You Are Here: Home » సినిమా » పాటలు » జయం మనదేరా! (2000)- మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే

జయం మనదేరా! (2000)- మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే

పల్లవి :
మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్
నను లవ్‌లో దించేశావ్
మనసైనవాడివి నవ్వే
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్
నను మైమరిపించేశావ్
ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకొమ్మంది

చరణం : 1
అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా
జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా తుంటరి ఈడును ఈవేళ
ఓదార్చనా ప్రియురాలా
నా ఆశలన్నీ నీకోసమంటూ నీ దారి చూడనీ
నా శ్వాసలోని రాగాలు అన్నీ నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ
॥మై॥

చరణం : 2
కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం
స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం
సరదాగా తిరిగొద్దాం
నీ వాలు కనులు నాపైన వాలి
నను మేలుకొలపనీ
నీ వేలికొనన నా మేను తాకి వీణల్లే మీటనీ
వయసు వాకిళ్లలో తొలివలపు వెలిగించనీ
॥మై॥॥

చిత్రం : జయం మనదేరా! (2000)
రచన : సిరివెన్నెల
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : కుమార్‌సాను, స్వర్ణలత

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top