You Are Here: Home » సినిమా » పాటలు » జీవనజ్యోతి (1975)- సిన్నీ ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ

జీవనజ్యోతి (1975)- సిన్నీ ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ

పల్లవి :
సిన్నీ ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ
సిన్నీ ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ
ఓ వన్నెగాజుల సిన్నీ
తుర్రుమని నువ్వెళ్ళిపోతే
తూరుపుదిక్కు ఆపేస్తుంది
ఉరిమురిమీ చూశావంటే
ఉత్తరదిక్కు ఊపేస్తుంది
జింజిరి జిమ్ జింజిరి జిమ్ (2)

చరణం : 1
కల్లబొల్లి మాటలతో అల్లరిపెడితే
నన్నల్లరిపెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను
నిన్ను కమ్మేస్తాను
గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే
రాదారి పడవల్లే తేలితేలి పోతాను

చరణం : 2
కొమ్మమీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకు అలకే అందం
గూటిలోని గోరింకకు
చాటుసరసం అందం (2)
ఈ గుంటూరు పిల్లగానికి
నాటుసరసం అందం

చరణం : 3
పూతరేకుల తియ్యదనం
నీ లేత సొగసులో ఉంది
పాలమీగడ కమ్మదనం
నీ పడుచుదనంలో ఉంది
కోడెగిత్తా పొగరంత
నీ కొంటె వయసులో ఉంది (2)
అందుకేనేమో… ఆ అందుకేనేమో

పున్నమి చంద్రునిలోనే ఈ సిన్నీ
వెన్నెలై విర బూస్తుంది ఈ సిన్నీ

చిత్రం : జీవనజ్యోతి (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top