You Are Here: Home » సఖి » అందం » చండ్రు తగ్గాలంటే..

చండ్రు తగ్గాలంటే..

చండ్రు తగ్గాలంటే..

కొప్పు ఉన్న అమ్మ ఎలా వేసినా అందమే అన్నట్లు. జుట్టుకి ఎంత పోషణ చేస్తే మన అందం అంత రెట్టింపు అవుతుంది. జుట్టు నల్లగా నిగనిగలాడితే సరిపోదు, చుండ్రు లేకుండా జాగ్రత్తపడాలి. అందుకే కొన్ని చిట్కాలు..

– పెరుగు తోడుకున్న తర్వాత పైన నీరు పేరుకుంటుంది. నాలుగు స్పూన్ల ఆ పెరుగు నీటికి, 4 స్పూన్ల కర్పూరద్రావణాన్ని కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

– మెంతి ఆకులను బాగా నూరి జుట్టుకు రాయాలి. పావుగంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది.

– గోరువెచ్చని నీటిలో.. కొబ్బరిపాలు, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగిస్తే చుండ్రు మాయమవుతుంది.

– శిడార్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలిపి రాత్రి పడుకునే ముందు తలకు ఆపె్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడడమే కాకుండా, చుండ్రు బాధ తగ్గుతుంది.

– వారానికొకసారి గిలకొట్టిన పచ్చసొనను రాస్తే జుట్టుకు కండీషినర్‌గా పనిచేస్తుంది,చుండ్రూ పోతుంది.

– ఆల్కహాల్‌బాందీ)జుట్టుకు ఆపె్లై చేయడం వల్ల కూడా చుండ్రును తగ్గించవచ్చు. ఇది మంచి కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top