You Are Here: Home » ఇతర » చిదంబర రహస్యం

చిదంబర రహస్యం

కంప్యూటర్లు, టీవీలు, సెల్‌ఫోన్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల ధరలు తగ్గనున్నాయా… ఆదాయపన్ను పరిమితిని మరి కొంత పెంచునున్నారా… వడ్డీ రేట్లు పెంచి బ్యాంకుల అభివృద్ధికి బాటలు వేస్తారా… నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా… మహిళలకు, చిన్నారులకు కొత్త పథకాలు ఏమైనా ప్రారంభిస్తారా… ఉన్న పథకాలకు ఎన్ని నిధులు ేకటారుుస్తారు.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం 28న రానున్న ేకంద్ర బడ్జెట్‌. బడ్జెట్‌ ేకటారుుంపులను బట్టే ఆయా రంగాలు ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దీంతో 110 కోట్ల భారత ప్రజలు బడ్జెట్‌వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఐదుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనుభవం చిదంబరానికి ఉంది. దీంతో బ్యాంకింగ్‌, పారిశ్రామిక రంగాలు ఆయనపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారుు. మరో రెండు రోజుల్లో సాధారణ వార్షిక బడ్జెట్‌ పార్లమెంట్‌లోకి రానుంది.

26Colవివిధ పన్నుల నుంచి వచ్చే ఆదాయం, ఆయా పథకాలకు అయ్యే ఖర్చుల వివరాల పట్టికే బడ్జెట్‌. ప్రతి సంవత్సరం మన దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక బడ్జెట్‌ను రూపొందిస్తుంది. దీనికి సెప్టెంబర్‌లో ఏర్పడ్డ కమిటీ రంగంలోకి దిగి తయారుచేయడం, కొత్త కేటాయింపులు, కోతలు జరుగుతాయి ఈ ప్రక్రియ పూర్తయి చివరికి ఫిబ్రవరి చివరి రోజున పార్లమెంట్‌కు చేరుతుంది. సామన్యుడికి సంబంధించి ధరల పెరుగుదల, పరిశ్రమలకు సంబంధించిన రాయితీ షేర్‌ మార్కెట్‌ హెచ్చుతగ్గులు పూర్తిగా బడ్జెట్‌ కేటాయింపులపైనే ఆధారపడి ఉంటాయి.

చిదంబరం బడ్జెట్‌
RBI-Bizbasketప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఇరవైయేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది. 2020 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఓ ప్రబలశక్తిగా అవతరించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేగాన్ని అందిపుచ్చుకుని దేశ బడ్జెట్‌ ప్రవేశపెట్టే మేథావి లోతుగా తర్కించేవాడై ఉండాల్సి ఉంటుంది. గత సంవత్సరం బడ్జెట్‌ను ప్రణబ్‌ముఖర్జీ సమర్పించారు. ఈ సంవత్సరం చిదంబరం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బంగారం దిగుమతి సుంకాన్ని 4 నుంచి 6కు పెంచారు. సిలిండర్ల కుదింపు, పెట్రో కంపెనీలకు పెరుగుదలపై నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిదంబరానికి గతంలో ఐదుసార్లు బడ్జెట్‌ను సమర్పించిన అనుభవం ఉంది. కొన్ని రంగాలను అభివృద్ధి పథంలో పయనించేలా చేయడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు. ఇప్పుడు సమర్పించబోయేది ఆరవ బడ్జెట్‌. గతంలో ఆర్థిక మంత్రిగా చేసిన సమయంలో 2004-08 వరకు నాలుగేళ్లలో 9 శాతం ఆర్థికవృద్ధిని సాధించారు.

అయితే తరువాత వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా వృద్ధి రేటు పడిపోతూ వచ్చి దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా 5.3శాతానికి చేరింది. రానున్న రెండేళ్లలో ఇది 7శాతానికి పెరిగేలా చర్యలు తీసుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే అంచనాలను సిద్ధం చేసింది. ఈ సారి అడ్డంకులను తొలగించుకుని కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందులో మంత్రి ఎంత వరకు సక్సెస్‌ అవుతారనే విషయంపై పరిశ్రమ, బ్యాంకింగ్‌ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికీ కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టే విషయంలో యుపిఏ విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి.

