You Are Here: Home » ఇతర » చలి కాలంలో ఇంట్లో ‘వాటర్‌ హీటర్‌’

చలి కాలంలో ఇంట్లో ‘వాటర్‌ హీటర్‌’

నిత్య జీవితంలో చలిని తట్టుకునేందుకు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ వాటర్‌ హీటర్‌ అవసరం తప్పని సరిగా మారింది. గ్యాస్‌ వాడకం పెరగడంతోపాటు కట్టెల పొయ్యిల వాడకం తగ్గడంతో ఎక్కువమంది ప్రతి ఇంట్లో నీటిని వేడి చేసుకునేందుకు వాటర్‌హీటర్‌లను వినియోగిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఎవరి తాహతుకు తగ్గట్లుగా ఈ వాటర్‌ హీటర్లు మార్కెట్లో అందుబాటులోకివస్తున్నాయి. తక్కువ విద్యుత్‌ వినియోగంతో త్వరగా చల్లని నీరు వేడి అయ్యేలా కంపెనీలు వీటిని అత్యాధునిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాయి. వాటర్‌ హీటర్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు సిఎఫ్‌సి ఫ్రీ పియుఎఫ్‌ ఇన్సులేషన్‌, షాక్‌ ప్రూఫ్‌, వాటర్‌ ప్రూఫ్‌ ఉండేలా చూసుకోవాలి. పట్టణీకరణ నేపధ్యంలో తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకునేలా ఎంచుకోవాలి. సిఈ మార్క్‌ ఆఫ్‌ క్వాలిటీ కూడా ఉండాలి. విద్యుత్‌ ఆదా అయ్యేందుకు బిఈఈ స్టార్‌ రేటింగ్‌ విత్‌ ఫైవ్‌స్టార్‌ ఉండాలి. అలాగే నీటి నిల్వ సామర్ధ్యం ఎంత అవసరమో తెలుసుకుని కొనుగోలు చేయాలి. 1 లీటర్‌ నుంచి 25 లీటర్ల వరకు స్టోరేజ్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటర్‌ హీటర్‌ కొనుగోలు విషయంలో 5 సంవత్సరాల వరకు గ్యారంటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

– ఉషా ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ తరుణ్‌ఖన్నా

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top