You Are Here: Home » ఇతర » జాబ్‌ చేస్తూనే.. హ్యాపీ డేస్‌

జాబ్‌ చేస్తూనే.. హ్యాపీ డేస్‌

అప్పుడే సోమవారం వచ్చేసింది. నమ్మలేకపోతున్నారా ? నిన్న ఎంత హ్యాపీగా సండేని సెలబ్రేట్‌ చేశాం.. మళ్లీ వారం రోజులు ఆఫీసు నాలుగు గోడలకు పరిమితమై పోవాలా అని చాలా మంది దిగులు పడుతుం టారు. దీనికి ప్రధాన కారణం సంతోషాన్ని ఆదివారమే సొంతం చేసుకోగలం అనే ఆలోచన. నిజానికి ప్రతి క్షణాన్ని, ప్రతి పనిని ఎంజాయ్‌ చేస్తే అదివారానికి- సోమవారానికి తేడా ఉండదు. ఈ వీకెండ్‌ను జాలీగా జాబ్‌చేస్తూ గడపడానికి కొన్ని టిప్స్‌. ఎంజాయ్‌..

  • సంతోషం సగం బలం అంటారు. ఈ కాలంలో అయితే సంతోషమే పూర్తి బలం. ఒక సారి హాయిగా నవ్వాక చాలా విషయాలు దానికవే సెట్‌ అవుతాయి. టెన్షన్‌తో ఫ్రెండ్‌షిప్‌ కట్‌ చేసి హ్యాప్పీనెస్‌తో స్నేహం కుదుర్చుకొండి. ఇది మీ లైఫ్‌. హ్యాప్పీగా ఉండాల్సిన అవసరం మీకుందనేది గమనించాలి.
  • ఏం చేస్తే హ్యాప్పీగా ఉంటారో తెలుసుకొండి. ముఖ్యంగా ఎలాంటి పసులు మీకు నచ్చుతాయో తెలుసుకొండి.
  • సంతోషాన్ని ఏరికోరి, వెదకి మరీ పట్టుకొండి. దొరకనప్పుడు వెదకడంలో తప్పేంలేదు.
  • హార్డ్‌వర్క్‌,స్మాట్‌ వర్క్‌కు మధ్య తేడా తెలుసుకొండి. స్మార్ట్‌ వర్క్‌ వల్ల చాలా పని కొంత సమయం లోనే అయిపోతుంది. సో స్మార్ట్‌ వర్క్‌ చేయడం ప్రారంభించండి.
  • మీకు సంతృప్తినిచ్చే పనులు చేయండి.సంతృిప్తి+సంతోషం= జీవితం.ఇది సరికొత్త ఫార్ములా
  • చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని ఆటలు ఆడే ఉంటారు కదా.ఆ సమయంలో ఎంత హ్యాప్పీగా ఉన్నారో గుర్తుకు తెచ్చుకొండి. వీలు చేసుకొని ఒక టీమ్‌ను తయారు చేసుకుని గేమ్స్‌ ఆడండి. చెమట రూపంలో టెన్షన్‌ వెళ్లిపోవచ్చేమో!
  • గెలుపు ఇచ్చే సంతోషం కోసం, కిక్‌ కావాలా.అయితే మీ శక్తుల ను గుర్తించి వాటన్నింటిని వినియో గించి కృషి చేయండి. పోరాడే క్షణాలేవి మనవి కావని అన్న బ్రూస్‌లీ మాటలు గుర్తుకు తెచ్చుకొండి.
  • మీ దగ్గర ఉన్న వాటితో సంతోపడండి. ఏదైనా లభించక పోతే లైట్‌ తీసుకొండి. హ్యాప్పీగా ఉండాలనుకుంటే ఇంకొకరితో పోల్చుకోవడం మానండి.
  • ఎవరి గురించి వారు తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్నట్టే. సో, మీ గురించి మీరు తెలుసుకు నేందుకు ప్రయత్నించండి. హ్యాప్పీగా ఉండండి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top