You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » జాండీస్-నివారణ

జాండీస్-నివారణ

జాండీస్-నివారణ 
ఆయుర్వేదంలో జాండీస్  కామలా వ్యాధిగా వివరించారు. జ్వరం, వమన భ్రాంతితో ప్రారంభమైన లక్షణాలు, కళ్లు పసుపుపచ్చగా మారడం, మూత్రం పసుపురంగుగా అవటం, ఇంకా ముదిరితే శరీరంలోని చర్మమంతా ముదురు పసుపురంగులోనికి మారటం వరకు దారితీస్తుంది. ఒకరకమైన వైరస్… లివర్ (యకృత్/కాలేయం) కి సోకి, దాని ప్రకృత కృత్యాన్ని దెబ్బతీయడం వల్ల పైన చెప్పిన లక్షణాలు కలుగుతాయి.ఈ వైరసు మనం తీసుకునే తినుబండారాలు, పానీయాలు… ముఖ్యంగా బయట లభించే షరబత్తులు, శీతలపానీయాలు, చెరకురసం, ఐస్ కలిపిన పళ్లరసాలు మొద లైన వాటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి, వారంలోగా లక్షణాలు మెల్లగా ప్రారంభమై, తీవ్రంగా పరిణమిస్తాయి. లివర్ కూడా కొంచెం వ్యాకోచిస్తుంది. ఆకలి మందగిస్తుంది. శ్రుతిమించితే మెదడు దెబ్బతిని రోగి కోమాలోకి వెళ్లవచ్చు.

నివారణ: ఈ వ్యాధి వేసవికాలంలో తేలికగా సంక్రమిస్తుంది. కనుక ఇంట్లో తయారుచేసిన పదార్థాలే తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. కలుషితనీరు అనే అనుమానం ఉంటే నీళ్లను మరిగించి, చల్లార్చి తాగటం శ్రేయస్కరం.

చికిత్స: వ్యాధి సోకినవారు మసాలాలు, నూనెపదార్థాలు, జీర్ణక్రియకు ఇబ్బందిపెట్టే ఆహారం తినవద్దు. పెరుగు లేక మజ్జిగ కలిపిన అన్నం తినటం మంచిది. ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి. ఉదా… కొబ్బరినీళ్లు, గ్లూకోజ్‌నీళ్లు, బార్లీజావ, ఇంట్లో పరిశుభ్రంగా చేసిన పళ్లరసాలు మొదలైనవి. పొట్టపై ఒత్తిడి పడకుండా విశ్రాంతి తీసుకోవటం అవసరం. నాలుగైదు రోజులలో వైరస్ ప్రభావం తొలగిపోయినా వైరస్ వల్ల కలిగిన లక్షణాలు క్ర మక్రమంగా తగ్గుతాయి.

ఔషధాలు: నిరోసిల్ మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 తీసుకోవాలి
పునర్నవాది మండూర మాత్రలు: ఉదయం 1, రాత్రి 1
భృంగరాజాసవ (ద్రావకం): రెండు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి మూడు పూటలా తాగాలి.

ఈ వ్యాధిని తగ్గించగల ఆయుర్వేద ద్రవ్యాలు: భూమ్యామలకి, భృంగరాజ, నింబ, హరిన్మంజరి, గుడూచి… వీటిలో ఏదైనా ఒకదాని ఆకుల నుండి తీసిన రసాన్ని రెండు చెంచాలకు ఒక చెంచా ఉసిరికాయ రసం, ఒక చెంచా స్వచ్ఛమైన తేనె కలిపి ఉదయం, సాయంత్రం పరగడుపున పదిరోజులపాటు సేవిస్తే లివర్‌కి బలం కలగటమే కాకుండా, రక్తంలో అధికంగా ఉన్న బైలురుబిన్ మూత్రం ద్వారా బయటకుపోయి, శరీరానికి నీరసం తగ్గి బలం సమకూరుతుంది.

గమనిక: ఈ వ్యాధి చికిత్సార్థం కువైద్యులను సంప్రదించడం, కంట్లో చుక్కల మందులు వేయించుకోవటం ప్రమాదకరం. కనుక క్వాలిఫైడ్ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఉండటం అత్యవసరం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top