You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » చిరస్మరణియుడు కొమర్రాజు

చిరస్మరణియుడు కొమర్రాజు

ప్రొఫెైల్‌

జననం 	: మే 18, 1877
జన్మస్థలం : పెనుగంచిప్రోలు, కృష్ణాజిల్లా
మరణం : జూలెై 14, 1923
ప్రాముఖ్యత : చారిత్రిక పరిశోధకుడు,
తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త,
సాహితీవేత్త
వృత్తి : దివాన్‌, రచయిత
భార్య : కోటమాంబ
సంతానం : వినాయకరావు
తండ్రి : వెంకటప్పయ్య
తల్లి : గంగమ్మ

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగువారికి చరిత్ర పరిశోధ నలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. ఎందరో సాహితీ మూర్తు లకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగు జాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. తెలంగాణపెై అభిమానంలక్ష్మణరావు ప్రాథమిక విద్య తెలంగాణాలో అభ్యసిం చారు. తరువాత మహారాష్ట్ర ప్రాంతంలో చదివారు. తెలంగాణా పట్ల లక్ష్మణరావుకు ప్రత్యేక అభిమానం ఉండేదని అంటారు. ఆయన హైదరాబాదులో ప్రారం భించిన సంస్థలవలన ఆధునిక తెలుగు భాష వికాసా నికి తెలంగాణా ప్రాతంలో పునాదులు పడ్డాయి. పోతన నివాసస్థలం అయిన ఏకశిలానగరం, కడప జిల్లాలోని ఒంటిమిట్ట కాదని, వరంగల్‌ అని సహేతుకంగా నిరూ పించారు.

త్రిలింగాలలో ద్రాక్షారామం, శ్రీశెైలంలతో బాటు మూడవది శ్రీకాళహస్తి కాదని, మంథని దగ్గర ఉన్న కాళేశ్వరమని మొదటిసారి చెప్పినది ఈయనే. 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1906 లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖపాత్ర వహించారు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు. ఈ శ్రమలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. 1923 జూలెై 12 న, 46 యేళ్ళ వయసు లోనే కొమర్రాజు లక్ష్మణరావు కాలం చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు మరణించిన ఇంటిలో, అదే గదిలో లక్ష్మణ రావు కూడా మరణించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top