You Are Here: Home » సఖి » అందం » చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

 

మండే ఎండల్లోనే స్కిన్‌ ట్యాన్‌ ఏర్పడుతుందనుకోకూడదు. ఏ సీజన్లోనైనా సూర్యుని అతినీలలోహిత కిరణాలు తాకిడికి చర్మం కమిలిపోయే అవకాశం ఉంది. చాలామంది ఈ ట్యానింగ్‌ను పెద్దగా పట్టించుకోరు. నిజానికి చికాకు పెట్టే చర్మసంబంధిత సమస్య ఇది. ఈ సమస్యను అధిగమించడానికి ఈ చిట్కాలను పాటించండి.

  • చర్మ సమస్యలు   చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్‌ కలిపి గుండ్రంగా మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి.
  • ఒక స్పూన్‌ బంగాళా దుంప రసం, ఒక స్పూన్‌ నిమ్మరసం కలిపి రాసి పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తగ్గేవరకూ రోజూ ఇలా చేస్తూనే ఉండాలి.
  • కీరా రసం తీసి, ఒక టేబుల్‌ స్పూన్‌ చల్లని పాలలో కలిపి రాసి పావుగంట ఆగిన తర్వాత చల్లని నీటితో కడిగి వేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాయాలి.
  • మూడు టేబుల్‌ స్పూన్ల పాలు, ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు కలిపి రాసి, కొద్దిసేపాగి కడిగి వేయాలి.
  • కొద్దిగా అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్టు మాదిరి చేసి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది.
  • ఆలివ్‌ ఆయిల్‌ మసాజ్‌ వల్ల ఫలితం కనిపిస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, ఒక నిమ్మకాయరసం కలిపి కమిలిన చర్మంపై రాయాలి.
  • నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి కాచి, నీటిని వడగట్టి, ముక్కల్ని గుజ్జుగా పిసికి దానిని రాసుకుని 15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగి వేయాలి. ఇలా వారంరోజులు చేయాలి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top