You Are Here: Home » ఇతర » చక్కని ఇళ్లకు ఆధునిక టైల్స్‌

చక్కని ఇళ్లకు ఆధునిక టైల్స్‌

అవసరాలు తీరడమే కాదు… అభిరుచులకు తగ్గట్టు ఉంటుంది. మెరిపించి, మురిపించే వర్ణాలకు కొదవ లేదు. నిర్వహణ బాదరబందీలు అతితక్కువ. ధర అంటారా… అందుబాటు లోనే. ఇన్ని ప్రత్యేకత లున్న ఫ్లోరింగ్‌ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంట్లో అడుగుపెట్టగానే అందరి దృష్టి ఫ్లోరింగ్‌ మీదే. అందుే క, ఫ్లోరింగ్‌ అనగానే ఏదో ఒకటి అనుకునే రోజులు పోయారుు. ఓ వైపు అవసరాలకు తగ్గట్టుగా, మరో వైపు ఇంటికి వచ్చిన అతిథుల్ని ఇట్టే ఆకర్షించే వాటికి ప్రాధాన్యం పెరిగిపో తోంది. ఇలాంటి కోవలోనే వస్తుంది వినైల్‌ ఫ్లోరింగ్‌. వినైల్‌ అంటే.. ఇదేదో కొత్తరకం అనుకునేరు. ప్లాస్టిక్‌గా పిలిచే పీవీసీ (పాలివినైల్‌ కో్ల రైట్‌)నే వినైల్‌ ఫ్లోరింగ్‌. కొన్ని రసాయనాలు, రంగుల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు.

పీవీసీ ఫ్లోరింగ్‌గా పిలిచే వినెైల్‌ రకం ప్రపంచవ్యాప్తంగా వాడ కంలో ఉంది. మన దగ్గర కూడా చాలాకాలంగా విని యోగంలో ఉన్నప్పటికీ, రంగులు, డిజెైన్లలో పెద్దగా అవకాశా లుండేవి కాదు. మారుతున్న వినియో గదారుల అభిరుచులకు అనుగుణంగా నేడు సరికొత్త రకాలు అందుబాటులోకి వచ్చా యి. విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. చిన్న చిన్న టైళ్ల రూపంలోనే కాకుండా, గది మొత్తం ఒకే షీట్‌తో కూడా ఈ ఫ్లోరింగ్‌ పరుచుకోవచ్చు. 11 అడుగుతో ఉండే టైళ్లు ఒక్కో బాక్‌లో 30 వస్తాయి.
వందకు పెైగా వర్ణాలు
Untit69ఎంపికలో కొదవలేని రంగులకు అవకాశం ఉండటం వినెైల్‌ ఫ్లోరింగ్‌ ప్రత్యేకత. మీ ఇంటీరియర్‌కు తగ్గట్టు ఎలాంటి వర్ణాన్ని అయినా ఇందులో ఎంచుకోవచ్చు. అంతే కాదు… వుడెన్‌ ఫ్లోరింగ్‌, మార్బుల్‌, విట్రిఫెైట్‌ ఫ్లోరింగ్‌లను పోలి ఉండే రకాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. పెైపూతగా కలప, పాలరాయితో కావల్సిన రంగుల్లో ఎంచుకోవచ్చు. రంగుల్లో సాదాసీదావే కాదు టెక్చ్సర్‌ రకాలు కూడా వినెైల్‌ ఫ్లోరింగ్‌లో దొరుకుతున్నాయి. గది మొత్తం ఒకటి, రెండు రంగులకే పరి మితం అవకుండా… అక్కడక్కడా కొట్టొచ్చినట్టు కూడా చేసు కోవచ్చు. దీని కోసం రకరకాల డిజెైన్లు, వర్ణాలతో ప్రత్యేకంగా పలకలు దొరుకుతాయి. వీటిని గది మధ్యలో, చివర్లో అక్కడ క్కడా పరిస్తే ఫ్లోరింగ్‌ ఆకట్టుకునేలా ఉంటుంది.

