You Are Here: Home » ఇతర » జలసిరులు పారేనా?

జలసిరులు పారేనా?

లక్షల ఎకరాలకు నీటి అందించే వనరులు… కోట్ల మంది గొంతు తడప గల నీటి కుండలు.. లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేయగల ట్రాన్స్‌పార్మర్లు… అవే జల ప్రాజెక్టులు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నా ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. అరకొర నిధుల ేకటారుుంపులు, భూసేకరణ, పర్యావరణ లాంటి అవాంతరాలతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారరుుంది. ఊరూరా కాలువలు తవ్వారు.. నీళ్లు మాత్రం రావు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు ఆశలు నీళ్లపాలు అవుతున్నారుు. నేడు రాష్ట్ర బడ్జెట్‌ సమర్పించనున్న దృష్ట్యా కొన్ని నీటి ప్రాజెక్టులపై నేటి కలర్స్‌…


ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా నీరు ఎంతో అవసరం. తాగు, సాగు రంగాలకు నీరు సరిపడా ఉంటే ఆ ప్రాంతానికి ఆర్ధికంగా, ఉపాధి పరంగా ఇబ్బందులు ఉండవు. ఇది ఇప్పటిది కాదు.. అనాదిగా మన పూర్వీకులు ఇదే అనుసరించారు. అందుకే నీరు సమృద్ధిగా దొరికే ప్రాంతాల్లో లేదా నదీ పరివాహక ప్రాంతాల్లోనే చరిత్రకెక్కిన నగరాలు ఎన్నో వెలిశాయి. దివంగత ముఖ్యమంత్రి దీన్ని బాగా నమ్మారు. అందుకే ఎంత వ్యయం అయినా నీటి ప్రాజెక్టులను నిర్మించాలని సంకల్పించి జల యజ్ఞం చేపట్టారు. అనుకోని అవాంతరాల కారణంగా చాలా ప్రాజెక్టులు పెండింగ్‌ దశలోనే ఉన్నాయి.

పులిచింతల ప్రాజెక్టు
pulichintala-01కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మింప తలపెట్టిన వ్యవసాయ నీటి ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు. కృష్ణా జిల్లాలోని ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపు నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉన్నది. కృష్ణా డెల్టాను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఆనకట్ట 1964లో ప్రతిపాదించినా, దీని గురించి ఆలోచించింది 1984 తరువాతనే.

రూపకల్పన
నాగార్జున సాగర్‌, ప్రకాశం బారేజీకి మధ్య ఉన్న పరీవాహక ప్రాంతం నుంచి నదిలోకి వచ్చే నీటిని నిలవజేసేందుకు జలాశయం లేదు. ఈ ప్రాంతంలోనే మున్నేరు, మూసి, పాలేరు నదులు వచ్చి కృష్ణలో కలుస్తాయి. ప్రకాశం బారేజిలో నిల్వ సామర్ధ్యం లేకపోవడంతో, ఈ నీరు సముద్రంలోకి వదలక తప్పని పరిస్థితి ఉంది. ఈ నీరు 140 టి.ఎం.సి.లు ఉంటుందని అంచనా. ఇందు లో 60 టి.ఎం.సి.లు వాడుకోగలిగే వీలు ఉంది. ఈ నీటిని నిల్వ చేసుకునేలా ఒక ఆనకట్టను, జలాశయాన్ని నిర్మించగలిగితే, డెల్టా ఆయకట్టు స్థిరపడటమే కాక, శ్రీశైలం, సాగర్‌ల వద్ద నుండి మరిం త నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించగలిగే వీలు కలుగుతుందని భావించి పులిచింతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

సామర్థ్యం
Puli-(1)ఆనకట్ట కట్టినపుడు ఏర్పడే జలాశయ పూర్తి సామర్ధ్యం 53.34 టి.ఎం.సి.లు. ఇందులో – ఉపయోగపడని కనీస నిల్వ(డెడ్‌ స్టోరేజి) పోగా, 45.54 టి.ఎం.సి.ల నీరు వినియోగంలోకి వస్తుంది. జలాశయంలో 15 గ్రామాలు పూర్తిగాను, 8 గ్రామాలు పాక్షికంగాను మునిగిపోతాయి. మొత్తం 29,760 ఎకరాలు మునుగుతాయి. ఇందులో 9291 ఎకరాలు అడవి కాగా మిగతాది ప్రజల స్వంత ఆస్తులు.

