You Are Here: Home » ఇతర » చిక్కిన చక్కనమ్మ

చిక్కిన చక్కనమ్మ

imageఈ మథ్య చాలామందికి జీరో సైజ్‌ అంటూ నాజూ కుగా ఉండాలన్న తపన ఎక్కువైపోయింది. దాని కోసం ఆహార నియమాలు సొంతంగా తయారు చేసేసు కుని ఫాలో అయిపోతున్నారు. చక్కనమ్మ చిక్కినా అం దమే అనే మాటకి అర్ధం మార్చేస్తున్నారు. చిక్కిన చక్క నమ్మ తిండిమానేసిందని కాదు. చక్కగా ఉండే అమ్మా యి కొద్దిగా చిక్కినా అందంగానే ఉంటుంది. అని అర్థం. అంతేకానీ జీరో సైజ్‌ అంటూ ఈకాలం చాలామంది తిండి మరీ తగ్గించేస్తున్నారు. ఊబకాయులు కూడా డాక్టర్‌ సలహాని బట్టి ఆహార నియమాలు పాటించాలి గానీ, ఎప్పుడు పడితే అప్పుడు సొంతగా స్లిమ్‌గా కనబ డాలని ఏవోవో నిర్ణయాలు తీసేసుకుంటు న్నారు. ఈ రకమైన అపోహ చాలా ప్రమాదం అంటూ హెచ్చరిస్తు న్నారు వైద్య నిపుణులు.

జీరో సైజ్‌ అనే పదానికి అర్ధం వేరు. ముందు దానిని తెలుసుకుని మీరు స్లిమ్‌గా ఉండటానికి ఏం చెయ్యా లో నిపుణుల్ని సంప్రదించి వారి సూచనలు పాటించండి. ఇక్కడ ఒక అమ్మాయి జీరోసైజ్‌ కోసం తినడం మాని ఆస్పత్రి పాలయ్యింది. నడుము సన్నగా నాజూకు తనం అనేది హెరిడెటరీ మీద కూడా ఆధారపడి ఉంటుందని, అయినా కొన్ని నియమాలు పాటించి కొంత వరకూ తగ్గించుకోవచ్చని, తినడం మానడమే అందుకు తరుణోపాయం కాదని చెప్తున్నారు. అయినా జీరోసైజ్‌ అనేది అమెరికా, లండన్‌ వంటి దేశాల్లో రడీమేడ్‌ దుస్తులు కొనుక్కునే టప్పుడు సన్నని నడుం వున్నవారి సైజు చెప్పవలసి వస్తే జీరో సైజ్‌ అని చెప్తారు. అంతేకానీ జీరో సైజంటే, స్లిమ్‌కి సంబంధించింది కాదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top