You Are Here: Home » ఇతర » జన్యు రహస్యం

జన్యు రహస్యం

ఆనువంశికత, వైవిధ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని జన్యుశాస్త్రం అంటారు. జీవశాస్ర్ర్తానికి చెందిన ఈ శాఖలో అణువులు, కణాలు, జీవులు, జనాభాలను గురించిన పరిజ్ఞానం, వివిధ ప్రయోగ విధానాలను అధ్యయనం చేస్తారు. జీవ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి జన్యుశాస్త్ర పరిజ్ఞానం ప్రముఖ పాత్ర వహిస్తుంది. జన్యువుల వ్యక్తీకరణ జీవుల విధులను వివిధ స్థారుులలో ప్రభావితం చేస్తుంది. జన్యు శాస్త్రంలో అధ్యయనం చేసే విషయాలు వివిధ జీవశాస్త్ర విభాగాలను ఏకీకృతం చేసి జీవశాస్ర్తానికి మూలంగా ఉంటారుు. జన్యు శాస్ర్తాన్ని వ్యవసాయశాస్త్రం, వైద్యశాస్ర్తాలలో ప్రత్యక్షంగా అనువర్తించడం జరుగుతుంది.

పునఃసంయోజన డిఎన్‌ఎ సాంేకతిక శాస్ర్తాన్ని ఉపయోగించి లోపం గల జన్యువులను రీ ప్లేస్‌ చేయడం ద్వారా మానవాళి అభివృద్ధి కోసం జన్యుశాస్ర్తాన్ని అనువర్తించడాన్ని జన్యు చికిత్స అంటారు.జన్యుశాస్త్రం అనే పదాన్ని బేట్‌సన్‌ ప్రతిపాదించాడు. యూజెనిక్స్‌ అనే పదాన్ని 1880లో ఫ్రాన్సిస్‌ గాల్టన్‌ ప్రతిపాదించాడు. జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవాళి శ్రేయస్సు కోసం అనువర్తించడాన్ని యూజెనిక్స్‌ అంటారు. జన్యుపరమైన అవలక్షణాలకు రోగలక్షణాధారిత చికిత్సను యూఫెనిక్స్‌ అంటారు. జీవులలో లక్షణాల ఆనువంశికతను అనేక వేల సంవత్సరాల నుంచి మానవుడు గమనిస్తున్నప్పటికీ మెుదటిసారిగా ఫలితాలను పొందిన శాస్తజ్ఞ్రుడు గ్రెగర్‌ జోహాన్‌మెండల్‌.

డిఎన్‌ఎ అంటే?
09Colడీ ఆక్సీలెైబో న్యూక్లెక్‌ యాసిడ్‌. డిఎన్‌ఎ కంటి రంగు, జుట్టు రంగు, ఆకారం, ఎము క సాంద్రత మరియు అనేక ఇతర మానవ, జంతు లక్ష ణాలు యొక్క వారసత్వం నియంత్రించే పదార్థం. డిఎన్‌ఎ పొడవుగా ఉంటుంది. డిఎన్‌ఎ పరీక్ష నేటి సమా జంలో చాలా ముఖ్యమైనదిగా మారింది. మీ కుటుంబం ఎక్కడ ప్రారంభమైనది, మీ తల్లిదండ్రులు, తాతా, మామల, తోబుట్టువులు, బంధువులు ఎవరూ అన్నది ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిఎన్‌ఎ పరీక్ష జరిగితే ఎటు వంటి అనుమానాలు లేకుండా వారు ఎవరు అన్నది తేలి పోతుంది. ఆనువంశిక లక్షణాలను నియంత్రించే ప్రమా ణ కారకాలు జీవులలో జతలుగా ఉండాయి. ఇవి జత లుగా ఉండటం వల్ల మూడు రకాల జన్యురూపాలు సాధనపడతాయి. ఈ కారకాలు ఆనువంశికతకు ప్రాథ మిక ప్రమాణాలుగా ఉండి ఒకతరం నుంచి వేరొక తరా నికి ప్రసరిస్తాయి. ఏ జీవిలోనెైనా మొత్తం క్రోమోజోమ్‌ ల సంఖ్య కంటే… జన్యువుల సంఖ్య ఎక్కువగా ఉంటుం ది. కాబట్టి ప్రతి క్రోమోజోమ్‌పెై అనేక జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులన్నీ స్వతంత్ర వ్యూహన చెం దవు. ఎందువల్లనంటే స్వతంత్ర వ్యూహనకు ప్రాతి పదిక క్షయకరణ విభజనలో వేర్వేరు సమజాతి క్రోమో జోమ్‌ల జతలు స్వతంత్రంగా అలీనత చెందడం. ఇక రక్త సముదాయాలు ఆనువంశికతకు ఒక జన్యువు కార ణమని 1924లో బర్న్‌స్టీన్‌ కనుగొన్నాడు.