బడ్జెట్‌ విశేషాలు

 • స్వాతంత్య్రానంతరం 1947 నవంబర్‌ 26న ఆర్‌కె షణ్ముఖం చెట్టి తొలి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు.
 • ఆ తరువాత ఫిబ్రవరి చివరి పనిదినాన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.
 • 1958-59లో అప్పటి ఆర్థికమంత్రి టిటి కృష్ణమాచారి రాజీనామాతో ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించే బాధ్యతలు స్వీకరించారు.
 • భారతదేశంలో అత్యధిక సార్లు(8) పార్లమెంట్‌కు బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించిన మంత్రి మొరార్జీదేశాయ్‌.
 • ఉపప్రధానిగా వుంటూ బడ్జెట్‌ను సమర్పించిన ఘనత కూడా ఆయనదే. తన పుట్టిన రోజు నాడు బడ్జెట్‌ను అందించిందీ ఆయనే.
 • ఇండియాలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒకే ఒక్క మహిళ ఇందిరా గాంధీ. మొరార్జీ దేశాయ్‌ రాజీనామా తరువాత ఆమె ఒకసారి బడ్జెట్‌ను సమర్పించారు.
 • రాజ్యసభ సభ్యుడి హోదాలో 1982 నుంచి 85 మధ్య కాలంలో మూడు సార్లు ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ను అందించారు.
 • విపి సింగ్‌ ప్రభుత్వం పతనమైన తరువాత 1987-88 బడ్జెట్‌ను రాజీవ్‌ గాంధీ అందించారు.
 • దీంతో ప్రధానిగా వుంటూ బడ్జెట్‌ను సమర్పించిన ఒకే వంశంలో నెహ్రూ, ఇందిరలతో పాటు రాజీవ్‌ కూడా చేరారు.
 • ఎటువంటి చర్చా లేకుండా బడ్జెట్‌ ఆమోదం పొందింది 1997-98లో. ఐకె గుజ్రాల్‌ ప్రభుత్వం పతనమైన తరువాత అంతకుముందు చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆమోదించేందుకు ప్రత్యేక సెషన్‌ నిర్వహించి చర్చ లేకుండా ఆమోదించారు.
 • 2000 సంవత్సరం వరకూ ఫిబ్రవరి చివరి పనిదినాన సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమయ్యేది. ఈ సంప్రదాయాన్ని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మార్చింది.
 • 2001 నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించాలన్న నిర్ణణం తీసుకోగా, ఆ సంవత్సరం యశ్వంత్‌ సిన్హా ప్రతిపాదనలు అందించారు.
 • ఇప్పటివరకూ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వారి సంఖ్య 23. వారు లియాఖత్‌ అలీ ఖాన్‌ (స్వాతంత్య్రం రాక పూర్వం), ఆర్‌ షణ్బుఖం చెట్టి, జాన్‌ మథాయ్‌, చింతామణి రావ్‌ దేశ్‌ముఖ్‌, టిటి కృష్ణమాచారి, జవహర్‌లాల్‌ నెహ్రూ, మొరార్జి దేశాయ్‌, సుచీంద్ర చౌదరి, ఇందిరా గాంధీ, యశ్వంత్‌రావ్‌ చవాన్‌, సి సుబ్రమణియన్‌, రాజీవ్‌ గాంధీ, హెచ్‌ఎం పాటిల్‌, చౌదరి చరణ్‌ సింగ్‌, రామస్వామి వెంకటరామన్‌, ప్రణబ్‌ ముఖర్జీ, వీపీ సింగ్‌, యస్‌బి చవాన్‌, మధు దండావతే, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌, పి చిదంబరం, జస్వంత్‌ సింగ్‌.
 • మద్రాస్‌ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసిన ఐదుగురు దేశానికి ఆర్థికమంత్రులుగా సేవలందించడం విశేషం.

  రూపకల్పన ఇలా

 • భారత రాజ్యాంగంలోని 112 ఆర్టికల్‌ ప్రకారం దేశ వార్షిక ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టాల్సింది రాష్ర్టపతి. కానీ, ఆర్టికల్‌ 77(3) ప్రకారం ఈ బాధ్యత అంతా కేంద్ర ఆర్థికశాఖ మంత్రిపై ఉంటుంది. ఆయనే వార్షిక ఆర్థిక నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఇదే బడ్జెట్‌
 • ఆర్థిక మంత్రి, ఆర్థిక మంత్రిత్వ శాఖ కలిసి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల బడ్జెట్‌కూ రూపకల్పన చేస్తారు. వీరికి ప్లానింగ్‌ కమిషన్‌, ది కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్టర్స్‌ తగు సహకారం అందిస్తారు.
 • బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి చాలా రోజుల ముందే దాని రూపకల్పన ప్రారంభమవుతుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ నుంచి ఖర్చులను, నాన్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌, రెవెన్యూ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ల నుంచి రాబడులను, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ నుంచి లోటునూ తెలుసుకుంటారు.
 • సెప్టెంబర్‌లో ప్రారంభమైయ్యే ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, విభాగాలు, మంత్రిత్వ శాఖల వారీగా కేటాయింపులు చేసుకుంటూ వెళతారు.
 • బడ్జెట్‌ రూపకల్పనకు కొన్ని డ్యూడేట్స్‌ ఉంటాయి. ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపిన తేదీకి వాటిని అందించవలసిన బాధ్యత ఆయా విభాగాలపై ఉంటుంది.
 • బడ్జెట్‌ రూపకల్పన కోసం ఆ సంవత్సరం వివిధ వర్గాల ప్రజలు, వ్యాపార వర్గాలు, పరిశ్రమల విభాగాలన్నింటి నుంచి అనుకూల, ప్రతికూల అంశాలను పరిశీలించడం జరుగుతుంది.
 • అంతా సిద్ధమైన తరువాత బడ్జెట్‌ నాలుగైదు రోజుల ముందుగా ప్రింటింగ్‌ విభాగానికి చేరుతుంది. చాలా సీక్రెట్‌ జరిగే ప్రింటింగ్‌ అనంతరం పార్లమెంట్‌ ముందుకు వస్తుంది.

