You Are Here: Home » ఇతర » చైనా బొమ్మలు తెచ్చే చేటు

చైనా బొమ్మలు తెచ్చే చేటు

వెనకటి రోజుల్లో మట్టి, కొయ్య బొమ్మలు ఉండేవి. పిల్లలు ఆడుకోవడానికి. మహా అయితే రబ్బరు బంతులు అంతే. మరి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆకర్షణీయమైన రంగుల్లో మనకు చైనా బొమ్మలు దర్శనమిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఇవి తిరణాళ్లలో కూడా కనబడుతున్నాయి. మార్కెట్లో చౌకగా దొరుకుతున్నాయి కదా అని తల్లిదండ్రులు తమ పిల్లలకు అందంగా, ఆకర్షణీయంగా ఉన్న చైనా బొమ్మలను కానుకగా ఇస్తుంటారు. ఏ వస్తువైనా సరే 35 రూపాయల నుంచి 150 రూపాయల లోపే ఉండటంతో వీటిపట్ల తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు . పిల్లలు కూడా పాత తరం కొయ్యబొమ్మలు, మట్టి బొమ్మలను పక్కకుపెట్టి కంటికి ఇంపుగా కనిపించే చైనా వస్తువులమీదే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. వీటిని అంత తేలికగా తీసుకోకూడదు. చైనా వస్తువుల వాడకం వెనక అనేక దుష్ర్పభావం చూపే అంశాలు ఉన్నాయని.. .అవి పిల్లల్ని దృష్టి లోపాలకు, చర్మ, జీర్ణ సంబంధ వ్యాధులకు గురిచేస్తాయని వైద్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Kidsపాకడం, నడవడం వచ్చినప్పటి నుంచి పిల్లల సంరక్షణ మరింత ఎక్కువగా తల్లులు గమనిస్తుండాలి .ఆ వయసులో సరిగ్గా నోటిలో దంతాలు వచ్చే సమయంలో పిల్లల నోటికి దురద ఎక్కువగా ఉంటుంది. దాంతో ఏ వస్తువును పడితే ఆ వస్తువును నోట్లో పెట్టేసుకుంటుంటారు. వాళ్ల చేతికి ఇలాంటి చైనా వస్తువులను ఇచ్చి ఏదో ఆడుకుంటున్నాడులే అని కొందరు తల్లులు గమనించరు. చిన్నారులు ఆ బొమ్మలను పంటితో కొరుకుతుంటారు. అలా కొరకగా కొరకగా ఆ బొమ్మలకు వేసిన నాసిరకం రంగులు, అందులో ఉండే రసాయనాలు పిల్ల ల నోటిలోకి చేరి తిన్నగా కడుపులో వెళ్లిపోతాయి. దీంతో చిన్నారులకు కడుపునొప్పి, అజీర్తి లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని మరింత అశ్రద్ధ చేస్తే అల్సర్లు, క్యా న్సర్లు కూడా వస్తాయని అంటున్నారు.

చేటు తెచ్చే రసాయనాలు: చైనా బొమ్మలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నా యి. చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో చిన్నారులు ఖరీదు తక్కువైనా అవే కావాలని పట్టుపడుతుంటారు. వారికి ఎంత నచ్చచెప్పినా వి నరు. పైగా ఆ బొమ్మలను ఏడ్చి కొనిపించడంతో ఏదో విజయం సాధించామన్నట్లు భావిస్తుంటారు. అసలు ఈ బొమ్మల తయారీలో వాడే రసాయనాలు, వాటి దుష్ర్పభావాలు తెలుసుకుంటే ఎవరూ చైనా బొమ్మల జోలికి పిల్లలను వెళ్లనివ్వరు.
లెడ్‌:ముఖ్యంగా చైనా బొమ్మలలో వాడే అత్యంత ప్రమాదకారి అయిన లెడ్‌ రసాయనం. ఇది పిల్లల మెదళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చిన్నారు ల నాడీమండలం అత్యంత సున్నితంగా ఉంటుంది. లెడ్‌ నాడీమండలంపై అత్యంత చురుకుగా పనిచేస్తుంది. నరాల వ్యవస్థ దెబ్బతిం టుంది. దీంతో పిల్లలకు భవిష్యత్తులో చదువుకోవాలనే ధ్యాస ఉండదు. ఏ పని మీదా నిలకడ ఉండదు. చిన్న వయసులోనే మతిమరుపు సంభవించి బుద్దిమాం ద్యులుగా తయారవుతారని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
కైడమియం : మరో రకం రసాయనం కైడమియం. ఇది కూడా అత్యంత ప్రమాదకారి అయిన రసాయనమే. ముఖ్యంగా పిల్లల కిడ్నీలపై వీటి ప్రభావం చూపిస్తుంది. కిడ్నీలు రెండింటిపైనా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
క్రోమియం : ఈ రసాయనం ప్రభావం వలన చిన్నారుల శరీరంలో త్వరగా క్యాన్సర్‌ సోకే అవకాశం ఉంది. కడుపునొప్పి, అధిక రక్తపోటు, తలతిరగడం, తలవాపు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top