డిఎన్‌ఎ ఎలా?
డిఎన్‌ఏ పరీక్ష మానవ సంబంధాల గుర్తింపు కోసం ఉప యోగిస్తారు. వారి సంబంధాన్ని పరీక్ష సమయంలో డిఎన్‌ఏ రిపోర్టు నుండి విశ్లేషిస్తారు. మొదటి ఈ ఆచరణాత్మక పరీక్ష వ్యవస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది లెస్టర్‌ విశ్వవిద్యాల యం ప్రొఫెసర్‌ ఆలెక్‌ జఫీస్‌. 1984లో ఈ పరీక్ష నిర్వహణ, నిర్థారణలపెై పూర్తి స్థాయిలో రుజువు చేశాడు. డిఎన్‌ఏను వేలిముద్రలు ద్వారా గుర్తించవచ్చు. వివిధ ఉచ్చులు మరియు గుచ్ఛాలుగా రెండు వేలిముద్రలు మధ్య పోలిస్తే అవి అందరివీ ఒక్కటిగా ఉండవు. కానీ, డిఎన్‌ఏ పరీక్ష రెండు వ్యక్తుల మధ్య డిఎన్‌ఏ గుర్తులుగా ఉంటాయి. దీనికి కొన్ని డిఎన్‌ఎ లక్షణాలు పోల్చడంతో సమాచారం వచ్చే అవకాశం ఉంది. డిఎన్‌ఏ నమూనాలు సమానంగా ఉం టాయి. అప్పుడు వారు అదే వ్యక్తికి సంబంధించిన వారి గా గుర్తిస్తారు. డిఎన్‌ఎ పరీక్షకు నమూనాలు చాలా సంబంధిత వ్యక్తుల నుండి వస్తాయి. దీనిపెై ఇద్దరి మధ్య సంబంధాన్ని లెక్కగడతారు.

తొలి మానవ జెనోమ్‌ డీకోడింగ్‌
మానవుల్లో జన్యుపరమైన మార్పులు మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటాయని మొట్టమొదటి మానవ జెనోమ్‌ విశ్లేషణ తెలిపింది. ప్రముఖ శాస్త్రవేత్త క్రెగ్‌ వెంటర్‌ సంపూర్ణ డిఎన్‌ఎ బ్లూప్రింట్‌ రూపొందిం చారు. మానవ డిఎన్‌ఎ మార్పులు మనం ఇంతకు ముందు భావించిన దానికంటే ఎక్కువగానే ఉంటాయని జెనోమ్‌ పరిశోధనల్లో వెల్లడెైంది. డిఎన్‌ఎలో ప్రధాన పాత్ర పోషించే న్యూక్లియోటైడ్‌ జీనోమ్‌ సీక్వె న్సీలో మార్పు చేయడం వల్ల సింగిల్‌ న్యూక్లి యోటైడ్‌ పాలీమార్ఫిజమ్స్‌ ఉత్పన్నమవుతాయి. విభిన్న వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, ఆకారాల్లో మార్పులు, వ్యాధులు సంక్రమించే అవకాశాల్లో మార్పులకు ఎస్‌ఎన్‌పిఎస్‌ కీలకమని ఇంతకు ముందు శాస్త్రవేత్తలు భావించేవారు. మానవులందరూ జన్యుపరంగా 99.9 శాతం ఒకే రకంగా ఉంటారనే శాస్త్రవేత్తలు ఇంతకు ముందు భావించేవారు. అయితే ఈ విషయాలు నిజం కాదని జెనోమ్‌ పరిశోధనల్లో వెల్లడెైంది.

సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో…
ప్రస్తుతం డిఎన్‌ఏ పరీక్ష ఫలితాల ఆధారంగా దర్యాప్తును కేసుల్లో ఉపయోగిస్తున్నారు. డిఎన్‌ఏ పరీక్ష ప్రధానంగా క్రిమినల్‌ కేసుల కోసం పరీక్షలు జరుపు తారు. ఇందులో ఎక్కువగా వ్యక్తుల మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు ఉపయోగిస్తారు. కానీ క్రిమినల్‌ చట్టపరమైన డిఎన్‌ఏ పరీక్ష ఇమ్మిగ్రేషన్‌ మరియు పిల్లల ఎవరికి చెందిన వారు అనే విషయాల్లోనే ఉపయోగిస్తు న్నారు. దీనికి సంబంధించి 2004లో బ్రిటన్‌లో ఏడు వేల మందికి పరీక్షలు జరిపారు. అన్నీ విజయవంతం అయ్యాయి. ఆ దేశ చట్టాలు, అక్కడ జంటలు ఎక్కువ కలిసి ఉండరు. వారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు, భార్య, భర్తలు తమ, తమ పిల్లల విషయంలో తేడాలు రావటం జరిగింది. దీంతో ఆ దేశ పౌరులకు డిఎన్‌ఏ పరీక్షలు జరిపి వారు ఎవరి వారో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు అక్కడి కోర్టులకు అందచేశారు. సివిల్‌, క్రిమినల్‌ న్యాయ వ్యవస్థలో డిఎన్‌ఎ ఒక శక్తిమంతమైన సాధనంగా ఉద్భవించింది.

డిఎన్‌ఎ పరీక్ష ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది… అలాగే వారి సంబంధాల స్వభావం నిర్ణయించడానికి ఈ పరీక్ష జరుపుతారు. వారి లింగ మరియు జాతి నేపథ్యం గురించి సమాచారాన్ని పొందడానికి, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ వ్యక్తుల వయస్సు గుర్తించేందుకు ఈ పరీక్షలు చేస్తున్నారు. అలాగే మనుషూల వెంట్రుకల ద్వారా వారు ఎవరూ అనేది గుర్తించే అవకాశమూ ఉంది. డిఎన్‌ఏ టెస్ట్‌ రాక ముందు, మానవ గుర్తింపు పరీక్ష ఎక్కువగా రక్త టైపింగ్‌ ద్వారా జరిపేవారు. ఆ తరువాత డిఎన్‌ఎ పరీక్షలు విశ్లేషణలో ఇప్పుడు రక్త పరీక్షలతో ఎవరు…ఎవరికి చెందినవారో గుర్తిస్తున్నారు. ఇది కచ్చితమైన పద్ధతిగా రుజువెైంది. ఎవరు.. వారి బంధుత్వాల గుర్తింపు కోసం ప్రస్తుతం అమలు జరుగుతున్నది. ఇది అందరికీ అందుబాటులో ఉన్న కచ్చితమైన ప‚ద్ధతి.