  బడ్జెట్‌కు ఆమోదముద్ర
  sen4

 • రాష్ర్టపతి నిర్దేశించిన రోజున పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. సౌలభ్యంగా ఉండేందుకు 1999 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి పనిదినాన ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశాలు రాష్ర్టపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి.
 • ఫిబ్రవరి 28న (లీపు సంవత్సరంలో 29న) లోక్‌సభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రెండు భాగాలుంటాయి. బక భాగం దేశ సాధారణ ఆర్థిక సర్వే కాగా, రెండోది పన్ను విధివిధానాలు. ఆర్థికమంత్రి ప్రసంగం అనంతరం రాజ్యసభ ముందుంచుతారు.
 • అప్పటికప్పుడు బడ్జెట్‌పై ఏ విధమైన చర్చలూ జరగవు. కొద్ది రోజుల తరువాత తిరిగి పార్లమెంట్‌ రెండు మూడు రోజులు సమావేశమై బడ్జెట్‌పై చర్చ జరుపుతుంది. చివరి రోజు ఆర్థికమంత్రి సమాధానం ఉంటుంది.
 • చివరిగా బడ్జెట్‌పై స్టాండింగ్‌ కమిటీ రిపోర్టులను మంత్రిత్వ శాఖల వారీగా కేటాయింపులతో పార్లమెంట్‌ ముందుంచుతారు. ఓట్స్‌ ఆన్‌ డిమాండ్‌ణ చర్చలు జరుగుతాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలపై, ఓట్‌ ఆన్‌ డిమాండ్లపై చర్చలన్నింటి తరువాత బడ్జెట్‌ ఆమోదం పొందుతుంది.
 • బడ్జెట్‌ ఎందుకు?
  l2005011309ప్రణాళిక లేకుండా ఏ పని చేసినా ఆశించిన లక్ష్యాలను చేరలేము. అది ఇంటికే గాని, కంపెనీకే గాని, రాష్ట్రానికైనా, దేశానికైనా… అనుకున్న ప్రగతి సాధించాలంటే బడ్జెట్‌ తప్పనిసరి. ఏ ఏ రంగాలు అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆయా రంగాలకు నిధులు ఎంత మేరకు కేటాయిస్తాం. తద్వారా ఎంత ప్రగతి సాధిస్తాం.. వనరులను నియంత్రించడం, నిర్వహించాల్సి ప్రణాళికను అందరికీ అందేలా చూడడం, అందులో తీసుకున్న నిర్ణయాలను, లక్ష్యాలను చేరేలా చూడడం, ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి కూడా వీలుగా ఉంటుంది. బడ్జెట్‌పై ఆధారపడే దేశ ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది.

  అదో రహస్య ప్రపంచం
  d05బడ్జెట్‌ రూపకల్పన ఆసాంతం అత్యంత రహస్యంగా సాగుతుంది. ఎంపిక చేసిన కొందరు అధికారుల నేతత్వంలో అన్ని నెట్‌వర్క్‌ లింకులు కట్‌ చేయబడ్డ కంప్యూటర్లపై పని జరుగుతుంది. ఫిబ్రవరి చివరి వారంలోనే అన్ని ప్రతిపాదనలతో కూడిన బడ్జెట్‌ సిడి ముద్రణ కోసం పంపబడుతుంది.ముద్రణా కార్యాలయం న్యూఢిల్లీ సెంట్రల్‌ సెక్రటేరియట్‌లోని నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌లో ఉంటుంది. ప్రింటింగ్‌ పనిలో కేంద్రీకతమైవున్న అందరు టెక్నికల్‌ అధికారులు, లీగల్‌ అధికారులు, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారులు, నార్త్‌బ్లాక్‌లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఎవరూ బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా చేస్తారు.అక్కడే తిని, అక్కడే విశ్రమించే వీరంతా ఆర్థికమంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరమే బయటకు వస్తారు. వీరి అందరి సెల్‌ఫోన్‌లూ జామ్‌ చేయబడతాయి.కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే మంత్రివర్గ సహచరులకు ఈ బడ్జెట్‌ కాపీ అందుతుంది.
  – శ్రీనివాసకుమార్‌ మామిళ్ళపల్లి

  Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top