ముంపు
నల్గొండ జిల్లా : నెమలిపురి, వెల్లటూరు, రేపల్లె, అడ్డూరు, చింట్యాల
గుంటూరు జిల్లా : పులిచింతల, కోళ్లూరు, చిట్యాల, కేతవరం, తాడుట్ల, గోవిందాపురం, వెల్లంపల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. బోదనం, గోపాలపురం, కామేపల్లి, వేమవరం, రేగులగడ్డ పాక్షికంగా మునిగిపోతాయి.1964లో శాసనసభ కమిటీ ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే 1988 వరకు అది చర్చలకే పరిమితమైంది. 1988 నవంబర్‌ 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. ఆనాటి అంచనా రూ.269 కోట్లు. శంకుస్థాపన అయినప్పటికీ, పని మొదలు కాలేదు. తిరిగి 2004 అక్టోబర్‌ 15న ముఖ్యమంత్రివై.ఎస్‌.రాజశేఖర రెడ్డి మరోసారి శంకుస్థాపన చేసాడు. అన్ని అనుమతులు లభించిన పులిచింతల ప్రాజెక్టును 2008లో కె.ఎల్‌.రావు సాగర్‌ ప్రాజెక్టుగా పేరు మార్చారు. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పోలవరం
POLAVAR1980 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎన్టీరామారావు సిఎం కాగానే పోలవరం నిర్మాణం జరిగి తీరుతుంది అని భావించినా ఫలితం కానరాలేదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు కూడా పోలవరం విషయంలో ఏమీ చేయలేకపోయారు. చివరకు ఈ ప్రాజెక్టును వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇందిరా సాగర్‌గా మార్పు చేశారు. ఇప్పుడైనా పూర్తవుతుందని భావించినా అదీ నిరాశే అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా దేవునిపట్నం మండలం పురుషోత్తమపట్నం సమీపంలోని అంగులూరు కొండ దగ్గర భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

సామర్ధ్యం
రూ. 8194 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు 2009 నుండి నీటిని విడుదల చేయాలి. అయినా పలు అడ్డంకుల కారణంగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే ప్రాంతం 9435 ఎకరాలుగా అంచనా వేశారు. డ్యామ్‌ ఎత్తు 45.72 మీటర్లుగా నిర్ణయించారు. 276 గ్రామాలు నీట మునుగుతాయి. ఈ ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల్లోని గిరిజనులను ఐటిడిఎ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భూముల్లోను స్థిర నివాసాలు ఏర్పాటు చేయనున్నారు.

లాభాలు
ఈ ప్రాజెక్టుతో కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 7 లక్షల 21 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీంతోపాటు 80 శతకోటి ఘనపుటడుగుల నీటిని కృష్ణా డెల్టాకు తరలించి ప్రకాశం బ్యారేజ్‌ ఆయకట్టును ఎండిపోకుండా స్థిరీకరణ చేయవచ్చు. నాలుగు జిల్లాలకు సంబంధించి దాదాపు 500 గ్రామాలకు తాగునీరు అందించవచ్చు. 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. కొన్నివేల గొట్టపుబావులను నీటిమట్టం స్థాయి పడిపోకుండా కాపాడవచ్చు. కట్టడాలకు కావాల్సిన నాణ్యమైన ఇసుకను సంపాదించుకోవచ్చు.

ముంపు
పోలవరం ప్రాజెక్టు వల్ల 3731.07 హెక్టార్ల అటవీభూములు ముంపునకు గురికానున్నాయి. 1,77 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులు కానున్నారు. దేశంలోనే ఇంత భారీ సంఖ్యలో ఒక ప్రాజెక్టు మూలంగా నిర్వాసితులు కావడం ఇదే తొలిసారి. పోలవరం రిజర్వాయర్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను +150 అడుగులుగా ప్రతిపాదించారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద ఎప్పుడూ ఉండే నీటి నిల్వ 75.20 టీఎంసీలుగా ప్రతిపాదించడంతో నీటి పరిమాణం 301.38 టీఎంసీలకి చేరుతుంది. దీంతో ఒడిషా రాష్ట్రంలో నీటిముంపు పెరగనుంది.

ప్రాణహిత- చేవెళ్ల
pranahitaతెలంగాణ జిల్లాల రెతులకు సాగునీరందించేందుకు ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని ప్రభుత్వం ఐదేళ్ల క్రితం చేపట్టింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 38,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తిపోతలకు 3,500 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. దీనికి అవసరమ య్యే విద్యుత్తును ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేసే ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. అప్పటి నుంచి అరకొరగా నిధుల కేటాయిస్తూ వస్తోంది. తెలంగాణలో ఇదే పెద్ద ప్రాజెక్టు. దివంగత నేత రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలకు తాగు, సాగు నీటిని అందించనున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని 2011 డిసెంబరు 5న శాసనమండలి
తీర్మానించింది.