మందాన్ని బట్టి మన్నిక
దృఢంగానే కాదు దీర్ఘకాలం పాటు మన్నికగా ఉండే వినెైల్‌ ఫ్లోరింగ్‌ 0.5 మిల్లీమీటర్ల నుంచి 3 మిల్లీమీటర్ల మందంతో లభిస్తుంది. గృహావసరాలతో పాటు ఆఫీసులు, వాణిజ్య భవనా ల్లోనూ ఫ్లోరింగ్‌కు వినెైల్‌ను ఎంచుకోవచ్చు. ఇతర అవసరాలకు 3 ఎంఎం వరకు. ఇళ్లలో హాల్‌, బెడ్‌రూం, డ్రాయింగ్‌ రూంలతో పాటూ వంటింట్లోనూ భేషుగ్గా వాడుకోవచ్చు. కంప్యూటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడేచోట అనువుగా ఉంటుం ది. పిల్లలు, పెద్దలు నడిచేటప్పుడు జారిపోకుండా యాంటిస్కిడ్‌ రకం కూడా దొరుకుతుంది. అయితే ఈ రకంలో దుమ్ము పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుశ్రం చేసుకోవాలి.మందం ఎంత న్నది వాడే గదిని బట్టి ఉంటుంది. ఎక్కువమంది తిరిగే హాల్‌ వంటి గదుల్లో ఎక్కువమందం, పడగ్గదిలో తక్కువ మందంతో ఎంచుకుంటే సరిపోతుంది.

Unti6ఇళ్లలో గదిని బట్టి 0.5 మిల్లీమీటర్ల నుంచి 2 మిల్లీమీటర్ల వరకు వాడొచ్చు. ఎక్కువమంది తిరిగేచోట 2 ఎంఎం మందం ఉన్నది ఎంచుకుంటే సరిపోతుంది. సాధారణ వాడకానికి అయితే పదేళ్ల నుంచి పదిహేనేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. అంతకుమించీ వాడుకోవ చ్చు. కానీ, పెైనుండే మెరుపు కోల్పో యి అందవిహీనంగా మారుతుంది.ఇళ్లలో వాడే రకానికి చదరపు అడుక్కి ధర రూ.17 నుంచి రూ. 35 వరకు ఉంటుంది. అదే వాణిజ్య అవసరాలకు వాడే రకం అయితే రూ.40 నుంచి రూ.80 వరకు ఉంటుంది. వాడే చోటు, మందం, ఫినిషింగ్‌, రంగులను బట్టి ధరల్లో ఈ హెచ్చుతగ్గులన్నమాట. ఫ్లోర్‌ వేయడానికి అయ్యే ఖర్చు అదనం. అతికించడానికి వాడే మెటీరియల్‌తో కలుపుకుని చదరపు అడుక్కి రూ.4 నుంచి రూ.6 అవుతుంది.

ఎంత సులువో!
వినెైల్‌ ఫ్లోరింగ్‌కు నిర్వహణ అతి తక్కువగా ఉంటుంది. రోజుకో సారి తడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది. దుమ్ము పడ్డా వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవచ్చు. తేమను సమర్ధంగా తట్టుకుం టుంది. నీళ్లు పడ్డా ఇబ్బంది ఉండదు. నాచు ఏర్పడకుండా నిరో ధిస్తుంది. అయితే టైల్‌ రకంలో మాత్రం నీళ్లు ఎక్కువ సేపు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేదంటే అతుకుల మధ్యలోంచి కిందికిపోయి, సొల్యూషన్‌ కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి చోట పెద్ద పరిమాణంలో షీట్‌ వినెైల్‌ను ఎంచుకుంటే ఈ ఇబ్బందిని నిరోధించవచ్చు.

గది మొత్తం గంటలోనే
వినెైల్‌ ఫ్లోరింగ్‌ వేయడం తేలికైన వ్యవహారమే. 100 చదరపు అడుగుల గదికి గంటలో వేయొచ్చు. నెైపుణ్యం ఉన్న వారితో చేయించుకుంటే త్వరగా పని పూర్తవడమే కాదు, టైల్‌కు టైల్‌కు మధ్య అతుకులు కన్పించవు. విట్రిఫెైడ్‌ను పోలి ఉండే టైళ్లు కూడా వినెైల్‌లో దొరుకుతున్నాయి.

ఇళ్లలో గదిని బట్టి 0.5 మిల్లీమీటర్ల నుంచి 2 మిల్లీమీటర్ల వరకు వాడొచ్చు. ఎక్కువమంది తిరిగేచోట 2 ఎంఎం మందం ఉన్నది ఎంచుకుంటే సరిపోతుంది. సాధారణ వాడకానికి అయితే పదేళ్ల నుంచి పదిహేనేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. అంతకుమించీ వాడుకోవచ్చు. కానీ, పెైనుండే మెరుపు కోల్పోయి అందవిహీనంగా మారుతుంది.వినెైల్‌ ఫ్లోరింగ్‌కు నిర్వహణ అతి తక్కువగా ఉంటుంది. రోజుకోసారి తడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది. దుమ్ము పడ్డా వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవచ్చు. తేమను సమర్ధంగా తట్టుకుంటుంది. నీళ్లు పడ్డా ఇబ్బంది ఉండదు. నాచు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అయితే టైల్‌ రకంలో మాత్రం నీళ్లు ఎక్కువ సేపు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top