You Are Here: Home » ఇతర » చరిత్ర చూస్తే ‘అమితా’నందం

చరిత్ర చూస్తే ‘అమితా’నందం

సాహితీ రంగంలో ఎంతమంది మహిళలు ఎన్ని విప్లవాత్మక మార్పులు, సంచలనాలు తెస్తున్నా, చారిత్రక నవలా రచనలు సుమారుగా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. సమకాలీన పరిస్థితుల మీద పుంఖానుపుంఖాలుగా రచనలు, నిరసనలు వెల్లువెత్తిస్తూ సమాజాన్ని జాగృతం చేస్తున్న కొందరు మహిళామణులు సాహిత్యలోకంలో విహరిస్తున్నారు. గతం నుంచి భవిష్యత్తుని దర్శించడం కొంతమందిేక సాధ్యమవుతుంది. అలా కొందరి కృషివల్లనే చరిత్ర ఒక అధ్యయన శాస్త్రంగా రూపుదిద్దుకుంది. ఇప్పటికీ చారిత్రక కథారచరుుతలుగా ఎందరో వారి రచనలతో అద్భుతాలు ఆవిష్కరించినా, గత కొన్ని దశాబ్ధాలుగా ఈ సాహిత్య ప్రక్రియలో పౌరాణిక, చారిత్రక రచనలు దాదాపుగా కొరవడ్డాయనే చెప్పవచ్చు.


అయితే చారిత్రక నేపథ్యంలో కూడా కొత్తపుంతలు తొక్కవచ్చని రుజువుచేస్తోంది అమితా కనేకర్‌. ఈతరానికి పాత చరిత్రలు అంతగా పనికిరావు అన్న వాదానికి తెరదించింది ఈమె రచించిన ‘ఏ స్పోక్‌ ఇన్‌ ది వీల్‌’ నవల. ఈమె రాసిన ఈ తొలిరచనే అనూహ్యమైన ఆదరణ పొందింది. బుద్ద భగవానుని జీవితం ఆధారంగా చేసిన ఈ నవలలో ఎన్నో పరిశోధనాత్మక విశేషాలు వెలుగుచూసాయి. ఈమె ఏ సబ్జెక్ట్‌లో రచన సాగించాలన్నా అందుకు కావలసిన అంశాలకోసం అనేక ప్రాంతాలు తిరిగి అక్కడ తనకు లభ్యమైన విషయాల్ని స్వయంగా తెలుసుకుని గ్రధస్తం చేస్తుంది. అందుకే ఈమె రచించిన ఈ పుస్తకం అందరి మస్తకాల్నీ ఆలోచింపచేసే విధంగా రూపుదిద్దుకుంది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఘనత కూడా హార్పర్‌ కొల్లిన్స్‌ పబ్లిషర్స్‌కి దక్కింది.

పరిశోధన వెనుక…
amita5ఈమె న్యూ ఢిల్లీ జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో తన తొలి రచనకు పరిశోధన ప్రారంభించిన సమయంలో వచ్చిన దీపావళి శెలవల్ని అనుకూలంగా మలచుకుంది. ఆ తరువాత సెంటర్‌ ఫర్‌ది హిస్టారికల్‌ స్టడీస్‌లో ఉన్న ప్రొ. కునాల్‌ చక్రవర్తి మార్గదర్శకత్వంలో ఈమె పరిశోధన మరింత లోతుగా జరిపింది. ఇక రచన ప్రారంభించడానికి ఒక సంవత్సరం ముందు నుండే ప్రాధమిక అంశాల్ని ఆకళింపుచేసుకోవడానికి రాత్రింపవళ్ళు అనేక గ్రంధాలు చదివింది. ఈమె గమ్యం మాత్రం ఈమె రాసే నవల అందరూ చదవదగ్గదిగా ఉండాలని ఎంతో కృషిచేసింది. ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కూలంకషంగా అన్ని విషయ, విశేషాల్ని పొందుపరిచింది.ఈమెకు ముందుగా బుద్ధుడి గురించి ఒక గ్రంధాన్ని రాయాలన్న ఆకాంక్ష ఎన్నో సంవత్సరాలుగా ఉంది. అలాగే తనొక మంచి రచయిత్రిగా నిలబడాలని తపన పడింది.

కానీ, ఆ అవకాశం చాలా కాలానికి వచ్చింది. అప్పుడే తన కలలకి శ్రీకారం చుట్టడం మొదలు పెట్టింది. అందుకు కావలసిన సరంజామాని సమకూర్చుకోవడంలో అలుపెరుగని సైనికునిలా ఎందరినో ప్రముఖుల్ని కలిసింది. ఎన్నో ఇతర సాహిత్య గ్రంధాలు సంపాదించింది. తన రచన వీలైనంత ఎక్కువ మంది చేత చదింపజేసేదిగా ఉండాలని ఆశించింది. మరోపక్క ఈ నవల కేవలం బౌద్ధుల కోసం నిర్ణయించినట్టు ఉండకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇన్ని నియమాలు పాటిస్తూ ఈ రచన చేయడం ఈమెకు చాలా కష్టతరమే అయ్యింది. అయినా పట్టు విడవ కుండా చేస్తున్న కృషితో ఈ పుస్తకరాజాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి నాలుగు సంవత్సరాల కాలవ్యవధి పట్టింది.

