You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » చదరంగం ఆనందం

చదరంగం ఆనందం

క్రీకట్‌ స్థారుులో కానప్పటికీ, చదరంగం అంటే ఇష్టపడేవారెందరో ఉన్నారు. చదరంగం మనదేశంలో గుప్తుల కాలంలో మెుదలైంది. అది పర్షియా, మధ్యప్రాచ్యం మీదుగా యూరప్‌, రష్యాలకు విస్తరించింది. చెస్‌ పెద్దగా ఆడినా, ఆడకపోరుునా చెస్‌ బోర్డ్‌ను ఇంట్లో ఉంచుకునే వారెందరో. మాస్కోలో జరుగుతున్న ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పుడు డిఫెండింగ్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌, బోరిస్‌ గెల్ఫాండ్గలు ెరాెరీగా తలపడ్డారు. ఈ పోటీ డ్రా దిశగానే సాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. చెస్‌ అభిమానుల్లో ఉత్కంఠను రేెకత్తిస్తున్న ఈ పురాతన ఆటలో ఎన్నెన్నో విశేషాలు న్నారుు. వాటిపై కలర్స్‌ ప్రత్యేక కథనం…

పావులు
Unt

 • పురాతనమైన చెస్‌ సెట్‌లను ఉత్తర స్కాట్‌లాండ్‌లో కనుగొ న్నారు. అవి క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందినవని అంచనా. ఐస్‌లాండ్‌ లేదా నార్వేలో వాటిని తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు. హారీపాటర్‌ సినిమాల్లో వాటి రూపురేఖలను ఉపయోగించారు.
 • చెస్‌లో ఆయా పావులను ఏనుగు, మంత్రి, ఒంటె అని పిల్చినా సాధారణంగా అవి ఆయా రూపాల్లో ఉండవు. అందుకు ఓ కారణం ఉంది. భారత్‌ నుంచి యూరప్‌ చేరుకోవడానికి ముం దుగా చెస్‌ ఇస్లాం దేశాలను చేరింది. జంతువుల, మనుష్యుల రూపాలను చెక్కేందుకు ఇస్లాం అంగీకరించదు. అందుకే అవి ఆయా జంతురూపాల్లో కన్పించవు. యూరప్‌ చేరుకున్న తరు వాత కూడా వాటి రూపాల్లో మార్పులు చోటు చేసుకోలేదు.

  పదాలు
  Chess

 • చెక్‌మేట్‌ అనే పదం పర్షియన్‌ ఫ్రేస్‌ అయిన ‘షా మత్‌’ నుంచి వచ్చింది. దీనికి అర్థం ‘రాజు మరణించాడు’.
 • చెస్‌ ఆడడం ఆరంభించి ఏడాది కూడా కాని వారిని రూకీస్‌ అని అంటారు. చెస్‌ లో రూక్‌ (ఏనుగు)లను చివరిగా రంగం లోకి దింపుతారు. వాటి పేరిట కొత్త క్రీడాకారులను రూకీస్‌ అంటారు.
 • చెైనా ఎంపరర్‌ వెన్‌-టి ఇద్దరు విదేశీ చెస్‌ఆటగాళ్ళను ఉరి తీయించాడు. కారణం.. చెస్‌లో ఓ పావును ఎంపరర్‌ అనడమే. ఒక ఆటతో తన హోదా ముడిపడడం ఇష్టం లేక చెస్‌ను నిషేధించాడు.
 • చెస్‌కు పూర్వరూపమైన శతరంజ్‌లో క్వీన్‌ఉన మంత్రిగా వ్యవ హరిస్తారు. ఇప్పటికీ పలు భాషల్లో ఈ పదం వాడుక ఉంది.
 • ఎన్నో భాషల్లో పాన్‌ అంటే సోల్జర్‌ (సైనికుడు) అనే అర్థం. జర్మన్‌, స్పానిష్‌ భాషల్లో మాత్రం దానికి అర్థం రెైతు అని.
 • ఎఫ్‌ఐడీఈ అనేది ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డెస్‌ ఎచెస్‌ (వరల్డ్‌ చెస్‌ ఫెడరేషన్‌)కు సూచిక.
  సమస్య – పరిష్కారం సుదీర్ఘమైన చెస్‌ ప్రాబ్లమ్‌ సృష్టికర్తగా ఒట్లో బ్లాతీ (1860-1939) పేరొందారు. 290 మూవ్స్‌ ఇందులో ఉన్నాయి.
 • చెస్‌ ఆడడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయని గుర్తించారు. అల్జీమర్స్‌ చికిత్సలో భాగంగా చెస్‌ ఆడాల్సిందిగా సూచిస్తారు.

