You Are Here: Home » ఇతర » చిట్‌ చాట్‌తో రిలీఫ్‌

చిట్‌ చాట్‌తో రిలీఫ్‌

మనం పనిచేసే కార్యాలయాలలో బాస్‌ దగ్గరలో లేకుంటే ఇక ఆఫీసులో అడిగేవాళ్లు లేకుంటే చాలు. సమయం దొరికింది కదా అని కొందరు చాటింగ్‌ మొదలెడతారు. ఇలా ముచ్చట్లు పెట్టగానే ఎవరో మనకు తెలియకుండా మన బాస్‌కు సమాచారం అందించడం…దీంతో ఆఫీసులో ఒక్కోసారి ఉద్యోగాలు కూడా కొందరు పోగొట్టుకోవడం చేస్తుంటారు. అమ్మాయిలకయితే ఇంటి వద్ద కూడా తల్లిదండ్రుల నుంచి కఠిన నిబంధనలు ఎదుర్కోవాల్సివుంటుంది. అలాగని కొందరు అమ్మాయిలు మాట్లాడకుండా ఉండలేరు. ఎప్పుడూ సీరియస్‌గా కూర్చోవడం వాళ్లకు చేతకాదు.

మనసారా మాట్లాడదామంటే చుట్టుపక్కల ఏమనుకుంటారో అని భయం. అయితే ఇటీవల లండన్‌ కు చెందిన కొందరు పరిశోధకులు ఇలా మనసువిప్పి హాయిగా మాట్లాడటం వలన ఒత్తిడిని నివా రించవచ్చని అంటున్నారు. మనకు ఇష్టమొచ్చిన అంశం మీద ఒక పావుగంటసేపు మాట్లాడితే చాలట… ఆందోళన నుంచి, ఒత్తిడి నుంచి మనలను అది దూరం చేస్తుందని ఇంగ్లాండ్‌ మానసిక శాస్తవ్రేత్తలు అంటున్నారు. సాధారణంగా మగవారి కన్నా కూడా ఆడవారిలోనే ఒత్తిడి అధికంగా ఉంటుందట. వారు ఈ ఒత్తిడిని అధికమించడానికి ఆఫీసుల్లో కొద్దిసేపు మాట్లాడితే చాలంటున్నారు.

Chatమగవారయితే కొద్దిసేపు బయటకువెళ్లి ఏ సిగిరెట్టో , టీనో తాగివస్తారు. కొద్దిసేపు రిలాక్స్‌ అయి మళ్లీ పనిలో మునిగిపోతారు. అదే ఆడవారైతే… గం టల తరబడి ఒకే సీట్లో అతుక్కుపోతుం టారు. అట్లాం టప్పుడు కాస్త రిలాక్సేషన్‌ కోసం పక్కనున్న కొలీగ్స్‌తో మాట్లా డితే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడొచ్చు. వర్క్‌లో రిలాక్సేషన్‌ కూడా ఉంటుంది. అయితే మాట్లాడుకోవడమంటే గంటలతరబడి ఆఫీసు పనులన్నీ పక్కనపెట్టేసి మాట్లాడు కోమని కాదు. పరి మిత సమయంలోనే మాట్లాడుకోవాలి. మళ్లీ పనిలో మునిగిపోతే ఎట్లాగూ మాట్లాడాలన్నా కూడా మాట్లాడ లేము. కొంద రయితే ఇతరుల పనులకు ఆటంకం కలిగిస్తూ మాట్లాడుతుంటారు.

అలాకాక అవతలివారి ఫీలింగ్స్‌ను బట్టి మాట్లాడాలి. బాగా చనువు ఉన్నవారి తోనే మాట్లాడాలి.
దాంతో మానసిక ఒత్తిడి నుంచి కొంతవరకు బయటపడతాము. మాట్లాడుకోవడమంటే ఒకరి వ్యక్తిగత విషయాల గురిం చి మాట్లాడకూడదు. అలాచేస్తే అవతలివారిదృష్టిలో చులకన అవుతాము.జనరల్‌గా అందరూ ఇష్టపడే అంశాలలో మాట్లాడితే అవతలివారు కూడా బోర్‌ ఫీలవకుండా ఉంటారు. అలా గాక మనకిష్టమైన టాపిక్‌నే ఎంచుకుని అవతలివారిని సతాయించకూడదు. పనివేళల్లో మాత్రం చేస్తున్న పని మీదే దృష్టిని కేంద్రీకరించాలి. మధ్యమధ్యలో కాస్త రిలీఫ్‌ కోసం 5 లేక 10 నిమిషాలు కొలీగ్‌ అనుమతి తీసుకుని ఆమెతో మాటలు కలపాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top