జీవిత విశేషాలు
amita2అమిత 1965లో గోవాలోని మద్గాన్‌లో పుట్టింది. అక్కడికి చేరువలో ఉన్న నవేలిమ్‌ గ్రామంలో తనకు రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకూ పెరిగింది. ఆతరువాత యూఎస్‌కు వెళ్ళిపోయింది. అయినా తరచూ ముంబాయి వస్తూ ఉండేది. ఇప్పుడు ముంబాయిలోనే స్థిరపడింది. ఇలా ముంబాయి చేరిన తర్వాత ఈమె కమల రహేజా విద్యానిథి సంస్థలో చారిత్రక నిర్మాణాల మీద అద్యాపకురాలిగా, అలాగే ముంబాయి విశ్వవిద్యాలయంలో పౌరాణిక అద్యాపకురాలిగా పనిచేసింది. ఈమె తండ్రి సురేష్‌ కనేకర్‌ పోర్చుగీసువారి పాలనలో కలోనియల్‌ రూల్‌కి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మూలంగా రెండుసార్లు జైలుపాలయ్యాడు. అమిత మేనత్త మిత్రా బిర్‌ కూడా ఒక ప్రముఖ స్వతంత్య్ర సమరయోధురాలు, మంచి విద్యావేత్త ఈమె తన 22వ ఏట ఉద్యమంలో పాల్గొని 12 ఏళ్లు జైలు శిక్షని కూడా అనుభవించింది. అమిత మేనమామ 1960ల్లో గోవాలో అనేక దేవాలయాలు తెరిపించడానికి దోహదం చేసాడు. ఇటువంటి కుటుంబ నేపథ్యంలో పుట్టిపెరిగిన ఈమెకు మంచి రచయిత్రి కావాలన్న కలలు కనడం అతిశయోక్తికాదు. అందులోను చారిత్ర మీద, పౌరాణిక ఇతిహాసాల మీద ఆసక్తి ఉన్న ఈమే అదే కోణంలో కలలకి సాకారం చేసుకోవడం గర్వించదగ్గ విషయం.

2006 నుంచీ అమిత తన రెండవ గ్రంధం మీద విశేషమైన కృషిలో నిమగ్నం అయ్యింది. ఈ నవల ఔరంగజేబు కాలంలో సత్నామీల తిరుగుబాటు నేపధ్యంలో సాగుతూ మొగలాయి చక్రవర్తుల పరిపాలనా విధానాల్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. 17వ శతాబ్ధంలో కబీర్‌ అనుచరులుగా పేరు పొందిన అతి తక్కువకాలం జీవించిన, అతి చిన్న తెగకి సంబంధించిన, అందరూ విడిచిపెట్టిన కులం అయిన సత్నామీల ఉపాయాలు, వ్యూహాలు ఇందులో పొందుపరిచింది. అదే విధంగా 1672లో ఊపందుకున్న వీరి ఉద్యమం ఆ కాలంలో ఆర్ధికంగా, వారి స్వంత కార్యనిర్వాహణా దక్షత కూడా ఇందులో ప్రతిబింబిస్తాయి. 17వ శతాబ్ధపు మొఘల్‌ సామ్రాజ్యం స్వరూప స్వభావాలన్నీ ఇందులో జ్యోతకమవుతాయి. ఈ రచనకి కావలసిన సమాచార సేకరణ కోసం ఈమె ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తూ తగిన ఆధారాలు, శిలాశాసనాలు పరిశీలిస్తూ ఎంతో పరిశోధనాత్మకంగా వెలువరిస్తోంది. అయితే త్వరలో ఈ పుస్తకాలు అన్ని ప్రాంతీయ భాషల్లోకీ అనువాదం చేసే ప్రక్రియ కూడా ఆలోచనలో ఉంది.

ముందడుగు…
amita1అమితా కనెకర్‌ 1965లో గోవాలో జన్మించింది. ‘యూనివర్సిటీ ఆఫ్‌ ముంబాయి’లో అద్యాపకురాలిగా పౌరాణిక గాధలు కూడా బోధిస్తోంది. అదేవిధంగా చారిత్రక నిర్మాణాల మీద కూడా ఉపన్యసిస్తోంది. ఈమె 2006 నుండి తన రెండవ రచన మీద దృష్టి సారించింది. అందుకోసం అహర్నిశలు కృషి చేస్తోంది. బాల్యంలో కొంతకాలం అమెరికాలో నివశించింది. ఈమె ఇప్పుడు మొగల్‌ చక్రవర్తుల పారిపాలన, ఔరంగజేబు జీవిత విశేషాల నేపథ్యంలో రాస్తున్న తన రెండవ నవలా రచన నిమిత్తం ఆయా ప్రాంతాలు సందర్శిస్తోంది. ఈమె తొలి నవల బుద్దుని గురించి తెలిపే ఏ స్పోక్‌ ఇన్‌ ది వీల్‌ ఎంతో విమర్శకుల ప్రశంసలతోపాటు, అద్భుత సమీక్షలు అందుకుంది. ఈ నవల 2005లో ప్రచురించబడింది. ఈ నవల అందించిన ఉత్సాహం, ప్రొత్సాహంతోనే రెండవ నవలకు శ్రీకారం చుట్టింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top