జీరో బ్యాలన్సా?
ఫోన్ బ్యాలన్స్ సున్నాకి చేరుకున్నప్పటికి అత్యవ సర ఫోన్ కాల్స్ లేదా సందేశాలను పంపుకునేం దుకు ప్రముఖ టెలికం ఆపరేటర్లు కాల్ విత్ జీరో బ్యాలన్స్ పేరుతో సరికొత్త సర్వీసులను ప్రారంభిం చాయి. అత్యవసర సమయంలో ఈ సేవను ఉపయో గించుకుని సదరు సర్వీస్ ప్రొవైడర్‌కు ఓ ‘రిక్వస్ట్’ పంపి నట్లయితే కాల్ లేదా సందేశం పంపుకునేందుకు అవ కాశాన్ని కల్పిస్తారు. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్లు కాల్ విత్ జీరో బ్యాలన్స్ సేవలను ఇప్పటికే ప్రారంభించాయి. ఆయా నెట్వర్క్ యూజర్లు ఈ సేవలను ఏలా ఉపయోగించు కోవాలో ఓసారి చూద్దాం. ఎయిర్టెల్ యూజర్లయి తే… ఎయిర్టెల్ ఈ సర్వీస్‌కు ‘కాల్ మీ బ్యాక్’గా పేరు పెట్టింది.
ఈ సేవను పొందగోరే వారు తమ ప్రీపెయిడ్ మొబైల్ నుంచి 141కు కాల్చేసి తరువాత వచ్చే ఆప్ష న్ల ద్వారా కాల్ లేదా సందేశాన్ని పంపుకోవచ్చు. ఈ ‘కాల్ మీ బ్యాక్’ ఆఫర్లో భాగంగా నెలకు 5 సందే శాలను ఉచితంగా పంపుకోవచ్చు. ఇక వొడాఫోన్ యూజర్లయితే… వొడాఫోన్ తమ సర్కిళ్ల పరిధిలోని వినియోగదారుల కోసం ‘బ్యాలన్స్ ట్రాన్స్ఫర్’ పేరుతో సర్వీసు ప్రారంభించింది. ఈ సర్వీస్‌లో భాగంగా ఆప దలో ఉన్న మీ మిత్రుడి వొడాఫోన్ నెంబర్‌కు బ్యాల న్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీది కూడా వొడాఫోన్ నెట్వర్క్ అయి ఉండాలి. బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ప్రక్రియలో భాగంగా డోనార్ తన మొబైల్ నుంచి 131 పంపే నగదు సంఖ్య స్టార్ మంబైల్ నెం బర్ జత చేసి డయల్ చేయాల్సి ఉంటుంది.
ఐడియా యూజర్లయితే… ఐడియా ‘‘ఐడియా లైఫ్ లైన్’’ పేరు తో కాల్ విత్ జీరో బ్యాలన్స్ సర్వీస్‌ను అందిస్తుంది. ఈ సేవను ఉపయోగించుకునే వారు తమ ఐడియా మొబైల్ నుంచి 53367కు డయ లల్ చేసి రూ.3లు బ్యాలన్స్‌ను పొందవచ్చు. ఈ బ్యాలన్స్ తరువాతి టాపప్‌లో మినహాయిం చబడుతుంది. ఈ సర్వీస్‌ను వినియోగించుకునే యూజర్ ఐడియా నెట్‌వర్క్‌లోకి వచ్చి 90 రోజులు పైబడి ఉండాలి.