You Are Here: Home » ఇతర » జనుల ఆనందహేల

జనుల ఆనందహేల

16గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రయాగ క్షేత్రంలోని కుంభమేళా సంబరాలు అంబరాలనందుకుంటున్నాయి. నిత్యం ఈ గంగా తీరం జన సముద్రంతో హోరెత్తుతోంది. నదీ స్నానమే ఒక పవిత్ర కోరికగా అనేక ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నాగ సాధువులు, మఠ పీఠాధిపతులు, గురువులు, సాధుపుంగవుల సమ్మేళ నంతో ఈ క్షేత్రం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అన్ని దైవ కార్యక్రమాలతో పాటు పితృతర్పణాలు కూడా చేసి ప్రతి ఒక్కరు తమ జన్మకి సార్ధకతని చేకూర్చుకుంటున్నారు. యాంత్రిక జీవితానికి భిన్నంగా ఆధ్యాత్మిక జీవనంలో తడిసి ముద్దవుతున్నారు. ఆ విశేషాలు ఈ చిత్రమాలికలో..

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top