You Are Here: Home » భవిత » వ్యాపారం » చవక ధరకే టాబ్లెట్‌

చవక ధరకే టాబ్లెట్‌

చవక ధరకే టాబ్లెట్‌

Micrతక్కువ ధరకే టాబ్లెట్‌ కొనాలకునే వారికి ఓ చక్కటి అవకాశం. మైక్రోమ్యాక్స్‌ సంస్థ చవకయిన టాబ్లెట్‌ను రూపొందించింది. దీనికి ఫన్‌బుక్‌ అనే పేరు పెట్టింది. ధర కేవలం రూ. 6,499. ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌ విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ టాబ్లెట్‌ 800 480 పిక్సల్‌ హై రిజల్యూషన్‌ను కలిగిన 7 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ధర తక్కువే అయినా పని తీరు మాత్రం ఖరీదైన బ్రాండ్లకు ఏ మాత్రం తీసిపోదని అంటున్నారు. 1.2 జిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌తో దీనిపై మన కార్యకలాపాలను వేగంగా చేసుకోవచ్చు.ఇది మల్టీ టచ్‌ ఇన్‌పుట్‌ల తో పాటు జూమ్‌ ఆప్షన్‌లను సపోర్ట్‌ చేస్తుంది.

పీసీలో నిక్షిప్తం చేసిన మన్నికైన గ్రాఫిక్‌ ప్రాసెసర్‌ చక్కని మల్టీ మీడియా అనుభవాన్నిస్తుంది. అంతర్గత మెమెరీ 4జీబి, ర్యామ్‌ సామర్ద్యం 512 ఎంబీ. మైక్రోఎస్డీ కార్డ్‌ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు. టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన వై-ఫై, 3జీ కనెక్టివిటీ వ్యవస్థలు వేగ వంతమైన ఇంటర్నెట్‌ను సపోర్ట్‌ చేస్తాయి. నలుపు, బూడిద రంగుల్లో దీన్ని తీర్చిదిద్దారు. ముందు భాగంలో వీజీఏ కెమెరా 0.3 మెగా పిక్సల్‌ సామర్ధ్యంతో ఉంటుంది. ఎంబీఏ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ విద్యార్థులు కోసం స్టడీ మెటీరియల్‌తో పాటు పలు ప్రాథమిక అప్లికేష న్‌లను ముందుగానే లోడ్‌ చేశారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top