You Are Here: Home » ఇతర » చిట్లిన జుట్టుకు…

చిట్లిన జుట్టుకు…

>జుట్టు చివర్లు చీలిపోతే వాటి ఎదుగుదల సరిగా ఉండదు. తెగిన శిరోజాలతో తలకట్టు కూడా సరిగా కుదరదు. మరి పట్టుకుచ్చులా ఉండే కురులు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి?

  • కొబ్బరి, ఆలివ్‌ నూనె సమ పాళ్లలో తీసుకొని వేడిచేయాలి. గోరువెచ్చగా అయ్యాక కుదుళ్ల నుంచి చివర్ల వరకూ తలకు రాయాలి. దాం తోపాటు మాడుకు చక్కగా మర్దన చేసి మర్నాడు షాంపుతో తలస్నానం చేయాలి. అలాగే రెండు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరించేస్తుండాలి.
    5hair
  • బాగా పండిన బొప్పాయిని తీసుకొని గింజలను తొలగించాలి. వాటిని మెత్తగా చేసి అందులో తగినంత పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. దీనివల్ల కురులు చిట్లే సమస్య నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలడం సమస్య కూడా నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.
  • నెలకోసారి కొబ్బరి పాలతో శారోజాలను తడిపి గంటసేపు తరువాత షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆముదం, ఆవనూనె సమపాళ్లలో తీసుకొని జుట్టు చివర్లకు రాయాలి. పొడి తువాలను చుట్టి అరగంటయ్యాక స్నానం చేస్తే సరిపోతుంది. కురులు కూడా ఒత్తుగా ఏర్పడతాయి.
  • Clip to Evernote

    Leave a Comment

    Copy Protected by Chetans WP-Copyprotect.
    Scroll to top