  క్రీడాకారులు…

 • సుదీర్ఘకాలం వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్న వ్యక్తి డాక్టర్‌ ఎమాన్యుయేల్‌ లేస్కర్‌. 26 ఏళ్ళ 210 రోజులు.
 • రెండో ప్రపంచ యుద్ధం కాలంలో నాజీల రహస్య సందేశాల ను డీకోడ్‌ చేయడానికి హ్యారీ గోలోంబెక్‌, స్టువర్ట్‌మిల్నెర్‌-బారీ, హెచ్‌.అలెగ్జాండర్‌ తదితరులు తమ సేవలను అందించారు.
 • ఒక ఎత్తు వేయడానికి సుదీర్ఘ సమయం తీసుకున్న ఆటగాడు ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ట్రోయిస్‌ (బ్రెజిల్‌). ఆయన తీసుకున్న వ్యవధి 2 గంటల 20 నిమిషాలు.
 • గేమ్‌ ఆడకుండానే 1975లో అనటోలి కార్పోవ్‌ వరల్డ్‌ చాంపి యన్‌ అయ్యాడు. కారణం ఆయన ప్రత్యర్థి ఫిచర్‌ గేమ్‌ ఆడేం దుకు నిరాకరించడమే.
 • అతి చిన్న వయస్సులోనే జోర్డీ మాంట్‌ రేనాడ్‌ (10 ఏళ్ళ 7 నెల లు) మాస్టర్‌ కాగా, ఆస్కార్‌ షాపిరో 74 ఏళ్ళ వయస్సులో మాస్టర్‌ అయ్యారు.
 • జూడియట్‌ పోల్గర్‌ అనే బాలిక 11 ఏళ్ళకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించింది. 12 ఏళ్ళకే ఉమన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ పొందింది. 13 ఏళ్ళ వయస్సులో ఎఫ్‌ఐడీఈ అత్యధిక రేటింగ్‌ పొందింది. ఫిస్చర్‌, కాస్పరోవ్‌ల కన్నా చిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించింది. 15 ఏళ్ళ 4 నెలల 27 రోజుల వయస్సులో గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యింది.
 • చెస్‌లో చాలా కాలం పాటు రష్యన్ల ఆధిక్యమే కొనసాగింది. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో రష్యన్‌ క్రీడాకారుడిని ఓడించిన మొదటి అమెరికన్‌ ఫ్రాంక్‌ మార్షల్‌ (1877-1944).
 • 1985లో ఎరిక్‌ నోపర్ట్‌ 68 గంటల్లో 10 నిమిషాల చెస్‌ గేమ్స్‌ 500 ఆడాడు.
  చెస్‌బోర్డ్‌ నలుపు, తెలుపు గళ్ళతో కూడిన మొదటి చెస్‌బోర్డ్‌ యూరప్‌లో 1090లో రూపుదిద్దుకుంది.
 • ఫోల్డింగ్‌ చెస్‌ బోర్డ్‌ను 1125లో ఓ మతగురువు కనుగొన్నారు. అప్పట్లో మతగురువులు చెస్‌ ఆడడాన్ని చర్చి నిషేధించిన నేపథ్యంలో రెండు పుస్తకాలు కలసి ఉన్నట్లుగా కన్పించేలా ఆయన ఆ చెస్‌బోర్డ్‌ను రూపొందించారు.

