You Are Here: Home » సఖి » జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

స్థిరాస్తి కొనుగోలు సమయంలో పలు అంశాలను తప్పక పరిశీలించాలి. లేకపోతే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవ్వొచ్చు. అనవసర లిటిగేషన్స్‌ మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసే ప్రమాదం పొంచి వుందని మరవకండి. ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లను పరిశీలించాక గానీ తుది నిర్ణయం తీసుకోవద్దు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గుర్తించాలి. వ్యవసాయ భూములైనా… ఖాళీ స్థలాలైనా… నివసించడం కోసం ఇల్లు తీసుకుంటున్నా సరే… కొనే ముందు పలు అంశాలపై దృష్టి సారించాలి.

Untitaఏదేని ఒక ఆస్తిని కొనాలని నిర్ణయించుకున్నాక ఆ ఆస్తిరి అమ్మే వ్యక్తికి గల హక్కును తెలిపే దస్తావేజు, పహాణి, టైటిల్‌ డీల్‌, ఇతర లింక్‌ దస్తావేజులు తీసుకోవాలి. వీటితో పాటు కింద అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం మరవద్దు.మీరు కొనేది ఖాళీ స్థలమైతే మున్సిపల్‌ లేదా గ్రామ పంచా యతీ అధికారులు ఆమోదించిన లేఅవుట్‌ మ్యాప్‌ను తీసుకోవాలి. లింకు దస్తావేజులను సంవత్సరం, తేదీల వారీగా పరిశీలిస్తే ఆస్తి ఎవరెవరి చేతులు మారింది… మొట్టమొదటి పట్టాదారుడెవరు… ప్రస్తుతం ఆ ఆస్తి ఎవరి పేరిట ఉందో తెలుస్తుంది. సంబంధిత మున్సిపల్‌, గ్రామ పంచాయితీ లేదా తహశీల్దారు కార్యాలయంలో అమ్మకం దారుని పేరు మీదుగా ఆస్తి నమోదయ్యిందో లేదో చూసు కోవాలి.

కొన్ని విషయాలు దాచిపెడితే?
అమ్మకపుదారులు అన్ని విషయాలను వెల్లడించాడని నిర్ధారించుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలను దాచిపెట్టాడన్న అనుమానం వస్తే లోతుగా పరిశీలించుకోవాలి. మనకు ఆస్తి అమ్మే వ్యక్తి మనకంటే ముందు మరెవరికైనా ఒప్పందం రాయించి అడ్వాన్సు తీసుకున్నారా అనే విషయాన్ని తెలుసుకోటానికి ఆస్తి ఉన్న ప్రదేశంలో నివసించే వారిని సంప్రదిస్తే సరి పోతుంది. ఆస్తి విలువెైనది అయితే ప్రముఖ దినపత్రికల్లో మీరు కొంటున్నట్లుగా ప్రకటన ఇవ్వాలి. నమోదు కాని దసావేజుల ఆధారంగా అమ్మటానికి ప్రయత్నిస్తే ఎట్టి పరి స్థితుల్లో కొనకూడదు.

హద్దుల ప్రస్తావన కీలకం
దస్తావేజుల్లో హద్దుల ప్రస్తావన కీలకం. ఆస్తి ఉన్న ప్రదేశానికి వెళ్లి దస్తావేజుల్లోని హద్దులను స్వయంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి. ప్లాటు కానీ, వ్యవసాయ భూమి కానీ తీరుబడిగా, ప్రశాంతంగా తనిఖీ చేయిం చాలి. లింక్‌ దస్తావేజుతో హద్దుల్ని గుర్తించాలి. ఇరుగు పొరుగున ఎవరున్నారో వాకబు చేయాలి. ఆస్తి మీద దావా, తగాదాలు మరే ఇతర ఆక్షేపణలున్నా ఇట్టే తెలుస్తాయి. ఆస్తిని వ్యక్తిగతంగా, భౌతికంగా చూడకుండా తొందరపడి కొనుగోలు చేయరాదు.

అమ్మే వ్యక్తి హోదా…
అమ్మకందారు ఎవరు? ఎక్కడుంటాడు? ఏం పని చేస్తాడు? అతని శాశ్వత చిరునామా ఏమిటి? ముఖ్యంగా సమాజంలో అతని స్థానమేమిటి? ఆ మనిషి ఎలాంటివాడు? మెసగాడో… మంచివాడో వాకబు చేయాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి నేను ఫలానా… అని చెప్పినా.. దస్తావేజుల్లో రాసేటప్పుడు
ఫలానా వ్యక్తి కుమారుడు అని పేర్కొనాలి. చిరునామా సరి చూసుకోవాలి.

మనకు ఆస్తి అమ్మే వ్యక్తి మనకంటే ముందు మరెవరికైనా ఒప్పందం రాయించి అడ్వాన్సు తీసుకున్నారా అనే విష యాన్ని తెలుసుకోటానికి ఆస్తి ఉన్న ప్రదేశంలో నివసించే వారిని సంప్రదిస్తే సరిపోతుంది. ఆస్తి విలువెైనది అయితే ప్రముఖ దినపత్రికల్లో మీరు కొంటున్నట్లుగా ప్రకటన ఇవ్వాలి.

మీరు కొనేది ఖాళీ స్థలమైతే మున్సిపల్‌ లేదా గ్రామ పంచాయతీ అధికారులు ఆమోదించిన లేఅవుట్‌ మ్యాప్‌ను తీసుకోవాలి. లింకు దస్తావేజులను సంవత్సరం, తేదీల వారీగా పరిశీలిస్తే ఆస్తి ఎవరెవరి చేతులు మారింది… మొట్టమొదటి పట్టాదారుడెవరు… ప్రస్తుతం ఆ ఆస్తి ఎవరి పేరిట ఉందో తెలుస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top