాగింగ్‌ చేయటం, బరు వుల్ని ఎత్తటం, ఏరోబిక్స్‌ చేయటం, ఇవి మాత్రమే కాదు.

  నిత్య జీవితంలో మనం చేసుకునే సాధారణమైన పనుల్ని కూడా ఎక్సర్‌సైజుల కింద మల్చుకోవచ్చు .ఎక్సర్‌సైజులంటే శరీరాన్ని వీలైనంత యాక్టివ్‌గా ఉంచటం, ఇలాంటి ఎక్సర్‌సైజుల్ని కనీసం రోజుకు 30 నిముషాలు చొప్పు న వారంలో 5 రోజులపాటు చేస్తే చాలు.మీరు వేగంగా శ్వాసపీల్చుకునేట్లుగానూ, శరీరం వెచ్చగా అయేట్లుగానూ చేసే ఏ పనయినా ఎక్సర్‌సైజు కిందికే వస్తుంది.

  ఉదాహరణకు:

 • ఒకస్టాప్‌ ముందుగా బస్సు దిగి ఆఫీసుకుగాని, ఇంటికిగాని ఆ కాస్త దూరాన్నీ నడుచుకుంటూ వెళ్ళటం
 • గార్డెన్‌ ఉంటే గార్డెనింగ్‌ చేయటం
 • లిప్టు ఉన్నా కూడా మెట్ల మీదుగా పైకి వెళ్ళటం, కిందికి దిగటం
 • పిల్లలతో పరుగులు తీస్తూ పిల్లలలా ఆటలా డటం
 • సైకిలు తొక్కటం
 • స్కిప్పింగ్‌ చేయటం…

  ఇలాంటివన్నీ కూడా ఎక్సర్‌సైజుల కిందికే వస్తాయి.ఒక ముఖ్య విషయం ఏమిటంటే చేస్తున్న పనిని మీరు ఎంజా య్‌ చేస్తుండాలి. అందులో ఆనందాన్ని పొందుతుండాలి. అలాంటి యాక్టివిటీ అయితేనే రోజూ మీరు దానికి అంటిపెట్టు కుని ఉంటారు.జీవనశైలిలో మార్పుల్ని చేసుకోవటం వల్ల మందు లు సమర్థవంతంగా కూడా పని చేస్తాయి. దానివల్ల పేషెంటుకి మందుల్ని తక్కువ డోసులో వాడితే సరిపోవచ్చు. లేదా తక్కువ రకాల మందుల్ని వాడినా సరిపోతుంది. ఉప్పులో సోడియం ఉంటుంది. సోడియం శరీరంలో రక్తపరి మాణాన్ని పెంచుతుంది. దానివల్ల బిపి పెరుగుతుంది. ఆహారంలో ఉప్పును తక్కువ తీసుకోవటం అంటే శరీరంలోకి సోడియంని తక్కువ పంపటం. అందుకని ఉప్పును చాలా లిమిటెడ్‌గా మాత్రమే వాడాలి.

  – డాక్టర్‌ సి.ఎల్‌.వెంకట్రావు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top