ఇంటివద్డే డిఎన్‌ఎ టెస్ట్‌
dna-kitఇప్పుడు డిఎన్‌ఏ ఫోరెన్సిక్‌ పరీక్షలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా లాబరేటరీలు ఏర్పాటు చేశారు. కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఈ డిఎన్‌ఎ పరీక్షలు జరుపుతుంటే… కొన్ని సందర్భాల్లో ఆయా వ్యక్తులు బయటి లాబరేటరీల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ ప్రెైవేటు ల్యాబ్స్‌ ఇంటికి వచ్చి తమ సేవలు అందిస్తున్నారు. ఇంటిలోనే పితృత్వ పరీక్షకు సంబంధించిన టెస్ట్‌ కిట్‌ ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇవి నాలుగు రకాలుగా ఉన్నాయి. పితృత్వ టెస్ట్‌, జన్యు సిద్ధత టెస్ట్‌, డిఎన్‌ఏ ప్రొఫెైలింగ్‌ టెస్‌‌‌‌ట, పూర్వీకుల ఆరిజిన్స్‌ టెస్ట్‌లు ఉన్నాయి.

తివారీకేసు
ND-TwavariFఈ మధ్య కాలంలో డిఎన్‌ఎ టెస్ట్‌ ద్వారా అందరూ ఆసక్తిగా గమనించిన కేసు ఎన్డీ తివారీది. ఉజ్వల శర్మతో మన రాష్ర్ట మాజీ గవర్నర్‌ నారాయణదత్‌ తివారీ నడిపిన వ్యవహారంతో రోహిత్‌ శేఖర్‌ జన్మించినట్లు డిఎన్‌ఏ నివేదిక బయటపెట్టింది. డిఎన్‌ఏ పరీక్షల నివేదిక ఢిల్లీ హైకోర్టు బయటపెట్టింది.సుదీర్ఘ న్యాయపోరాటం ద్వారా రోహిత్‌ తల్లి ఉజ్వల శర్మ విజయం సాధించారు. తివారీ ఉజ్వల శర్మతో నడిపిన రాసలీలల కారణంగానే రోహిత్‌ శేఖర్‌ పుట్టాడని, రోహిత్‌ శేఖర్‌ బయోలాజికల్‌ ఫాదర్‌ తివారీయేనని డిఎన్‌ఏ నివేదిక తేల్చింది. తన బయోలాజికల్‌ ఫాదర్‌గా తివారీని ప్రకటించాలని కోరుతూ రోహిత్‌ శేఖర్‌ గత ఐదేళ్ళుపోరాటం చేశారు. చివరకు విజయం సాధించారు. దీంతో 87 ఏళ్ల తివారీ కష్టాల్లో పడ్డారు. ఈ కేసును 2008లో రోహిత్‌ శేఖర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తివారీ, రోహిత్‌, అతని తల్లి ఉజ్వల శర్మ డిఎన్‌ఏ పరీక్షలు నివేదికను హైదరాబాద్‌లోని డిఎన్‌ఎ ఫింగర్‌ప్రింట్స్‌ డయాగ్నస్టిక్స్‌ కేంద్రం రిపోర్టు ఇచ్చింది. తివారీ, రోహిత్‌ శేఖర్‌ డిఎన్‌ఏలు ఒక్కటిగా ఉన్నాయని, అందువల్ల రోహిత్‌ తండ్రి తివారీయేనని కోర్టు తీర్పునిచ్చింది.

డిఎన్‌ఎ పరీక్షతో ఇంటిపేరు తెలుసుకోవచ్చు
ఇంటిపేరు కనుక్కోవడానికి బ్రిటన్‌లో డిఎన్‌ఎ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. లీసెస్టెర్‌ వర్శిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఒకే ఇంటి పేరు ఉన్న వారి పూర్వీకులు ఒకరే అయి ఉండటానికి 24 శాతం మేర అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఈ ఇంటిపేరు చాలా అరుదెైనదెైతే ఈ అవకాశం 50 శాతం వరకూ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇంటిపేర్లు తండ్రి నుంచి కొడుక్కి వారసత్వంగా వెళతాయి. డీఎన్‌ఎలోని భాగమైన వెై క్రోమోజోము (మగవారిలో ఉంటుంది) కూడా ఇంటి పేరు తరహలో తండ్రి నుంచి కొడుక్కి వస్తుంది. అందువల్ల వెై క్రోమోజోమ్‌ రకానికి ఇంటి పేరుకు సంబంధం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top