You Are Here: Home » సినిమా » పాటలు » జయుం (2002)- ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

జయుం (2002)- ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

పల్లవి :
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగ దు
ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజూ ఈడదు
ఈ ప్రేమ
కులమూ మతమూ లేవంటుంది
మనసుకి ప్రేమ
నింగీ నేలా ఉన్నన్నాళ్లు
ఉంటుందీ ప్రేమ

చరణం : 1
కాలమొస్తే సిరిమల్లెతీగకి
చిగురే పుడుతుంది
ఈడువస్తే ఈ పడుచు గుండెలో
ప్రేమే పుడుతుంది
గొడుగు అడ్డు పెట్టినంతనే
వానజల్లు ఆగిపోవునా
గులక రాయి వేసినంతనే
వరదజోరు ఆగిపోవునా
ఏడులోకాలు ఏకం ఐనా
ప్రేమను ఆపేనా

చరణం : 2
ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన
చక్కని వరమంటా
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ
అలుపేరాదంటా
కండలెంత పెంచుకొచ్చినా
కొండనెత్తి దించలేరుగా
కక్షతోటి కాలు దువ్వినా
ప్రేమనెవ్వరాపలేరుగా
ప్రేమకెపుడైనా జయమేగాని
ఓటమి లేదంటా
శాశ్వతమీప్రేమ…

చిత్రం : జయుం (2002)
రచన : కులశేఖర్
సంగీతం : ఆర్.పి.పట్నాయుక్
గానం : ఆర్.పి.పట్నాయుక్ , ఉష

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top