  పావులు కదపడం
  dsc

 • సుదీర్ఘమైన్‌ గేమ్‌లో 5,949 మూవ్స్‌ ఉంటాయని అంచనా.
 • అధికారిక సుదీర్ఘ గేమ్‌ 269 మూవ్స్‌లో డ్రా గా ముగిసింది. (నికోలిక్‌-అర్సోవిక్‌ల మధ్య)
 • రెండు సార్లు పావులు కదపడం ద్వారా చెక్‌మేట్‌ పెట్టేందుకు 8 విధానాలు, మూడు పావులు కదిపి చెక్‌మేట్‌ పెట్టేందుకు 355 విధానాలు ఉంటాయి.
 • కొత్త ‘పాన్‌’ (సైనికుడు)ను ఒక్క గడి జరిపేందుకు బదులు రెండు గడులు జరపడం స్పెయిన్‌లో 1280లోనే మొదలెైంది.
 • 1882లో లండన్‌లో జరిగిన మాసన్‌-మెకంజే గేమ్‌లో క్వీన్‌ను వరుసగా 72 సార్లు మూవ్‌ చేశారు.
 • చెస్‌లో రెండు వెైపులా మొదటి నాలుగు ఎత్తులను 318,979,564,000 రకాలుగా వేయవచ్చు.
 • ఫూల్స్‌మేట్‌- రెండు ఎత్తుల్లోనే ముగిసిపోయే గేమ్‌ ఇది. చెస్‌పెై అవగాహన లేనివారు ఇలా ఆడే అవకా శం ఉంది. స్టెప్స్‌: ఎఫ్‌3 ఇ5, జి4, క్యూహెచ్‌4++.
 • 1992లో తోర్టన్‌ – ఎం.వాకర్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి కాప్చర్‌ లేకుండా 100 మూవ్స్‌ చోటు చేసుకున్నాయి.
 • మొదట్లో క్వీన్‌ ఒకసారికి ఒక గడి మాత్రమే కది లేది. ఆ తరువాత ఒక్కోస్టెప్‌లో రెండు గళ్ళు కదల డం మొదలెైంది. స్పెయిన్‌లో క్వీన్‌ ఇసాబెల్లా శక్తి వంతురాలిగా ఉన్న కాలంలో ఆ ప్రభావం చెస్‌పెై కూడా పడింది. ఏ దిశలో ఎంత దూరమైన వెళ్ళ గలిగే శక్తి అప్పటి నుంచే వచ్చింది.
 • 1984లో బ్రిట్టన్‌, క్రోచ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరుసుగా 43 సార్లు వరుసగా చెక్‌ చెప్పడం చోటు చేసుకుంది.

  కంప్యూటర్స్‌…

 • చెస్‌కు సంబంధించిన మొదటి కంప్యూటర్‌ ప్రోగ్రా మ్‌ను 1951లో అలన్‌ ట్యూరింగ్‌ రూపొందించారు.
 • కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ల మధ్య మొదటి చెస్‌ పోటీ 1970లో న్యూయార్క్‌లో జరిగింది.
 • యు.ఎస్‌ చెస్‌ మాస్టర్‌ అవార్డు పొందిన మొదటి కంప్యూటర్‌ బెల్లె (1983). దీన్ని కెన్‌ థాంప్సన్‌, జో కాండన్‌ రూపొందించారు.
 • 1988 నవంబర్‌లో కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో డీప్‌ థాట్‌ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ మాస్టర్‌ను తొలిసారిగా ఓడించింది.
 • 1997లో గ్యారీ కాస్పరోవ్‌ను ఐబీఎం కంపెనీకి చెందిన డీప్‌బ్లూ కంప్యూటర్‌ ఓడించింది.
 • 2006లో వరల్డ్‌ చాంపియన్‌ వ్లాదిమీర్‌ కార్మ్‌నిక్‌ను డీప్‌ ఫ్రిట్స్‌ ఓడించింది.

  బ్లైండ్గఫోల్డ్‌
  ఎంతో మంది అగ్రశ్రేణి క్రీడాకారులు బ్లైండ్‌ఫోల్డ్‌ చెస్‌ ఆడుతారు. 1960లో బుడాపెస్ట్‌లో హంగరీ జాతీయుడెైన జానోస్‌ ఫ్లెచ్‌ ఏకకాలంలో 52మందితో ఆడి 31 గేమ్స్‌లో గెలిచాడు.

  మరికొన్ని విశేషాలు
  భూమ్యాకాశాల మధ్య తొలిసారిగా 1970 జూన్‌ 9న సూయన్‌ 9 సిబ్బంది చెస్‌ ఆడారు.మొదటి మెకానికల్‌ చెస్‌ క్లాక్‌ను థామస్‌ విల్సన్‌ 1883లో కనుగొన్నారు. అంతకంటే ముందు ఇసుక గడియారాలను ఉపయోగించారు. వీటిని మొదట 1862లో లండన్‌లో వినియోగించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న పుష్‌ బటన్‌ క్లాక్‌ను మొదటగా వీన్‌హాఫ్‌ 1900లో సరిదిద్దారు.అమెరికాలో చెస్‌ 1641లో మొదలెైంది. మొదటి టోర్నమెంట్‌ న్యూయార్క్‌లో 1843లో జరిగింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top