You Are Here: Home » చిన్నారి » కవితలు » చినుకులో కూడా సంగీతం ఉంది

చినుకులో కూడా సంగీతం ఉంది

చినుకు ఓ దృశ్య కావ్యం
ఆ దీప కాంతికి
తడిసిన ఆ వేపాకు
కాంతిమంతమయ్యింది
చినుకు బడినప్పుడు
ఆకు ఆకు స్నానాలు
తలారా చేసినట్లు అనిపిస్తోంది
గుబురుగా ఉన్న పచ్చని చెట్లకు
సూర్యుడొచ్చీ కొలది

చిన్న బల్పులతో వెలిగించిన కాంతి
ఆకు ఎంత చిన్నదైతే అంత సౌందర్యం
చినుకు చెట్లకే కాదు
మనిషికీ ఊరటే
భూమంతా మురిసినట్టు
చిరునగవులు కనిపిస్తాయి
ఎండుతూ వాడుతూ ఉన్న ఆకాశం
చిగురించినట్లు వికాసం
విమానంలో వెళ్ళేటప్పుడు కూడా
మేఘాలు పేక మేడలు కట్టినట్లు

నల్లనివి, తెల్లనివి,
రకరకాల మబ్బులు మనల్ని మురిపిస్తాయి
కొన్ని సార్లు అకాశంలో
ఉద్యానవనాలున్నట్టుంటుంది
కొన్నిసార్లు స్వప్నాల కంటే వాస్తవ దృశ్యాలే
చెరగని చిత్రాలు
దృశ్యానికి దృశ్యానికి కొన్ని సెకనులే తేడా
లండన్‌ ఆర్ట్‌‌డ గ్యాలరీలో

సుదీర్ఘ దృశ్యాలను మించిన
చిత్ర ప్రపంచం ఇక్కడుంది
అవును
మనిషి భూమి నుండి
ఆకాశం వేపు వెళ్ళినకొలది
అది ఒక అనుభూతే
జీవితంలో ఎన్నోనిమ్నోన్నతాలు
ఎత్తుకు ఎదుగుతాం

లోయల్లోకి పడద్రోయబడతాం
కనుపాపల్లో నేత్రం నిరంతరం
రక్షింపబడుతుంది
చినుకులో కూడా సంగీతం ఉంది
అది చెవులకే కాదు గుండెకు పాకుతుంది

kathiనిజమే
జీవితానికి రక్షక భటులు
నైతిక శక్తులే
అతీత శక్తి అబద్ధమే
ప్రకృతిలోని రమణీయతలే కాదు
జీవ నిధులు చూడాలి
చెట్టును చినుకును ప్రేమించలేనివారు అంధులే ళ్ళముందు వికసించే పువ్వు అనేక గాథలు చెప్తుంది.
దేశీయమైన మట్టి వాసన
చరిత్ర నిర్మాణానికి ఆయువు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top