రూపకల్పన
ఆదిలాబాద్‌ జిల్లా కౌతల మండలం, తుమ్మడి హెట్టి గ్రామ సమీపంలో ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి అక్కడ్నుం చి 160 టీఎంసీల నీటిని తరలించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. బ్యారేజీకి ఎగువన కుడి గుట్ట నుంచి తరలించిన నీటిని ఎల్లంపల్లి (శ్రీపాద సాగర్‌)కు మళ్లిస్తారు. అక్కడ్నుంచి కంపోజిట్‌ లింక్‌ ఛానెల్‌ ద్వారా వివిధ జిల్లాల్లోని ఆయకట్టు ప్రాంతాలకు నీటిని తీసుకుపోతారు. ప్రస్తుతం లభ్యంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులను ఉపయోగించుకునే విధంగా ఆయకట్టు ప్రాంతం ఆధారంగా లింకులు, ప్రెదర్‌ పైపులైన్లు, సొరంగాలు, గ్రావిటీ ఛానెళ్లు, తగిన కలెక్టింగు ట్యాంకులతో ప్రణాళి కను రూపొందించారు. మొత్తం ప్రాణహిత-చే పథకానికి సంబంధించిన 19 వివిధ పంపు హౌజులను 3,300 మెగావాట్ల విద్యుత్తును ఉపయోగించుకుంచుకోవాలి.

లాభాలు
తెలంగాణలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్‌ ప్రజలకు తాగునీరందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. హైదరాబాద్‌ మంచినీటికి 30 టిఎంసిలు, గ్రామాల మంచినీటికి 10 టిఎంసిలు, 16 టిఎంసిల నీరు పరిశ్రమలకు కేటాయించనున్నారు. తెలంగాణలోని సాగునీటికి 120 టిఎంసిలు కేటాయించారు.

2009లో ప్రారంభం
polavaramపథకం పనుల నిర్వహణ కోసం జిల్లాలో ఎంత భూమి ఎక్కడెక్కడ అవసరమవుతుందో అధికారులు సర్వే చేశారు. కానీ, భూసేకరణకు సంబంధించి ఉత్తర్వులు, నిధులు విడుదల కాలేదు. చిన్నకోడూరు మండలం చెలు కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లాయిపల్లి శివార్లలో పెద్దగండి చెరువు సమీపంలోని ప్రభుత్వ భూమి లో నాలుగున్నరేళ్ల క్రితం ప్రాణహిత-చేవెళ్ల పనులు ప్రారంభించారు. జాతీయ హోదా లభించకపోవడం, అర కొర నిధుల కేటాయింపుతో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. మొదట 2013 నాటికి పూర్తి చేయాలని భావించినా పలు అవాంతరాల కారణంగా 2018-19 నాటికి పూర్తి చేయా లని నిర్ణయించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను 29 ప్యాకేజీలుగా విభజించారు. ఆదిలాబాద్‌, నిజామా బాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు సాగు, తాగునీరు అం దేలా 15 ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజీలు 2014-15ల వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు.ఇవే కాక మరికొన్ని ప్రాజెక్టులు కూడా నత్తనడకన సాగు తున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే రైతులకు, ప్రజలకు తాగు, సాగు నీరందే అవకాశం ఉంది.

ప్రాజెక్టులవారీగా బడ్జెట్‌లో కేటాయింపులు

ప్రాజెక్టు పేరు 	   2011-12	  వ్యయం	    2012-13
ప్రాణహిత-చేవెళ్ల 608 0 1050
పోలవరం 1290 - 1121
దుమ్ముగూడెం-సాగర్‌ 200 - 40
పులిచింతల 75 129 164
గాలేరు-నగరి 450 225 450
తెలుగుగంగ 180 118 155
వెలిగొండ 545 375 599
హంద్రీ-నీవా 500 240 698
ఎమ్మార్పీ 450 145 451
ఎల్లంపల్లి 420 302 360
రాజీవ్‌బీమా 434 63 174
కల్వకుర్తి 330 132 220
దేవాదుల 137 139 91
ఎస్సారెస్పీ-2 250 15 75
నెట్టెంపాడు 283 60 144
సోమశిల 140 58 208

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top