You Are Here: Home » చిన్నారి » చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

చెవి మన శరీరంలో ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసినదే. చెవి నిర్మాణం, దానికి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. చెవి నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది. అవి… వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మన శరీరంలో బయటకు కనిపించే భాగం వెలుపలి చెవి.

సాధారణంగా దీనినే మనం చెవిగా పిలుస్తుంటాం. ఇది కార్టిలేజ్ అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. మధ్య చెవి భాగంలో మూడు ఎముకలు ఉంటాయి. వాటిలో స్టెపిస్ అనే ఎముక మన శరీరంలోనే అతి చిన్న ఎముక. మనం వినే శబ్దాలను గ్రహించేది లోపలి చెవిలో ఉండే కాక్లియా అనే భాగం. సాధారణంగా మనం వినే శబ్దం వెలుపల చెవి నుంచి మధ్య చెవి ద్వారా లోపలి చెవికి చేరుతుంది. పెద్ద పెద్ద శబ్దాలు వింటే చెవులు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top